
మనం దేవుడు చెప్పిన విధంగా ఈ లోకానికి అధికారి అయిన అపవాది ఎలాగ ప్రపంచాన్ని సాటనిజం,ఇల్లుమినాటి ఇలాంటి సీక్రెట్
సొసైటీస్ ద్వారా ఎలా ఏలుతున్నాడు అనేది మనం క్లియర్ గా తెలుసుకుందాం అయితే ఇప్పుడు వీళ్ళందరి ద్వారా సాతాను అసలు ఏం
చేయాలనుకుంటున్నాడు మనం బైబిల్ లో చూసితెలుసుకుందాం రండి అవి సర్వాధికారి అయిన దేవుని మహా దినమున జరుగు
యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవలెనని వారి యొద్దకు బయలు వెళ్లి ఇక్కడ సర్వాధికారి అయిన దేవుడు
నియమించిన మహా దినమున జరగబోయే యుద్ధానికి అపవాది అయినసాతాను లోకమంతటా ఉన్న రాజులందరినీ యుద్ధానికి పోగు
చేయబోతున్నాడని ఇక్కడ క్లియర్ గా బైబిల్ చెప్తుంది ఆరవ దూత తనపాత్రను యూఫ్రెటిస్ అను మహానది మీద కుమ్మరింపగా తూర్పు
నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయెను మరియు ఆ ఘట సర్పము నోట నుండియు క్రూర
మృగము నోట నుండియు అబద్ధ ప్రవక్త నోట నుండియు కప్పల వంటి మూడు అపవిత్రాత్మలు బయలు వెళులుగా చూచితిని ఆరవ
దేవదూత తన పాత్రను యూఫ్రటిస్ నది మీద కుమ్మరించినప్పుడు ఆ నది ఎండిపోయింది అక్కడ యుద్ధం జరగడానికి మార్గం సిద్ధం
చేస్తుంది అయితే దాని తర్వాత ఘటసర్పం క్రూరమృగం అబద్ధ ప్రవర్తల నోళ్ళ నుండి వచ్చే మూడు అపవిత్ర ఆత్మలు లోకమంతటా
ఉన్న రాజులను యుద్ధం చేయడానికి పోగు చేస్తున్నాయని తెలియజేయబడుతుంది అసలు లోకమంతటా ఉన్న రాజులని ఈ
ఘటసర్పం క్రూరమృగం మరియు అబద్ధ ప్రవర్తలు కలిసి యుద్ధానికి పోగు చేస్తున్నారు. ఇంతకీ ఆ ఘట సర్పం ఎవరు కాగా
సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియుసాతాను అనియు పేరు గలది సర్పమైన ఆ మహా ఘట సర్పము పడద్రోయబడెను అది
భూమి మీద పడద్రోయబడెను దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి ఇక్కడ ఘటసర్పం అంటేసాతానేనని మనకు
అర్థమవుతుంది
అంతట పరలోకమందు ఇంకొక సూచన కనబడెను ఇదిగో ఎర్రని మహా ఘట సర్పము దానికి ఏడు తలలును పది కొమ్ములను ఉండెను
దాని తలల మీద ఏడు కిరీటములు ఉండెను ఆ ఘటసర్పము రంగుకు ఎర్రదని దానికి ఏడు తలలు పది కొమ్ములు ఉంటాయని అలాగే
దాని తల మీద ఏడు కిరీటాలు ఉంటాయని బైబిల్ చెప్తుంది అంతట పరలోకమందు యుద్ధము జరిగెను మికాయేలును అతని దూతలను
ఆ ఘట్ట సర్పముతో యుద్ధము చేయవలెనని ఉండగా ఆ ఘట్ట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి గనుక
పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయెను అయితే ఈ ఘటసర్పమైన సాతాను పరలోకంలో కూడా దేవుడికి వ్యతిరేకంగా తనకి
సైన్యాన్ని ఏర్పరచుకొని దేవుడి మీదనే తిరుగుబాటు చేసి దేవుడి దూత అయిన మికాల్ తో యుద్ధం చేసినవాడు సాతాను పరలోకంలో
దేవుడికి వ్యతిరేకంగా సైన్యాన్ని ఏర్పరచుకొని దేవుడి మీద ఎలాగ తిరుగుబాటు చేశాడని రాబోయే రోజుల్లో మనం తెలుసుకుందాం
అయితే ఇప్పుడు ఘటసర్పం అంటే సాతానే అని మనకు అర్థమైంది ఇక క్రూరమృగం గురించి బైబిల్ లో చూద్దాం మరియు పది
కొమ్ములను ఏడు తలలును గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని దాని కొమ్ముల మీద పది
కిరీటములను దాని తలల మీద దేవ దూషణకరమైన పేర్లును ఉండెను ఇక్కడ క్రూర మృగం కూడా ఘటసర్పమైన సాతాను లాగానే
ఏడు తలలు పది కొమ్ములు కలిగి ఉంది అంత మాత్రమే కాకుండా అది దేవునికి వ్యతిరేకంగా ఉంటూ దేవుడు దూషించే పేర్లు కలిగి ఉంది
ఇక దీని రూపం ఎలా ఉందో ఒకసారి మనం చూస్తే నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలి ఉండెను దాని పాదములు ఎలుగుబంటి
పాదముల వంటివి దాని నోరు సింహపు నోరు వంటిది దానికి ఆ ఘట్ట సర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును
ఇచ్చెను ఇక్కడ ఘటసర్పమే అనగా సాతానే స్వయంగా ఈ క్రూర మృగానికి అధికారం అప్పగిస్తున్నాడని బైబిల్ చెప్తుంది బైబిల్ లో
దానియేలు గ్రంధంలో కూడా అంత్యదినాల గురించి అనేకమైన విషయాలు ఉన్నాయి ఈ దానియేలు గ్రంధంలో కూడా
ఇలాంటి పోలికలతో ఉన్న కొన్ని క్రూరమైనజంతువులు ఉన్నాయి అప్పుడు నాలుగు మిక్కిలి గొప్ప జంతువులు మహా సముద్రములో
నుండి పైకెక్కెను ఆ జంతువులు ఒకదానికొకటి భిన్నములై ఉండెను ఈ నాలుగు జంతువులు కూడా మహా సముద్రంలో నుండి పైకి
వచ్చినట్లుగా దానియేలుకు దర్శనాలు కలిగాయి నీవు చూచిన జలములు ప్రజలను జన సమూహములను జనములను ఆయా
భాషలు మాట్లాడు వారిని సూచించును ఇక్కడ గమనించినట్లయితే జలములు అంటే ప్రజలు జనసమూహం అంటే ఆయా భాషలు
మాట్లాడే దేశాలు అంటే ఆ మహాసముద్రంలో నుండి వచ్చే ఆ క్రూర మృగాలు ప్రపంచంలో ఉన్న బలమైన రాజ్యాలు ఆ నాలుగు
జంతువులు నాలుగు రాజ్యాలు మొదటిది సింహమును పోలినది కానీ దానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలు ఉండెను మొదటిది
