యెహోవా అబ్రహాముకు ప్రత్యక్షమయినీ సంతానమునకు ఈ దేశ మిచ్చెదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను.

Genesis 12:7 EXplanation in Telugu ఆదికాండము 12:7 యెహోవా అబ్రహాముకు ప్రత్యక్షమయినీ సంతానమునకు ఈ దేశ మిచ్చెదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను.

Genesis 12:7 EXplanation in Telugu | Genesis 12:7 Meaning in Telugu
Genesis 12:7 EXplanation in Telugu | Genesis 12:7 Meaning in Telugu

 

దేవుని వాగ్దానాలు ఎంత బలమైనవి అంటే అప్పటికీ అబ్రహాముకు ఇంకా సంతానం లేదు తన 75వ సంవత్సరంలో దేవుడు అబ్రహాము యొక్క పిలుపును విని కల్దీ దేశం నుండి బయటకు రావడానికి ఆయన ప్రయాణం ప్రారంభించాడు తనతో పాటు తన భార్యను తీసుకొచ్చాడు మరి కొంతమంది ఆయన వెంబడి వచ్చారు అందరూ కలిసి కనాను దేశం వైపుగా ప్రయాణం చేస్తున్నారు కరెక్ట్ గా ఇదే నీ గమ్యం అని సరిగ్గా తెలియకపోయినప్పటికీ కూడా అబ్రహాము విశ్వాసంతో తన ప్రయాణాన్ని ప్రారంభించాడు అబ్రహామును విశ్వాసులకు తండ్రి అని మనం ఎందుకు పిలుస్తాం అంటే కొన్ని విషయాల్లో తనకు తెలియపోయినప్పటికీ కూడా దేవుడు చెప్పాడు కాబట్టి తన ప్రయాణాన్ని విశ్వాసంతో ప్రారంభించాడు విధేయతతో ప్రారంభించాడు కాబట్టే అబ్రహాము విశ్వాసుల తండ్రిగా పిలవబడుతున్నాడు ఈరోజు చాలాసార్లు దేవుడు మన జీవితాల్లో కూడా విశ్వాసాన్ని పరీక్షిస్తాడు ఎన్నో పరీక్షలు మనం రాస్తూ ఉంటాము ఎన్నో పరీక్షలు గుండా వెళ్తూ ఉంటాం కానీ కొన్ని సందర్భాల్లో విశ్వాసానికి తగిన పరీక్ష జీవితంలోకి వస్తూ ఉంటుంది అబ్రహాము ప్రయాణం అయ్యాడు ఎప్పుడైతే దేవుడు అబ్రహాము యొక్క విధేయతను విశ్వాసాన్ని చూశడో కనాను దేశానికి ఆ వ్యక్తి వచ్చిన తర్వాత దేవుడు అన్నాడు నేను నీకును నీ సంతానానికి ఈ దేశం ఇస్తాను అని వాగ్దానం చేశాడు ప్రభువునందు ప్రియులారా ఈ వాగ్దానంలో నుంచి మనం నేర్చుకునే ఒక ఆధ్యాత్మిక సందేశం ఏంటంటే మన దేవుడు ఇచ్చువాడు ఆనాడు అబ్రహాముకి వాగ్దానం చేశాడు దేశాన్ని ఇస్తానని దేవుడు ఇచ్చాడు అబ్రహాముకు మాత్రమే కాదు నీ తర్వాత తరాలకు కూడా ఇస్తానని వాగ్దానం చేశాడు ఇచ్చే దేవుడు ఆయన చాలాసార్లు మనం అనుకుంటాం దేవుడు అనగా తీసేసుకునేవాడు లాక్కునేవాడు అనుకుంటాం కానీ లేఖనాలు ధృవీకరిస్తున్న సత్యము దేవుడు ఇచ్చేవాడే ఆయన తన ప్రాణాన్నే మనకోసం ఇచ్చాడు కదా మనందరం రక్షణ పొందునట్లుగా మారుమనసు అనుభవంలో కొనసాగునట్లుగా తిరిగి జన్మించిన అనుభవంలో మనందరం ముందు కొనసాగునట్లుగా దేవుడు తన ప్రేమను మన పట్ల వెల్లడి చేసి తన ప్రాణాన్ని మనకోసం ఇచ్చాడు చాలామంది తెలియక దేవుడు అవి ఇవి ఆశిస్తున్నాడు అనుకని ఏవేవో