సర్వోన్నతుని కృపచేత అతడు కథలకుండా నిలుస్తాడు అని చక్కని వాగ్దానం ఇక్కడ మనం చూస్తున్నాం పరిశుద్ధ గ్రంధం వాగ్దానాలను కలిగిన గ్రంథం దేవుని వాగ్దానాలు మన జీవితాల్లో నెరవేర్చబడడానికి దేవుడు ఇచ్చాడు వాగ్దానాలు తీసుకెళ్లి క్యాలెండర్ లోనో లేకపోతే టేబుల్ మీద పెట్టుకోవడానికి మాత్రమే కాదు దేవుని వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చాలని దేవుడు ఆశిస్తున్నాడు రాజు దేవుని యందు నమ్మించిచున్నాడు ఈరోజు మన నమ్మిక ఎవరి మీద వేటి మీద చాలా మంది ప్రపంచంలో తమకున్న ధనం మీద నమ్మకం ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు ధనం ఉండడం తప్పని కాదు గాని, ధనం మీద నమ్మిక ఉంచడం తప్పని బైబిల్ చెబుతుంది
ఈ లోకంలో ధనవంతుడైన మనిషికి ధనం పెరిగినప్పుడు లేదా భౌతిక సంబంధమైన ఐశ్వర్యం పెరుగుతున్నప్పుడు గర్వం పెరుగుతుంది, అదేవిధంగా ధనం మీద నమ్మిక పెరిగిపోతుంది. చాలామంది రోజుల్లో అలాంటి నమ్మిక కలిగి ఉండి పతనం అవుతున్నారు గాని నీవు నేను దేవుని యందు నమ్మికించగలిగితే సమస్తమును ధారాళముగా దయచేసే దేవుని యందు మన విశ్వసించగలిగితే ఆ జీవితం ఆశీర్వదకరమైన జీవితం కొంతమంది తమకున్న బలాన్ని బట్టి గర్వించే వాళ్ళు ఉన్నారు బలము మీద నమ్మకం కలిగిన వారు చాలామంది ఉండొచ్చు గాని దేవుని బిడ్డలుగా మనం సృష్టికర్తనే దేవుడు మనకోసం ఈ లోకానికి దిగివచ్చి పునరుత్థానుడైన ఏసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసము ఉంచగలిగితే గొప్ప దీవెనలు మనం పొందుకుంటం.
ఆ తరువాత కీర్తనకారుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు సర్వోన్నతుడు తన కృపను నామీద కుమ్మరిస్తున్నాడు గనక ఆయన కృప చేత నేను కథలకుండా ని అని అన్నాడు. అనేకసార్లు నువ్వు దేవుని కోసం నిలబడదాం అనుకున్నప్పుడు ఆయన కోసం జీవిద్దాం అనుకున్నప్పుడు ఎవరో వస్తారు నీ దగ్గరికి నువ్వు నిలబడలేవు నువ్వు దేవుని కోసం దేవుని కార్యాలు చేయలేవు దేవుని సేవలో వాడబడలేవు నీ జీవితాన్ని ప్రభువుకి సంపూర్ణంగా అంకితం చేస్తే నీకు శ్రమలు వచ్చేస్తాయి కష్టాలు వచ్చేస్తాయని చాలామంది వెనుకకు లాగాలని ప్రయత్నం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు రక్షణ పొంది దేవునిలో ఎదగాలని నిర్ణయించుకున్నప్పుడు నువ్వు పడిపోతావ్ ఏమో చిక్కుబడిపోతావేమోనని చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అయితే బైబిల్ చెబుతున్న మాట ఏంటో తెలుసా, దేవుడు కృప గలవాడు ఆయన తన కృపను మన మీద సమృద్ధిగా కుమ్మరిస్తున్న దేవుడు ఆయన పౌలు భక్తుడు అన్నడు నేనేమైయున్నానో అది కేవలం దేవుని కృపను బట్టి అయి ఉన్నాను అని.
నీ జీవితంలో దేవుని కృప మనకు తోడుగా ఉంది కాబట్టి మనము కదలకుండా నిలుస్తామని బైబిల్ సెలవిచ్చింది దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు . పౌలు సంఘానికి రాస్తూ ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థం కాదు అని ఎరిగి ఎప్పటికిని ఆసక్తులు అయి ఉండండి అనే మాట రాశాడు ఆ వాక్యాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే మీ ప్రయాస వ్యర్థం కాదు కాబట్టి మీరు కదలని వారిగా ఉండాలని పౌలు మాట్లాడడు. దేవుడు నిన్ను నిలబెట్టేవాడు ఆయన నిన్ను కదలకుండా నిలబెట్టగలిగే శక్తి ఆయనకు ఉంది. నువ్వు అనుమానపడాల్సిన అవసరత లేదు సందేహాలు సమస్యలు కలిగి నేను నిలబడలేను ఏమో నేను పడిపోతానేమో నేను పడిపోతానేమోనని అనుకోవడనికి లేదు దేవుని కృప మీద నువ్వు ఆధారపడగలిగితే ప్రతిరోజు నువ్వు లేచిన తర్వాత ప్రభువా ఈ రోజంతా అంతా నీ కృప ద్వారా నన్ను నడిపించు ప్రభువా ఈ లోకంలో మరేదీ కూడా నాకు సంతృప్తి ఇవ్వలేదు ప్రభువా ఈ లోకంలో మరి ఏది కూడా నాకు సమాధానం ఇవ్వదు ఈ లోకంలో మరి ఏది కూడా నాకు సంతృప్తి ఇవ్వదు ఈ లోకంలో మరి ఏది కూడా నాకు సమాధానం ఇవ్వదు నా సంతృప్తి, సంతోషం,సమాధానం, నీ మీదనే ఆధారపడి ఉన్నయని ఎవరైతే దేవుని కృప మీద ఆధారపడి ఉంటారో వారు కదలకుండా దేవుని కోసం నిలిచే అనుభవం కలిగి ఉంటారు రక్షణ పొందినప్పుడు చాలామంది మా తండ్రి గారిని వెనుకకు లాగాలని ప్రయత్నం చేశారు నువ్వు దేవుని కోసం బ్రతకలేవు దేవుని కోసం ఉండలేవు ఎందుకంటే మా తండ్రిగారు విపరీతంగా ప్లేయింగ్ కార్డ్స్ ఆడుతుండేవారు చాలమంది అనేవారు నీవు ఏసుప్రభువు అంగీకరిస్తున్నావు గాని మల్ల తర్వాత అదే పాపంలో పడిపోతావున్నట్టుగా చాలామంది చెబితే మా తండ్రిగారు చెప్పిన మాట నా దేవుడు నన్ను నిలబెట్టువాడు స్థిరత్వం నాకు దయచేయువాడు అని ఆరోజు నుండి ఈరోజు వరకు కూడా దేవుని కోసం చాలా చక్కగా వాడబడుతూ ఆయన కృపలో వర్ధిల్లుతున్నారు. ఆయన నిన్ను నిలబెట్టువాడు మనుషులందరూ నేను పడగొట్టాలని ప్రయత్నం చేస్తారు కానీ నీ దేవుడు కృప గలవాడు కాబట్టి ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు కాబట్టి నిన్ను నిలబెట్టి తన మహిమ గల కార్యాలు నీ ద్వారా జరిగించాలని ప్రభువు ఆశిస్తున్నాడు