సింహాన్ని పోలి పక్షిరాజు రెక్కలతో ఉంది అంటే ఇది బాబులోని సామ్రాజ్యాన్ని సూచిస్తుంది ఈ బాబులోని పాలన ఎంత భయంకరంగా
ఉంటుందంటే వారి మాట వినకపోతే ఎవ్వరినైనా ఎంతమందినైనా ప్రజలు చూస్తుండగానే అత్యంత వేడి గల గుండములో త్రోసివేసి ఆ
మంటలు తట్టుకోలేక వారు కేకలు వేస్తుంటే ఆ బాబిలోనియన్ లోని రాజులు అధికారులు అక్కడే కుర్చీ వేసుకొని మరి వారిని చూస్తూ
వికృతంగా నవ్వుకొని సంతోషించేవారు వాళ్లకు వ్యతిరేకంగా ఉండే రాజ్యాలు ఎంత గొప్పవైనా ధ్వంసం చేసేస్తారు దేవాలయాలని
నిధులని అన్నిటిని కూడా సమూలంగా దోచుకునేవారు కనీసం తినడానికి కూడా ఏమీ మిగల్చకుండా పంటలను సైతం నాశనం
చేసేవారు ఊర్లకు ఊర్లను తగలబెట్టేసేవారు ఎంత పెద్ద చరిత్రాత్మకమైన కట్టడాన్ని సైతం కూల్చేసేవారు వాళ్ళు ఆక్రమించిన ప్రాంతాల్లో
ఉండే వాళ్ళు ఎవరైనా పేదలైన ధనవంతులైన జ్ఞానులైన చివరికి రాజుల బిడ్డలైన వారికి సంబంధించిన పిల్లలందరిని బానిసలుగా
చేసుకొని కఠినమైన పనులు చేపించుకునేవారు అంత మాత్రమే కాకుండా మరల వాళ్ళలో నుండి తిరిగి సంతానం అనేది రాకుండా
వాళ్ళని నపుంసకులుగా మార్చేవారు బీదల పైన ఏ మాత్రం కనికరం ఉండదు బలంగా ఉండే వాళ్ళని బానిసలుగా తీసుకొని వెళ్లి
నపుంసకులుగా చేసి మానసికంగా కూడా ఎంతగానో వేధించి వారి స్వార్ధానికి వాళ్ళని ఉపయోగించుకునేవారు వీళ్ళు జ్యోతిష్యులకు శకున
గ్రాండ్లకు మాంత్రికులకు గారడి విద్య చేసే వారికి అత్యంత ఇచ్చేవారు వీళ్ళు తినమన్నదే తినాలి వారు త్రాగమన్నదే తాగాలి ఇలాంటి
కఠినమైన నిబంధనలు ఉంచేవారు కనీసం జంతువుల్ని పశు సంపదని కూడా వారు నాశనం చేయకుండా విడిచిపెట్టేవారు కాదు
బాబులోని అక్రమ విధానం ఎంత భయంకరంగా ఉంటుంది అనేది బైబిల్ లో చదివితే ఈ విషయాలన్నీ మనకు క్లియర్ గా
అర్థమవుతాయి రెండవ జంతువు ఎలుగుబంటిని పోలినది అది ఒక పార్శ్వము మీద పండుకొని తన నోట పండ్ల మధ్య మూడు ప్రక్కట
ఎముకలను పట్టుకొనినది కొందరు లెమ్ము విస్తారముగా మాంసము భక్షించుము అని దానితో చెప్పిరిరెండవది ఎలుగుబంటిని పోలి ఉంది
ఇది పర్షియన్ కింగ్డమ్ ని సూచిస్తుంది అప్పట్లో బలమైన రాజ్యాలైనా ఇందాక మనం మాట్లాడుకున్న బాబిలోనియన్ ని ఈజిప్టియన్స్ ని
లిరియన్స్ ని ఈజిప్ట్ ఇండియా వరకు మొత్తాన్ని లోపరుచుకొని ఒక బలమైన రాజ్యంగా ఎదిగింది వాళ్ళు చేసిన శాసనాన్ని గనుక దిక్కరిస్తే
