
దావీదు మహారాజు యొక్క సంస్థానంలో ఆసాపు గాయక బృంద నాయకుడిగా ఉన్నప్పుడు బహుశా దావీదు రాసి ఇచ్చిన పాటలన్నీ
పాడుతున్నాడు దేవునితో సంబంధాన్ని కలిగి ఉండి ఆ కీర్తనలు రచించడం ప్రారంభించాడు తన అనుభవాల్లో నుంచి అనేకమైన
విషయాలు రాసుకుంటూ వచ్చాడు ఆసాపులో నాకు నచ్చే మంచి విషయం ఏంటంటే యదార్ధంగా దేవుని సన్నిధిలో తన మనసులో ఏది
ఉందో అది చెప్పేవాడు దేవుడు అలాంటి వాళ్ళని బాగా ఇష్టపడతాడు యదార్ధంగా దేవుని స్తుతించడం ఏది ఉంటే అది దేవుని సన్నిధిలో
చెప్పుకోవడం యదార్థమైన మనసుతో ఆసాపు రాసిన ఈ కీర్తనలో ఈ చివరి వచనంలో దేవుడు మాట్లాడుతున్న మాటను ఇక్కడ
రాసుకుంటూ స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమ పరుచుచున్నాడు స్తుతి యాగము అర్పించువాడు ప్రపంచంలో చాలా
యాగాలు చాలా మంది చేస్తూ ఉంటారు మన భారతదేశంలో కూడా ఎన్నో యాగాలు చేసే వాళ్ళు ఉన్నారు ప్రతి యాగం వెనకాల ఏదో ఒక
ఉద్దేశం ఇది జరిగితే బాగుంటది ఇది జరగాలని చెప్పి యాగాలు చేస్తూ ఉంటారు కానీ నేను చెప్పే మాట ఏంటంటే అన్ని యాగాల కన్నా
ఉత్తమమైన యాగము స్తుతి యాగము దేవుని స్తుతించడము ఆయన్ని ఆరాధించడం ఆయన ఏమై ఉన్నాడో గుర్తెరిగి ఆయనకు కృతజ్ఞతా
స్తుతులు చెల్లించడం రెండవది ఆయన మనకు చేస్తున్న మేళ్లను ఉపకారాలను మర్చిపోకుండా అనుక్షణము కూడా కృతజ్ఞులమై దేవుని
స్తుతించడం ఇది ఎంత అద్భుతమైన అంశం చాలా మందికి స్తుతి చేయడం రావట్లేదు చాలా మందికి ఆరాధించడం తెలియట్లేదు ఈ
రోజుల్లో ఆరాధించు స్తుతించు అంటే ఎందుకండీ నేను ఏమిని స్తుతించాలండి నాకు దేవుడు నాకు ఏమి ఇచ్చాడని స్తుతించాలి అని
చాలా మంది నిరుత్సాహాన్ని వెల్లడి చేస్తూ ఉంటారు దేవుడు సమస్తాన్ని నీకు అనుగ్రహించాడు దేవుడు నీకు అనుగ్రహించిన రక్షణను
బట్టి నువ్వు దేవుని స్తుతించాలి ఆయన నీకు ఇచ్చిన విశ్వాసాన్ని బట్టి నువ్వు దేవుని స్తుతించాలి భౌతికంగా ఇంతవరకు దేవుడు నీ
జీవితంలో చేసిన ఎన్నో మేలు ఎన్నో ఉపకారాలను బట్టి నువ్వు ప్రభువుని స్తుతించాలి సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించెదరు అనే
మాట లేఖనాల్లో ఉంది నీలో ఇంకా జీవం ఉంది అంటే అది కేవలం దేవుని కృపే ఆరాధించు స్తుతించు నువ్వు ఎప్పుడైతే స్తుతి యాగము
నువ్వు అర్పిస్తున్నావో నువ్వు దేవుని మహిమ పరుస్తున్నావు దేవుడు సంతోషిస్తాడు నిన్ను బట్టి ఆయన ఆనందిస్తాడు దేవుని
సంతోషపరచగలిగితే ఆయన ఆనంద పరచగలిగితే అంతకన్నా ఆశీర్వాదం ఏముంది ఈరోజు నీకు ఏది అవసరమో దేని కోసం నువ్వు
ప్రార్థిస్తున్నావో ఏ అద్భుతాలు జరగాలని దేవుని వైపు చూస్తున్నావో పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు కొరకు నువ్వు కనిపెడుతున్నావో
దేవుడు బలమైన కార్యాలు నీ జీవితంలో జరిగించి నీ హృదయ వాంఛను నెరవేర్చే దేవుడు ఆయన ఉద్యోగ విషయంలో తీవ్రంగా
కలవరపడుతున్నావా వివాహ విషయంలో తీవ్రంగా కలత చెందుతున్నావా లేదా బిడ్డలు లేరని బాధపడుతున్నావా ఆస్తిపాస్తులు
కూడబట్టలేకపోతున్నాను నేను ఒక్కడినే ఇలా ఉండిపోయాను అనే బాధ నీలో ఉందా స్తుతించు దేవుణ్ణి నీకున్న దాన్ని బట్టి దేవుని
స్తుతించు ఈరోజు దేవుడు నిన్ను ఏ స్థానంలో ఉంచాడో విశ్వాస నేత్రాలతో చూడు ఆయన కాడిని మోయడంలో ఆయన సేవ చేయడంలో
దేవుని కృపలో వర్ధిల్లడమే గొప్ప ఆస్తి అని నమ్ము ప్రభువు గొప్ప కార్యాలు నీ జీవితంలో జరిగిస్తారు అంత మాత్రం కాకుండా స్తుతి
యాగం అర్పించేవాడు దేవుని మహిమ పరచడం మాత్రం కాకుండా దేవుని రక్షణ కనపరుచునట్లుగా మార్గాన్ని సిద్ధపరుచుకుంటున్నాడు
అని లేఖనాల్లో రాయబడింది అనగా నీవు చేసే స్తుతి నీకు మార్గాన్ని సిద్ధపరుస్తుంది ఆమెన్ నీ స్తుతి మార్గమును సిద్ధపరచును
అంటే అర్థం ఏంటంటే దేవుని రక్షణ కనపరిచినట్లుగా మార్గాన్ని సిద్ధపరుచుకుంటున్నాడు దేవుడు ఎప్పుడు నిన్ను దీవించడానికి
ఇష్టంగానే ఉన్నాడు కానీ ఆ మార్గాన్ని సిద్ధపరుచుకోవాల్సింది నువ్వే చెయ్ మనస్ఫూర్తిగా దేవుని స్తుతించు ఆరాధించు.