యేసయ్య మాటలు – జీవపు ఊటలు
అనుదినము నేను నిన్ను స్తుతించెదను నిత్యము నీ నామమును స్తుతించెదను
యోబుకు అన్నీ ఉన్నప్పుడు, అనుదినము తన కుటుంబము కొరకు ప్రార్ధించేవాడు, తనకు కలిగి ఉన్నవాటికొరకు దేవుని ఆరాధించేవాడు అంతేకాదు యోబు సమస్తము కోల్పోయినా దేవుని ఆరాధించడం మానలేదు అందుకే కోల్పోయిన వాటికి రెండంతలుగా పొందుకున్నాడు. కానీ నేడు చాలమంది దేవుడు తమకు కావాల్సినవన్నీ ఇచ్చినప్పుడే దేవుని ఆరాధించేవారుగా ఉంటున్నారు. చిన్న శ్రమ వస్తే దేవుని ఆరాధించడం మానేస్తున్నారు, మందిరానికి రావడం మానేస్తున్నారు. వారానికి ఒక్కసారి క్రమముగా దేవుని ఆరాదించలేనివారు అనుదినమూ ప్రభువును స్తుతించగలరా? స్తుతించలేరు గనుక మనము దేవుని ఏదో మనకు ఇష్టమైన సందర్భాలలో స్తుతించేవారముగా కాక అనుదినమూ ప్రతి పరిస్థితిలోనూ దేవుని స్తుతించే వారముగా వుండేదముగాక. ఆమెన్
మంచి మాట
స్తుతి నీ స్థితిని మారుస్తుంది. ప్రార్ధన నీ పరిస్థితిని మారుస్తుంది