సింహాల గృహలో సింహాలకి మనుషులను ఆహారంగా వేసేవాళ్ళు భయంకరమైన బాబులోని సామ్రాజ్యాన్ని కూడా ఆక్రమించారు అంటే
వాళ్ళు ఎలాంటి వారో మనం అర్థం చేసుకోగలం తమ గొప్పతనాన్ని తెలియజేయడానికి రాజులను పిలిచి గొప్ప గొప్ప విందులు చేసేవారు
వాళ్ళు చేసే ఒక్క విందు సుమారు ఆరు నెలలు ఉండేది తమ ఆజ్ఞలను దిక్కరిస్తే తమ రాణులను సైతం విడిచిపెట్టరు అవసరమైతే
రాణులను సైతం చంపేసేవారు వారి పర్మిషన్ లేకుండా వారి రాణి అనగా వారి భార్య దగ్గరికి వచ్చిన గాని ఆ రాజులు వారి రాణిని
చంపేసేవారు ఏ తెగనైనా జాతినైనా చంపమని శాసిస్తే రాజ్యం మొత్తంలో ఆ జాతికి సంబంధించిన వారు కనీసం ఒక్కరు కూడా ప్రాణాలతో
మిగిలి ఉండలేరు వారికి కావాలనుకుంటే కన్యకల్ని హటాత్తుగా బందీలుగా తీసుకొని వెళ్ళేవారు ఇది తప్పు అని చెప్పడానికి కూడా ఆ
రాజ్యంలో ఏ ఒక్కరికి ధైర్యం సరిపోయేది కాదు వారు చేసిందే శాసనం అన్నట్లుగా ఉండేది అటు పిమ్మట చిరుతపు పులిని పోలిన
మరియొక జంతువును చూచితిని దాని వీపున పక్షి రెక్కల వంటి నాలుగు రెక్కలు ఉండెను దానికి నాలుగు తలలు ఉండెను దానికి
ఆధిపత్యం ఇయ్యబడెను మూడవది చిరుతుపులి ఇది చిరుతులు లాంటి వేగాన్ని కలిగి ఉంటుంది గ్రీక్స్ కి చెందిన అలెగ్జాండర్ ద గ్రేట్
ని సూచిస్తుంది ఊహించలేనంత వేగంతో హటాత్తుగా ఆఫ్రికా ఏషియా మిడిల్ ఈస్ట్ లోని ఎన్నో ప్రాంతాలను యుద్ధం ద్వారా
గెలుచుకున్నాడు అలెగ్జాండర్ ఓటం అనేది లేకుండా వెళ్ళిన ప్రతి చోట గెలుచుకుంటూ అత్యంత వేగంగా ముందుకు దూసుకొని
వెళ్ళేవాడు అలెగ్జాండర్ యుద్ధానికి వస్తున్నాడు అంటే ఆయా ప్రాంతాల వారు భయభ్రాంతులకు గురయ్యేవారు మరికొన్ని
రాజ్యాలు అయితే అసలు యుద్ధమే లేకుండా భయంతో లొంగిపోయేవారు యుద్ధ సమయంలో అవసరమైతే ఆయా ప్రాంతాలను
తగలబెట్టేవారు వాడు అక్కడున్న ఆడవారిని రేప్ చేయడానికి తన సైనికులను విడిచిపెట్టేవాడు ఇలా ఎన్నో ప్రాంతాలను
ఆక్రమించుకున్న అలెగ్జాండర్ ఒక్కసారిగా 32 వయసులోనే హటాత్తుగా మరణించాడు తన మిలిటరీ జనరల్స్ అయిన నలుగురు
బలమైన వ్యక్తుల మధ్య ఈ గ్రీక్ ఎంపైర్ డివైడ్ అయింది ఘోరమును భయంకరమునగు నాలుగవ జంతువు ఒకటి కనబడెను అది తనకు
ముందుగా నుండిన ఇతర జంతువులకు భిన్నమైనది అది మహా బల మహత్యములు గలది దానికి పెద్ద ఇనుప దంతములను పది
కొమ్ములు నుండెను అది సమస్తమును భక్షించుచు తుత్తునీయులుగా చేయుచు మిగిలిన దానిని కాళ్ళ క్రింద అనగద్రొరుకుచుండెను
