యేసయ్య మాటలు – జీవపు ఊటలు
యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలిసికొనుడి ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు కీర్తన 34:8

ఎంత నీచమైన స్థితిలో ఉన్న మనిషినైనా ప్రేమించగలిగే గొప్ప మనసు యేసునిది ఎంత మంచి మనిషిలోనైనా లోపాలు వెదికే నీచమైన మనసు మనిషిది ఎంత ఘోరపాపినైనా చేర్చుకోగలిగే గొప్ప క్షమాగుణము దేవునిది చేసిన తప్పు చిన్నదే అయినా మాటిమాటికి దానిని గుర్తుచేసుకొని క్షమించలేని మనసు మానవునిది అందుకే యేసుని ప్రేమను, క్షమను రుచిచూడని మానవ జన్మ వ్యర్థం మిత్రమా! ఇప్పటికైనా దేవుని ప్రేమను రుచిచూడు అప్పుడు లోకప్రేమలేవీ నిన్ను ఆకర్షించలేవు లోకప్రేమలో పడిపోయి మోసపోయే స్థితి నీకు రాదు. ఆమెన్
మంచి మాట
దేవుని ప్రేమను రుచి చూసిన వానికి లోక ప్రేమలన్నీ చప్పగా ఉంటాయి