
శిక్షాఫలం అంటే తప్పు చేస్తే వచ్చే శిక్షకు ఫలితం అని కాదు దేవుడు చేసే క్రమశిక్షణను ఓర్పుతో సహిస్తే వచ్చే ప్రతిఫలం అని. మిత్రమా!
మామిడిఫలం, సీతాఫలం తినుటకు చాలా మధురముగా ఉంటాయేమో గాని శిక్షాఫలం చాలా చేదుగా అనుభవించే వారికి కష్టముగా
ఉంటుంది. కానీ దేవుడు తనకు కుమారులు కుమార్తెలు అనుకునేవారికి మాత్రమే ఈ శిక్షాఫలం ఇస్తాడు. క్రమశిక్షణ నేర్పిస్తాడు. గనుక
దేవుడు అనుమతించే శ్రమలను, ఇచ్చే శిక్షణను త్రోసివేయకు దేవుడు నేర్పించే పాఠాలను నేర్చుకో. నిశ్చయముగా నీవు ఆశీర్వదించబడి
ఉన్నత స్థితికి చేరుకుంటావు. ఆమెన్