2కోరింథీయులకు 2:14 మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనుపరచుచు ఆయనయందు మమ్మును ఎల్లప్పుడు విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము.

 

urjesus4u
urjesus4u.com

 

క్రీస్తు ప్రభువు ద్వారా మనకు అన్నింటిలో విజయం ఉందని లేఖనాలు సెలవిచ్చాయి పాపం మనిషిని ఓటమికి ఈడ్చుకుని పోయింది

పాపం మనిషిని అవమానానికి తీసుకుని పోయింది పాపంలో బ్రతికే ఏ ఒక్కడు కూడా నిజంగా గెలిచినట్టు కాదు వారు భౌతిక సంబంధమైన

విషయాల్లో గెలిచినట్టుగా కనబడొచ్చు ఏమో గాని వారి యొక్క అంతరంగంలో ఓడిపోయిన స్థితిలో ఉన్నారు పడిపోయిన స్థితిలోనే

ఉన్నారు యేసు ప్రభువు వారు సిలువలో మన కోసం మరణించి తన ప్రాణాన్ని మన కోసం అర్పించి ధారధారలుగా తన రక్తాన్ని మన

కోసం కార్చి మనలను తన రక్తంలో కడిగి పవిత్ర పరిచిన తర్వాత అన్నింటిలో మనకు విజయాన్ని ఇవ్వాలనేది దేవుని యొక్క ఆలోచన

ఓటమిలోనూ ఉండాలని ప్రభువు అనుకోవట్లేదు నువ్వు బ్రతకడం దేవుని ఉద్దేశం కాదు ఒకవేళ ఇంతవరకు నీ జీవితంలో నీవు చేసిన

పాపం ద్వారా నీవు చేసిన తప్పుడు పనుల ద్వారా పొరపాట్ల ద్వారా ఓటమి పాలై కృంగి  భయపడుతున్నావా కలవరపడుతున్నావా నువ్వు

ఆ స్థితిలోనేఉండిపోవడం దేవుని చిత్తం కాదు నువ్వు లేవాలి దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు అనే విషయాన్ని నువ్వు నమ్మాలి యేసు

క్రీస్తు ప్రభువులో నీ విజయము ఎల్లప్పుడూ సురక్షితంగా ఉందని గుర్తించాలి యేసు ప్రభువు సిలువలో మరణించినప్పుడే నీ విజయం

ప్రకటించబడింది  ఆ విజయాన్ని స్వీకరించి దేవుని కోసం బ్రతకడమే పౌలు అంటున్నాడు మా ద్వారా ప్రతి స్థలమందు యేసు క్రీస్తు

ప్రభువు అనే సువాసన వెదజల్లుబడిన నిమిత్తము క్రీస్తు ప్రభువుకి జ్ఞానము వెదజల్లబడాలి వ్యాప్తి చెందించబడాలి   యేసు క్రీస్తు ప్రభువు

యొక్క జ్ఞానము సువాసన కలిగించే జ్ఞానం మన జీవితాల్లో క్రీస్తు ప్రభువును గురించిన జ్ఞానాన్ని వెదజల్లే వారంగా మనం ఉన్నామా

విజయోత్సవంతో దేవుడు మనల్ని నింపాడు ఎంతో మంది ఇప్పటికి కూడా ఓటమిలో ఏడ్చే వాళ్ళు ఉన్నారు నా బ్రతుకు అయిపోయింది

నా జీవితం అయిపోయింది ఈ పాపం నుండి నేను విడుదల పొందలేను ఈ బంధకాల నుంచి నేను బయటికి రాలేను ఈ ఎడిక్షన్ లో

నుంచి నేను బయటికి రాలేను అపవాది అంటాడు నువ్వు బయటికి రాలేవు ఎడిక్షన్ నుంచి ఒక త్రాగుడు కావచ్చు  లోక సంబంధ

విధానాలు కావచ్చు కొంతమంది బానిసలు అయిపోయి బయటికి రాలేక చాలా మంది భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు నాకు

తెలిసిన సహోదరుడు ప్రతి రోజు త్రాగకుండా నిద్రపోయేవాడు కాదు త్రాగుడుకు ఎంత బానిస అంటే కుటుంబాన్ని నిర్లక్ష్య పెట్టేసాడు

