Deuteronomy 32:47 Explanation in Telugu ద్వితియోపదేశకాండము 32:47 ఇది మీకు నిరర్థకమైన మాటకాదు, ఇది మీకు జీవమే. మరియు మీరు స్వాధీనపరచుకొనుటకు యొర్దానును దాటబోవుచున్న దేశములో దీనినిబట్టి మీరు దీర్ఘాయుష్మంతులగుదురు.

Deuteronomy 32:47 Explanation in Telugu ప్రతి ఒక్కరికి ఒక ఆశ ఎక్కువ కాలం బ్రతకాలని జీవించాలని మరణ పడకల మీద ఉన్న చాలామంది ఇంకా కొంతకాలం మేము బ్రతికితే చాలు ఇంకా కొంతకాలం మేము జీవించాలనే ఆశ చాలా మందిలో ఉంటది దీర్ఘాయుష్మంతులు అవ్వాలని ఎంతో మంది ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు ఎన్నో రకాల కార్యక్రమాలు చేపట్టే వాళ్ళు కూడా ప్రపంచంలో కనబడుతున్నారు అయితే మోషే మరియు యెహోషువాలు దేవుని మాటలు ఆ తరమంతటికీ తెలియజేసిన తర్వాత వారు చెబుతున్న మాట ఏంటంటే దేవుడు మీకు చెప్పిన మాటలను మీకు ఇచ్చిన ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా పాటిస్తే దేవుని జీవాన్ని మీరు పొందుకుంటారు ఇప్పటివరకు ఏవైతే మాటలు మీకు చెప్పామో లేదా ఏవైతే ప్రకటించామో అవన్నీ నిరర్థకమైన మాటలు కాదు అవి మీకు జీవాన్ని ఇస్తాయి అనే మాట ఈ వచనంలో మనం చూస్తున్నాం మనిషికి జీవం ఎక్కడి నుండి వస్తుంది మానవుడు ఎలా బ్రతుకగలడు మనిషి రొట్టె వలన మాత్రం కాదు గానీ దేవుని నోట నుండి వచ్చే మాట వలన జీవిస్తారని లేఖన భాగం స్పష్టీకరిస్తుంది చాలామంది అంటూ ఉంటారు మన శక్తి కదండీ మన బలం కదండీ మన ఉద్యోగం కదండీ మన ప్రభావం కదండీ మనం బ్రతకడానికి ఉపయోగపడుతుందని అయితే భూమి తన పంటను ఇవ్వకపోతే దేవుడు భూమికి ఆజ్ఞ ఇవ్వకపోతే మానవుడు ఎలా బ్రతుకుతాడు ఆయన మాట వలన మనిషి జీవిస్తాడు అది శారీరకంగా కావచ్చు ఆత్మీయంగా కావచ్చు ఏ రూపంలోనైనా జీవాన్ని పొందుకోవాలంటే దేవుని మాట ద్వారా మాత్రమే సాధ్యము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ కారణాన్ని బట్టి మనం ప్రభువుని స్తుతించాలి ఆయన మనకు జీవాన్ని ఇచ్చారు మన శ్రమల్లో మన విపత్కర పరిస్థితుల్లో కష్ట సమయాల్లో అనేకమైన నిందలు అవమానాలు మన మీద దుమ్మిగా పడుతున్నప్పుడు ఇరుగుపొరుగు వారు ఇంట్లోని వారు ఆ దూరంగా ఉన్నవారు కావచ్చు స్నేహితులు కావచ్చు తప్పుగా మాట్లాడుతున్నారు అని తెలిసినప్పుడు కృంగిపోవడం సహజమే అటువంటి పరిస్థితుల్లో కూడా మనకు నెమ్మదిని ఇచ్చేది ధైర్యాన్ని ఇచ్చేది గొప్ప ఆదరణ ఇచ్చేది దేవుని వాక్యం ఈ వాక్యము నిరర్ధకమైనది కాదు బైబిల్ లో రాయబడిన ఏ మాట కూడా నిరర్ధకం కాదు ప్రతి మాట దేవుని దేవుని మాట గనుక పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా మాటలన్నీ రాయబడ్డాయి గనుక ఈ మాటలు మనకి జీవాన్ని సారవంతమైన అనుభవాల్లో మనం ఎదగడానికి కావలసిన పరిస్థితులను అనుకూల పరుస్తూ ఉంటుంది ఒక్కసారి దేవుడు తన మాటను పలికితే ఆయన వాగ్దానాన్ని చేస్తే అది మరల నిష్ఫలంగా ఆయన దగ్గరికి వెళ్ళిపోదు దేవుడు అనుకూలమైన వాటిని చేస్తాడు దేవుని మాటలు మనకు జీవాన్ని ఇస్తాయి ప్రియ దేవుని బిడ్డలారా దేవుని