అతడు యెహోవాను ఆశ్రయించినంతకాలము దేవుడు అతని వర్ధిల్లజేసెను

యేసయ్య మాటలు – జీవపు ఊటలు

 

అతడు యెహోవాను ఆశ్రయించినంతకాలము దేవుడు అతని వర్ధిల్లజేసెను

 

ఉజ్జియాకు దేవుడు పదహారు సంవత్సరాలకే రాజయ్యే స్థితినిచ్చాడు. అతడు దేవుని సేవకుడైన జెకర్యా ఆధ్వర్యములో దేవుని ఆశ్రయించినతకాలం దేవుడు ఉజ్జియాను బహుగా ఆశీర్వదించాడు. కానీ ఉజ్జియా మదించి, గర్వించి, సేవకుల మీద కోపించి, సేవకుని స్థానాన్ని ఆశించి, చివరకు కుష్ఠురోగముతో భ్రష్టమైన మరణాన్ని పొందాడు. మిత్రమా! నీకు ఏమీ లేని స్థితిలో దేవుని ఆశ్రయించి, ఇప్పుడు దేవుడు నిన్ను బహుగా దీవించాక నీ స్థితిని బట్టి గర్విస్తున్నావేమో జాగ్రత్త. దేవునికి హెచ్చించడం తెలుసు. దించడం కూడా తెలుసు. గనుక గర్వించక కృతజ్ఞతకలిగి ఉండి, జీవితకాలం దేవుని ఆశ్రయయించేవారముగా ఉందముగాక. ఆమెన్

 

మంచి మాట

ఒక పాపానికి తావిస్తే, ఆ ఒక్క పాపము అనేక పాపాలకు కారణం అవుతుంది. చివరకు పాపము చేయడము నీకు అలవాటవుతుంది. — జాన్ బన్యన్

Leave a Comment