భార్యను పట్టించుకునే వాడు కాదు పిల్లలను పట్టించుకునే వాడు కాదు ఉద్యోగ బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించలేకపోతున్నాడు ఎందుకంటే

ఆ త్రాగుడు వలన కాన్సంట్రేషన్ అంతా పోయింది ఇంకా అందరూ అనే మాట ఏంటంటే ఇతన్ని ఏ ఒక్కరు విడుదల చేయలేరు ఏ

ఒక్కరు అతన్ని విడిపించలేరు ఇతని జీవితం అంతా ఇంతే ఈ నాశన కోపంలోనే బ్రతకాలని ప్రతి ఒక్కరు అతన్ని చూసి ఒక మాటలో

చెప్పాలంటే డిక్లేర్ చేశారు అవన్నీ కూడా కానీ దేవుని దగ్గరికి వచ్చాడు ప్రభువు సువార్త విన్నాడు యేసు ప్రభువు మాటలు ఒక వ్యక్తిని

బాగు చేసే కానీ పాడు చేసేవి అయితే కాదు ఒక వ్యక్తిని నిలబెట్టే మాటలే కానీ ఒక వ్యక్తిని పడగొట్టే మాటలు కాదు ఎప్పుడైతే ఆ వ్యక్తి తన

జీవితాన్ని ప్రభువుకి అప్పగించాడో దేవుని సన్నిధిలో తన పాపాన్ని ఒప్పుకొని మారుమనసు పొంది రక్షణ పొంది నూతన

జన్మానుభవంలోనికి వచ్చాడో అతని జీవితంలో దేవుడు ఇచ్చిన విజయం ఎంత గొప్పది అంటే ఈరోజు ఆ వ్యక్తి దేవుని కొరకు ఎంత

నమ్మకంగా సాక్షిగా నిలబడ్డాడు అంటే ఎవరైనా త్రాగుబోతులు కనబడిన లేదా వారు ప్రక్కన నిలబడితే ఆ వాసన కూడా అతనికి పడటం

లేదు అంతగా దేవుడు విజయాన్ని ఇచ్చాడు సాతానుడు అంటాడేమో నువ్వు విజయం సాధించలేవు ఈ ఓటమిని నువ్వు గట్టెక్కలేవు అని

క్రీస్తు ప్రభువు నందు విజయోత్సాహంతో దేవుడు నిన్ను ఊరేగించాలని కోరుతున్నాడు ఆయన ఎక్కడైతే నీ తల దించుకున్నావో ఎక్కడైతే

అవమాన భారంతో కృంగిపోతున్నావో ఎక్కడైతే ఆత్మ నూన్యత భావంతో ఏడుస్తున్నావో అక్కడే నీ తల ఎత్తాలని నీకు విజయాన్ని

ఇవ్వాలని యేసు ప్రభువు ఆశిస్తున్నాడు లేఖనాల్లో ఎన్నో సందర్భాలు మనం చూస్తున్నాం గొలియాతు దేవుని ప్రజల ముందు నిలబడి 40

రోజులు సవాలు చేస్తే దేవుడు దావీదును ఏర్పాటు చేసుకుని దేవుని ప్రజలకు విజయాన్ని ఇచ్చాడు దావీదు గొలియాతు స్థాయిలో ఏమీ

లేడు గొలియాతు అంత ఎత్తు లేడు అతనికి ఉన్న ఆయుధాలు కూడా దావీదు దగ్గర లేవు కానీ దావీదుకున్న ఒకే ఒక బలం దేవుడు దేవుని

బలంతో దేవుని మీద విశ్వాసంతో రోషంతో బయలుదేరాడు గొలియాతు అతను మట్టి కరిపించాడు బహుశా గొలియాతు నీ జీవితంలో

కూడా మరొక రూపంలో నిలబడి ఉన్నాడేమో ఈ రోజుల్లో విజయం సాధించు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు ఆయన నిన్ను

బలపరుస్తున్నాడు తన శక్తితో తన అభిషేకంతో నిన్ను నింపి గొలియాతు మీద నువ్వు విజయం సాధించాలని దేవుడు కోరుతున్నాడు

విజయోత్సాహంతో నిన్ను ఊరేగించే దేవుడు.

Leave a Comment