పట్టుకలని ప్రయత్నం చేస్తున్నారు అయితే అన్నిటికన్నా ప్రాముఖ్యంగా దేవుడు మన నుండి కోరుకుంటుంది మన హృదయం కదా ఆయన మన హృదయాన్ని కోరుతున్నాడు ఆ హృదయాన్ని ఆయనకి ఇవ్వగలిగితే సమస్తాన్ని ఆయన ఇస్తాననే వాగ్దానం చేసిన దేవుడు బైబిల్ గ్రంధంలో ఎన్నో వాగ్దానాలు మనం చూస్తాం ఎవరైతే ఆయన అంగీకరిస్తారో అనగా తన నామమందు విశ్వాసం ఉంచుతారో వారందరికీ ఆయన తన పిల్లలయ్యే అధికారం ఇచ్చాడు అని లేఖనాలు ధృవీకరించాయి దేవుడు ఇచ్చాడట, ఒక అధికారం మనకి ఇచ్చాడు ఏంటి ఆ అధికారం మనం దేవుని పిల్లలము అని పిలవబడినట్లుగా ఒక రక్షించబడిన విశ్వాసి ఏసుక్రీస్తు ప్రభువు రక్తంలో కడగబడిన వ్యక్తి దేవుని బిడ్డగా దేవుని కుమార్తెగా దేవుని కుమారుడిగా కొనసాగుతున్నాడు దేవుని పిల్లలం కాదు మనం దేవుని పిల్లలము అని ఎవరు సాక్ష్యం ఇచ్చారు మనం దేవుని పిల్లలం అని ఎవరు ఇస్తున్నారు సాక్ష్యం అంటే పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు ఆత్మ తానే సాక్ష్యం చెబుతున్నారు మనం దేవుని పిల్లలం అని అది ఎంత గొప్ప ఆదిక్యత అది దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ప్రణాళిక అలాంటిది అబ్రహాముకు ఈ దేశం ఇస్తాను అని వాగ్దానం చేశాడు దేవుడు ఇచ్చాడు ఈరోజు నీ దేవుడు వాగ్దానాలు నెరవేర్చే దేవుడు ఆయన నీకు ఇస్తాను అని వాగ్దానం చేసిన దేవుడు ఆయన ఇచ్చే దేవుడు ఆయన బైబిల్ గ్రంధంలో హిజకియ అనే ఒక రాజు మనకు కనబడతాడు యూదా రాజ్యాన్ని పరిపాలన చేసిన రాజుల్లో హిజకియా చాలా ప్రాముఖ్యమైనది వాడు హిస్కియాకు ఒకరోజున మరణకరమైన రోగం వచ్చినప్పుడు నీ ఇల్లు చక్కబెట్టుకో అన్న వర్తమానం అతనికి వచ్చేసింది అయితే హిస్కియా ఆ వర్తమానాన్ని విన్న తర్వాత తను ఎవరి దగ్గర పరిగెత్తగలడు ఎవరి వైపు చూడగలడు ఒక నిర్ణయం తీసుకున్నాడు గోడ తట్టు తిరిగి ప్రార్థన చేస్తానని గోడ తట్టు తిరగడం అంటే మరెవ్వరు అతన్ని చూడడం లేదు మనుషులు కనబడటం లేదు లేదా అతని చుట్టూ ఉన్న ఆ అధికారులు కనబడడం లేదు తనకి ఆలోచన ఇచ్చే ఆలోచనకర్తలు ఎవరు అక్కడ లేరు దేవుని వైపు తిరగాలని ఆశతో గోడ తట్టు తిరిగి ప్రార్థన చేయడం ప్రారంభించాడు నీవు ఇల్లు చక్కబెట్టుకో అని వర్తమానం ఇచ్చి వెళ్ళిపోతున్న ప్రవక్తతో దేవుడు మరల మాట్లాడాడు నువ్వు వెళ్ళాలి ఇంకొక వర్తమానం హిస్కియకు చెప్పాలని యషయా దైవజనుడు వెనక్కి వచ్చి దేవుడు చెప్పమన్న మాట చెప్పాడు నేను నీ ప్రార్థన విన్నాను నీ కన్నీటిని చూశాను నీకు మరలా ఆయుషును ఇస్తున్నాను ఎంత చక్కని మాట అది నీవు కన్నీళ్లు విడిచుట నేను చూశాను నీ ప్రార్థన నేను అంగీకరించాను నీకు ఆయుషషును ఇస్తున్నాను దేవుని బిడ్డలారా ఈరోజు మరణభయ నిన్ను వెంటాడుతుందా