చెప్పిన మూడు జంతువుల కంటే అనగా మూడు సామ్రాజ్యాల కంటే అత్యంత భయంకరమైనది బలమైనది ఘోరమైనది ఈ నాలుగో
సామ్రాజ్యం ఇది రోమన్ సామ్రాజ్యాన్ని సూచిస్తుంది ఈ రోమన్ ఎంపరర్స్ ప్రజలను తమకు బానిసలుగా చేసుకునేవారు ఎవరైనా 10 15
మంది ఒక దగ్గర కలిసి మాట్లాడుకోవాలన్న కూడా వారు పర్మిషన్ తీసుకోవాలి వారు ఆక్రమించుకున్న ప్రజలపై అత్యంత పనుల
భారాన్ని ఉంచేవారు సర్కస్ పేరట కొంతమందిని బంధించి అందరి ముందు కొన్ని సింహాలను వారి మీదకు వదిలి అవి వారిని
తింటుంటే రాక్షసంగా ఆనందించేవారు ఆడ మగ అనే తేడా లేకుండా బగబగ మండుతున్న ఇనప కుర్చీల మీద ఒంటి మీద బట్టలు
కూడా లేకుండా చిత్ర హింసలు పెట్టి వారిని కొట్టి కుర్చీల మీద కూర్చోబెట్టి వారి మాంసం వేడికి ఉడికిపోతుంటే వారు వేసే కేకలపై
పైశాచిక ఆనందాన్ని పొందేవారు ఇంతకు ప్రకటన గ్రంధంలో ఉన్న క్రూర మృగానికి ఇప్పటివరకు మనం డానియల్ గ్రంధంలో చూసిన
క్రూర మృగాలకి ఆ రాజ్యాలకి వారి ప్రవర్తనలకు సంబంధం ఏంటి నేను చూచిన ఆ మృగము చిరుతపు పులిని పోలి ఉండెను దాని
పాదములు ఎలుగు వంటి పాదముల వంటివి దాని నోరు సింహపు నోరు వంటిది దానికి ఆ ఘట సర్పము తన బలమును తన
సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చెను ప్రకటన గ్రంధంలో చెప్పబడిన ఈ యొక్క క్రూర మృగం చిరుతపు పులి పోలికలతో
ఎలుగుబంటి పాదాలతో సింహపు నోరు కలిగి ఘటసర్పం యొక్క బలము కలిగి ఉంటుంది అపవాది అయిన సాతాను చేత ప్రేరేపింపబడి
సాతాను అధికారం చేత ఇంతకు ముందున్న ఆ నాలుగు జంతువులు ఆ నాలుగు రాజ్యాలు ఎలాగైతే క్రూరంగా భయంకరంగా ఉన్నాయో
ఇప్పుడు ఈ క్రూర మృగం యొక్క రాజ్యం ఈ నాలుగు రాజ్యాలలో ఉన్న భయంకరత్వాన్ని క్రూరత్వాన్ని మొత్తం కలిగి ఒకటే రాజ్యంలో
ఉండబోతుంది దీనికి స్వయంగా సాతానే అధికారం ఇస్తాడని బైబిల్ చెప్తుంది సింహం లాగా మ్రింగేస్తూ ఎలుగుబంటి లాగా నలిపేస్తూ
చిరుతపులి అంత వేగంతో ఈ క్రూర మృగం ఒక రాజ్యం వస్తుంది ఇదంతా కేవలం క్రూర మృగం యొక్క ఇంట్రడక్షన్ మాత్రమే
అసలు ఆ క్రూరమృగం యొక్క రాజ్యం ఎంత భయంకరంగా ఉంటుంది అసలు అబద్ధ ప్రవర్త ఎవరు వీడికి సాతాను అధికారం ఇచ్చి
ప్రపంచాన్ని ఏం చేయబోతున్నాడు అసలు ఘటసర్పం క్రూర మృగం అబద్ధ ప్రవర్తలు కలిసి ఏం చేయబోతున్నారు
ఇవన్నీ మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం.