యెషయా 26: 3
ఎవనిమనస్సు నీమీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణశాంతిగలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీయందు విశ్వాసముంచి యున్నాడు.
Isaiah 26: 3
Thou wilt keep him in perfect peace, whose mind is stayed on thee: because he trusteth in thee.
యేసయ్య మాటలు – జీవపు ఊటలు ఎవనిమనస్సు నీమీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణశాంతిగలవానిగా కాపాడుదువు యెషయా 26:3
అన్నను మోసము చేసి జేష్టత్వాన్ని సంపాదించాడు. తండ్రిని మోసము చేసి అన్న ఆశీర్వాదం పొందుకున్నాడు. చివరకు అన్న కోపానికి తన తల్లితండ్రులను, ఇంటిని, సొంత ఊరును విడిచి పారిపోవలసిన పరిస్థితి యాకోబుది. మనశాంతి లేక గందరగోళమైన పరిస్థితిలో ప్రయాణిస్తూ ఆ రాత్రి తన ప్రయాణ మార్గములో ఒక రాయి మీద ఆనుకున్నప్పుడు, దేవుని దర్శనాన్ని పొందుకున్నాడు. దేవునితో నిబంధన చేసుకున్నాడు. కట్టుబట్టలతో చేతికఱ్ఱతో ఇల్లు విడచి పద్దనరాముకు పారిపోయిన యాకోబు గొప్ప కుటుంబపరివారముతో, గొప్ప ఆస్తితో తిరిగివచ్చాడు. మిత్రమా! నీవు కూడా ఎటూ అర్ధముకాని పరిస్థితుల మధ్య ఉన్నావేమో దేవుని మీద అనుకో, దేవుని మీద ఆధారపడు, ప్రభువుకు ప్రార్ధించు. నిశ్చయముగా ప్రభువు నీకు పూర్ణశాంతిని అనుగ్రహించి నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమెన్
మంచి మాట పరలోకపు శక్తిని దింపగలిగిన భూలోకపు శక్తి ప్రార్ధన మాత్రమే — ఆండ్రూ ముర్రే