కోపాన్ని అదుపు చేసుకోవడానికి సహాయపడే బైబిల్ సూత్రాలు బైబిల్ నుండి ఆధ్యాత్మిక సత్యాలు

కోపాన్ని అదుపు చేసుకోవడానికి సహాయపడే బైబిల్ సూత్రాలు

బైబిల్ నుండి ఆధ్యాత్మిక సత్యాలు

కోపాన్ని అదుపు చేసుకోలేకపోవడమే నిజమైన బలహీనత

ఏసుక్రీస్తు వారి మనస్తత్వాన్ని నేర్చుకున్నప్పుడు మన మనస్సును స్వాధీనపరుచుకునే లక్షణం అలవర్చుకుంటాం

పరాక్రమశాలికంటె దీర్ఘశాంతముగలవాడు శ్రేష్ఠుడు పట్టణము పట్టుకొనువానికంటె తన మనస్సును స్వాధీన పరచుకొనువాడు శ్రేష్ఠుడు సామెతలు 16:32

కోపం మనలను పాపం వైపు నడిపిస్తుంది తద్వారా కీడుకు కారణమవుతుంది

కోపాన్ని అన్ని సందర్భాల్లో రాకుండా ఆపలేకపోవచ్చు గాని దీర్ఘకాలంగా కోపాన్ని పొడిగించకుండా అదుపుచేసుకోగలం

కోపపడుడి గాని పాపము చేయకుడి; సూర్యుడస్తమించువరకు మీ కోపమునిలిచియుండకూడదు

2 4:26

కోపమును విసర్జించి ఒకని ఎడల ఒకడు దయ కలిగి ఉండడం వల్ల సమస్యలు త్వరగా పరిష్కరించబడతాయి

సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి.ఒకని యెడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి

2 4:31-32

మనం కోపబడటం ద్వారా ఇతరులు మనతో స్నేహం చేయడానికి మక్కువ చూపరు. మీకు ఎంత ఎక్కువ కోపం ఉంటే అందరూ మీకు అంత దూరంగా ఉంటారు

ఒకవేళ స్నేహం చేసినప్పటికీ వారి అవసరాలు తీరిన తర్వాత నీ కోప స్వభావాన్ని బట్టి విడిచి వెళ్ళిపోతారు

కోపచిత్తునితో సహవాసము చేయకుము క్రోధముగలవానితో పరిచయము కలిగి యుండకుము.నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకొందువేమో

సామెతలు 22:24-25

తక్కువ మాట్లాడటం ఎక్కువ వినడం ద్వారా కోపాన్ని తగ్గించుకోవచ్చు

నా ప్రియ సహోదరులారా, మీరీసంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదా నించువాడునై యుండవలెను

యాకోబు 1:19

Leave a Comment