
దేవుని వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది మన దేవుడు కృపగలవాడు ఆయన వాత్సల్యత కలిగిన దేవుడు ఆయన కొన్నిసార్లు మన అవిధేయతను బట్టి తిరుగుబాటు తనాన్ని బట్టి దేవుడు దూరం దూరంగా జరిగిపోయినప్పటికీ కూడా దేవుడు ఇంకనూ తన దయగల చేతుల్లో మన పట్ల చాపి ఆయన మనల్ని పిలుస్తూనే ఉన్నాడు తనకు దగ్గరగా జీవించాలని ప్రభువు ఆశిస్తున్నాడు దేవుని దగ్గరికి రండి అప్పుడు ఆయన మీ దగ్గరికి వస్తాడు అనే లేఖన సత్యం మనకు తెలుసు కదా అంటే దేవునికి మనం ఎంత దగ్గరగా వస్తూ ఉంటామో ఆయన ప్రభావాన్ని ఆయన మహిమను ఆయన శక్తిని అంత గొప్పగా మనం అనుభవిస్తూ ఉంటాం దేవుని కృప మరియు ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుంది కాబట్టి మనమందరం సజీవులుగా ఉన్నాం ఎంత మహిమగల దేవుణ్ణి మనం ఆరాధన చేస్తున్నాం బహుశా గతించిన సంవత్సరం అంతా మీ జీవితాల్లో చీకటిని అనుభవించారేమో చీకటిలో ప్రయాణం చేసిన అనుభవాలు మీలో ఉన్నాయేమో బాధపడుతున్నారేమో నెమ్మది కొరకు మీరు అలమటించి శాంతి సమాధానాల కోసం వెంపర్లాడి ఫెయిల్ అయ్యారేమో లేదా కొన్ని సందర్భాల్లో ఇంక నాకు ఆశలు ఏమీ లేవు నా ఆశలని గతించిపోయాయి నాకు నిరీక్షణ లేదని విసిగి వేసారపోయిన పరిస్థితులు నీవు ఎదుర్కొంటున్న నిందలను బట్టి అవమానాలను బట్టి అనారోగ్యాలను బట్టి లేదా అప్పు బాధలను బట్టి పాపంతో పోరాడుతూ అనేక సందర్భాల్లో శోధనలో పడిపోయి ఓడిపోయిన అనుభవాన్ని బట్టి ఒకలాంటి గిల్ట్ అండ్ షేమ్ నిన్ను ఏలుబడి చేస్తున్నాయేమో నువ్వు దేవుని వైపు తిరిగి రావాలని ఆశిస్తే ఆయన చేతులకు నీ జీవితాన్ని సమర్పించుకోగలిగితే దేవుడు కృపగలవాడు ఆయన కృప వాత్సల్యత ఆయన దయ చాలా గొప్పది ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది అనే మాట మనం చూస్తున్నాం దేవుడు నిత్యుడు గనుక ఆయన శాశ్వతుడు గనుక ఆయనకు సంబంధించినవి కూడా శాశ్వతంగానే ఉంటాయి తన వాత్సల్యతను దేవుడు నీ నుండి త్రోసివేయలేడు త్రోసివేయలేడు కూడా ఆయన వైపు నువ్వు చూడగలిగితే దేవుడు ఎంతగానో దీవించబోతున్నాడు నువ్వు ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందడానికి నిర్ణయించుకుంటే నీ అభివృద్ధిని ఏ ఒక్కరూ ఆపలేరు ప్రభువు కోసం నువ్వు జీవించగలవు ఆయన ప్రేమ ఎప్పుడూ విఫలం కాలేదు ఆయన కృప విఫలం కాలేదు ఆయన వాత్సల్యత విఫలం కాలేదు నిన్ను నిలబెట్టేది దేవుడాయన ఓటమి అంచునుంచి విజయ తీరాలకు చేరుస్తాడు యెహోవా కృపగలవాడు మనం ఆత్మలో రక్షించబడి ఉన్నామంటే అది కేవలం దేవుని కృప మాత్రమే మన భక్తి కార్యక్రమాలు మన యొక్క దానధర్మాలు మన యొక్క లోక సంబంధమైన కార్యాలు మనకు రక్షణ ఇవ్వలేదు దేవా దేవుడు తన కృప ద్వారా మాత్రమే మనం మంచి వారమని దేవుడు జ్ఞాపకం చేసుకొని తన కృపను మన మీద వెల్లడి చేశాడు గనుక తన కృపను మన మీద కుమ్మరించాడు గనుక మనం రక్షించబడ్డాం కృప ద్వారా విజయం ఉంది కృప ద్వారా స్వస్థత ఉంది కృప ద్వారా విడుదల ఉంది ఒక మాటలో చెప్పాలంటే నీకు కావలసిన ప్రతి ఆశీర్వాదము దేవుని కృపలో లభ్యమవుతున్నాయి నా జీవితంలో ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంటుందేమో నా జీవితంలో ఇదే అశాంతి ఇదే అసమాధానం కొనసాగుతూ ఉంటుందేమో నా బ్రతుకులో మార్పు రావట్లేదని నిరుత్సాహం నీలో ఉంటే ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు దేవుని వాత్సల్యత ఇంకా ఇంకా అధికము కాబోతుంది దేవుని కృప ఆయన వాత్సల్యత నీ మీద సమృద్ధిగా దేవుడు కుమ్మరిస్తున్నాడు ఆయన కృప మనకు ఎంతగా తోడు ఉంటుందంటే మన బలహీనతల్లో దేవుని కృప మనకు తోడైతే నూతన బలాన్ని మనం పొందుకుంటాం దేవుడు సమస్త ఆనందముతో నిరీక్షణతో నిన్ను నింపుతున్నాడు .
for instagram click this 👉 urjesus4u for youtube click this 👉 urjesus4u #urjesus4u #urjesus4u.com
instagram 👉 urjesus4u
youtube 👉urjesus4u