ఎవరో చెప్పేసారు ఒక నెల లేదా ఒక రెండు నెలలు మాత్రమే నువ్వు బ్రతుకుతావ్ మూడు నెలలు మాత్రమే నువ్వు జీవించగలవు ఈ రోగం నిన్ను మరణానికి ఇడ్చుకొని పోతుంది నీకు ఆ దోషం ఉంది ఈ దోషం ఉంది అందును బట్టి ఈ నెలలో నువ్వు అదైపోతావు ఇది అయిపోతావ్ అని ఎవరెవరో నిన్ను చూసి మాట్లాడుతున్నారా మానసికంగా నిన్ను కృంగదీయడానికి ప్రయత్నం చేస్తున్నారా నీకు ఆయుష ఇచ్చువాడే దేవుడు కదా ఆయన కదా జీవాధిపతి ఆయన్ని గట్టిగా పట్టుకో ఆయన యందు విశ్వాసం ఉంచు నీకు వస్తున్న బలహీనతను చూసి కృంగుపోతున్నా నీవు దేవుని వైపు చూడగలిగితే ప్రభువా విశ్వాసంతో నీ దగ్గరికి వస్తున్నాను నాకు జీవం ఇచ్చినవాడు నీవు ఆయుషషుని ఇచ్చువాడు నీవు హిస్కియాకు ఆయుషషును పొడిగించిన దేవుడు నీ జీవితంలో మేలు చేస్తాడు ఆయన ఇస్తాను అని వాగ్దానం చేసింది దేవుడు నా ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉంది తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం ఉంది అని యేసుప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు మాట్లాడారు ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చారు ఏసుప్రభువు అంటే తన ప్రాణం పెట్టడానికి వచ్చారు ఆయన నశించిపోతున్న మనలను పాపము చేత అపరాధముల చేత క్షీణించిపోయి మరణ బంధకాల చేత ఉన్న మనల్నిందరిని విడిపించి జీవ ప్రాప్తులుగా మనల్ని కలుగచేయాలని దేవుడు ఈ లోకానికి వచ్చారు సిలువ మీద యేసుప్రభువు తన ప్రాణాన్ని అర్పించారు తాను చెప్పినట్టుగానే మూడో రోజున మరణాన్ని జయించి తిరిగి లేచారు ఏసుక్రీస్తు ప్రభువు యొక్క మరణ పునరుత్థానాలే ఈరోజున మనందరికీ బలం క్రైస్తవ విశ్వాసం యొక్క బలాదిక్యతలు అన్నీ కూడా క్రీస్తు ప్రభువు యొక్క మరణ పునరుత్థానాల మీద ఆధారపడి ఉన్నాయి అవే మనకు రక్షణ ఇస్తున్నాయి నీతిమంతులుగా తీర్చబడడానికి అవకాశం వచ్చాయి ఆ కారణాన్ని బట్టి ఈరోజున చాలామంది యేసుప్రభువు మరణ పునరుత్థానాల మీద విపరీతమైన దాడి చేస్తున్నారు ఆ రెండు జరగలేదు అని బైబిల్ స్పష్టీకరిస్తున్న విషయం ఏసుప్రభు జీవాధిపతి ఆయన నీ పాపముల నిమిత్తం నా పాపముల నిమిత్తం సిలువపై ఏసుప్రభువు వేలడి మరణాన్ని జయించి మూడో రోజున ఆయన తిరిగి లేచారు నిరీక్షణ మన హృదయాల్లోకి ఇచ్చారు ఆనాడు అబ్రహాముకు ఇస్తానని వాగ్దానం చేశారు దేవుడు ఇచ్చాడు ఈరోజు మనకు ఎన్నో వాగ్దానాలు దేవుడు చేశాడు అవన్నీ మన జీవితంలో నెరవేర్చడానికి దేవుడు సామర్థ్యం గలవాడు…

Instagram

Youtube

Facebook

X

Threads

Telegram

 

Genesis 12:7 EXplanation in Telugu

Genesis 12:7 EXplanation in Telugu

Genesis 12:7 EXplanation in Telugu

Leave a Comment