స్వరాన్ని వినే అనుభవాన్ని కలిగి ఉన్నావా ఆయన స్వరాన్ని వినడానికి ఆతురపడుతున్నావా తొందరపడుతున్నావా ప్రపంచంలో చాలా వాటికి త్వరపడుతూ ఉంటాం తొందరపడుతూ ఉంటాం కానీ దేవుని స్వరం కోసం కనిపెట్టట్లేదు చాలామంది వాక్యం వింటారు పెద్దగా ఏమి అనిపించలేదని వెళ్ళిపోతుంటారు దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మీరు వింటే ఆ మాటలు మీకు జీవాన్ని ఇస్తాయి ఆధ్యాత్మికమైన జీవంలో మనం కొనసాగడానికి ఉపయోగపడతాయి దేవుడు అలాంటి జీవాన్ని మనకి ఇస్తున్నందుకు మనం ప్రభువుని స్తుతించాలి మరణకరమైన పరిస్థితులు నిస్సారమైపోయిన అనుభవాలు నిస్సారమైన జీవితం బహుశ నీ జీవితంలో ఉంటే ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుని స్వరాన్ని నువ్వు వినగలిగితే ఆత్మ దేవుడు పలుగుతున్న మాటలు నువ్వు లక్ష్య పెట్టగలిగితే అవి నీకు జీవాన్ని ఇస్తాయి అంత మాత్రం కాకుండా మీరు యోర్ధానును దాటి వెళ్ళబోతున్న దేశంలో మీరు దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే దీనిని బట్టి మాత్రమే సాధ్యం అన్నాడు ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేసుకుంటూ వచ్చారు దాదాపుగా 40 సంవత్సరాలు ప్రయాణం చేసుకుంటూ వచ్చారు ఇక వారు కనాను దేశంలో ప్రవేశించాల్సిన సమయం అది ఆ సమయంలో కనాను దేశంలో ప్రవేశించడానికి ముందు దైవజనుడు చెబుతున్న మాట మీరు నదిని దాటి ఏ దేశంలోకైతే వెళ్తున్నారో అక్కడ మీరు దీర్ఘాయువును అనుభవించాలంటే సుఖముగా జరుగు సంవత్సరములు మీరు అనుభవించాలి అంటే దేవుని మాటకు మీరు లోబడాలి ఈ మాటల యందు మీరు లక్ష్యం ఉంచాలని ఓ చక్కని మాట దైవజనుడు తెలియజేశాడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆయన స్వరాన్ని మనం వినగలిగితే ఆ మాటలు మనకు జీవాన్ని ఇస్తాయి అంత మాత్రం కాకుండా వినుట వలన విశ్వాసం అన్నాడు విశ్వాసంలో కొన్నిసార్లు బలహీనులమైపోవడానికి కారణం దేవుని మాటను వినకపోవడమే చాలామంది ఎన్నో మాటలు వింటారు ఉదయం లేచింది రాత్రి పడుకునే వరకు కానీ దేవుని మాటలు ఎందు లక్ష్యం ఉంచలేకపోతున్నారు దేవుని మాట వింటే మనకు ఆరోగ్యం ఉంది ఆయన మాటలు మనకు ఆశీర్వాదాన్ని ఇస్తాయి ఒక సందర్భంలో దేవుడు అన్నాడు అయ్యో ఇశ్రాయేలు నీవు నా మాట వినిన యెడల ఎంత మేలు అయ్యో అనే మాట ఎప్పుడు వాడతాం అంటే ఒక నష్టం జరిగినప్పుడు లేదా ఒక ఇబ్బందికర పరిస్థితులు ఇరుక్కున్నప్పుడు అయ్యో అనే పదాన్ని వాడతాం దేవుడు కూడా అంటున్నాడు నువ్వు నా మాట వినుంటే నా మాటను లక్ష్యపెట్టి ఉంటే నీకు ఎంతో మేలు జరిగి ఉండేది దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనక ఇస్తున్న వాగ్దానం ఏంటంటే దేవుని మాటలు నిరర్ధకం కావట్లేదు అవి మనకు జీవాన్ని ఇస్తున్నాయి యోర్ధాను దాటి కనాను దేశంలో ప్రవేశించినప్పుడు ఆ మాటలు మనకు దీర్ఘాయుష్మంతులు అవ్వడానికి ఉపయోగపడుతున్నాయి…
Deuteronomy 32:47 Explanation in Telugu
Deuteronomy 32:47 Explanation in Telugu
Deuteronomy 32:47 Explanation in Telugu