కీర్తనలు 103:7 ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనుపరచెను

Psalms 103:7 Explanation in Telugu కీర్తనలు 103:7 ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనుపరచెను.

Psalms 103:7 Explanation in Telugu | Psalms 103:7 Meaning Telugu
Psalms 103:7 Explanation in Telugu | Psalms 103:7 Meaning Telugu

 

దేవుడు మోషేకు తన మార్గములను తెలియజేసెను దేవుడు కార్యములు ఎలా చేస్తాడు అనే విషయం మోషేకి తెలిసిందట ఆధ్యాత్మిక జీవితంలో అత్యుత్తమమైన మెట్టు అంటూ ఏదైనా ఉంది అంటే అదే దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం ఆయన మార్గములను తెలుసుకోవడం మీరు ఎప్పుడైనా ఇలా ప్రార్థన చేశారా దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు ప్రభువా నీ మార్గములను మాకు కనపరచు నీ చిత్తమును మాకు బయలుపరచు ఎందుకోసం అంటే దేవుని మార్గములు ఎప్పుడూ కూడా శ్రేష్టమైనవి ఆయన త్రోవలు వంకర త్రోవలు కాదు ఆయన త్రోవలు ఎవ్వరిని కూడా వంకర త్రోవలో నడిపించేవి కాదు కొంతమంది ప్రబుద్ధులు ఉంటారు వాళ్ళు ఏమంటూ ఉంటారంటే నేను ఇలా పాపంలో ఉండడం దేవుని చిత్తమేమో అనుకుంటారు చాలామంది నేను తప్పుడు పనులు చేయడం కూడా దేవుని చిత్తమేమో నో మై ఫ్రెండ్ దేవుడు నీ పట్ల అలాంటి ఉద్దేశం ఎప్పుడు కలిగిలేడు నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలని నిర్దోషంగా ఉండాలని నువ్వు ఉండాలని దేవుడు ఎల్లప్పుడూ ఆశించాడు కానీ నీ ఇష్టానుసారం తిరుగుతావని దేవుడు ఎప్పుడు ఆయన ఆశించలేడు ఆయన మార్గములను తెలుసుకొనే ఆధ్యాత్మిక స్థాయిలోనికి మనం రాగలుగుతామా ఎప్పుడైతే దేవుని మార్గములను మనం తెలుసుకుని వారంగా ఉంటామో జీవితంలో ఆశీర్వాదాలను దీవెనలను నిశ్చలమైన స్థితిలో మనం అనుభవిస్తాం పరిపూర్ణమైన విషయాల్లో దేవుని నడిపింపును మనం చూడగలుగుతున్నాం దేవుని చిత్తం కోసం ప్రాకులాడం ఆయన సన్నిధిలో ప్రార్థించండి దేవుని చిత్తం అనేది ఎక్కడో మార్కెట్ లో దొరికే వస్తువు కాదు దేవుని సన్నిధిలో నువ్వు సమయాన్ని గడపాలి ఆయన సన్నిధిలో మోకాళ్ళు వేయాలి దేవుని చిత్తం ఏదో సడన్ గా నీకు తెలిసిపోయేది కాదు ఆయన సన్నిధిలో నువ్వు కనిపెట్టగలిగితే మోషే దేవుని సన్నిధిని ప్రేమించాడు దేవుడు ఎప్పుడు రమ్మన్నా దేవుని సన్నిధిలోనికి వెళ్ళడానికి మోషే సిద్ధంగానే ఉన్నాడు సీనాయి పర్వతం మీద మోషే 40 రాత్రింబగళ్ళు ఆహారం లేదు నీళ్లు లేవు దేవుని సాన్నిధ్యంలో సమస్తాన్ని మరిచి ప్రభువులో లీనమైపోయాడు దేవుడు తన చిత్తాన్ని తన మార్గములను మోషేకి తెలియజేయడానికి కారణం మోషే ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉన్నాడు దేవుని స్వరాన్ని వినడానికి, నువ్వు ఉన్నావా దేవుని స్వరాన్ని వినడానికి ఆయన చిత్తాన్ని గ్రహించడానికి ఆయన తన మార్గాన్ని నీకు బయలుపరచాలని కోరుతున్నాడు గమనించండి ప్రియులారా అపోస్తులైన పౌలు రోమీయులకు రాస్తూ కూడా ఇదే మాట అంటాడు నేను మిమ్మల్ని అందరిని కూడా క్రీస్తు నందున్న వాత్సల్యాన్ని బట్టి బ్రతిమాలుతున్నాను ఏం బ్రతిమాలుతున్నావ్ పౌల అంటే మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమునైన దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకోండి అలా తెలుసుకోవాలంటే మీ మనసు మారి మీరు రూపాంతరం చెందాలి అన్నాడు

రోమీయులకు 12:1
కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్త మైనది.

రోమీయులకు 12:2
మీరు ఈ లోక( లేక, ఈ యుగ) మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునైయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి.

మీరు రూపాంతరం చెందబడితే దేవుని చిత్తం ఏంటో మీకు తెలుస్తుంది ఆ చిత్తం ఎలాంటిది అంటే ఎల్లప్పుడూ ఉత్తమమైనది అనుకూలమైనది ఈరోజు నీవు నేను అలాంటి స్థితిలోనికి కి రావాలని ప్రభువు కోరుతున్నాడు మన జీవితాల్లో దేవుడు ఎల్లప్పుడూ కూడా తన మార్గములను కనపరచడానికి తన చిత్తమును కనపరచడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు ఈరోజు ఒకవేళ నీ జీవితంలో ఒక మంచి నిర్ణయం తీసుకునే ఆ సమయంలో నువ్వు ఉన్నావా నీ కెరీర్ విషయంలో కావొచ్చు నీ ఫ్యామిలీ విషయంలో కావచ్చు నీ వ్యాపార విషయంలో కావచ్చు అన్న ఆలోచనలో ఎవరు నన్ను నడిపిస్తారు ఎవరు నన్ను గైడ్ చేస్తారు అని ఆలోచన చేస్తూ ఉంటే ఈ వాగ్దానాన్ని గుర్తు చేసుకోండి మోషేకు నీ మార్గమును కనుపరిచావు ఇశ్రయేలు ప్రజలకు నీ క్రియలను కనుపరిచావు దేవుడు చేసే క్రియలు మాటలతో చెప్పుకునేవి కాదు లేదా పుస్తకాల్లో రాసేవి కాదు ఈరోజు నీ జీవితంలో ఆయన చిత్తాన్ని తెలుసుకోవడానికి నువ్వు ఇష్టపడితే ఆయన తన క్రియలు కనుపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మన దేవుడు పని చేసే దేవుడు ఆయన ఆయన సోమరి కాదు తన ప్రజల పక్షాన పని చేస్తున్నాడు ఆయన క్రియ చేసే దేవుడు ఆయన తన క్రియలను కనపరుస్తున్నాడు…

Instagram

Youtube

Facebook

Threads

X

Telegram

Psalms 103:7 Explanation in Telugu

Psalms 103:7 Explanation in Telugu

Psalms 103:7 Explanation in Telugu

 

Leave a Comment