3యోహాను 1:2 ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోను వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను.

3యోహాను 1:2 ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోను వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను.

3 john 1:2 Explanation in Telugu | 3 John 1:2 Meaning in Telugu
3 John 1:2 Explanation in Telugu | 3 John 1:2 Meaning in Telugu

 

భక్తుడైన యోహాను గారు గాయు అనబడే వ్యక్తికి ఈ ఉత్తరాన్ని రాస్తున్నారు మనకు తెలుసు కదా యోహాను గారు ఐదు ప్రాముఖ్యమైన పుస్తకాలు బైబిల్ లో రాశారు యోహాను సువార్త మూడు పత్రికలు మరియు చివరి గ్రంధమైన ప్రకటన గ్రంధం ఆయన దేవుని ప్రేమ గురించి ప్రాముఖ్యంగా ఎక్కువగా తన పత్రికలో రాసుకుంటూ వచ్చారు సువార్త మనకు తెలుసు ఏసుప్రభు దైవత్వాన్ని గురించి ఆయన సువార్తను రాశారు అయితే ఈ మూడవ పత్రికలో గాయు అనబడే ఒక వ్యక్తికి ఉత్తరం రాస్తూ ప్రియుడా అని సంభోదించాడు గాయు ఎవరికి ప్రియుడు అంటే దేవుని సేవకునికి ప్రియుడు అంతకన్నా ప్రాముఖ్యంగా దేవునికి ప్రియమైనవాడు మనం లోకంలో చాలామందికి ప్రియంగా ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం ఆ ప్రయత్నాల్లో విఫలమైపోయినప్పుడు బాధపడుతూ ఉంటాం కానీ దేవునికి ప్రియముగా దేవుని బిడ్డలకు ప్రియముగా మనం ఉండగలిగితే అంతకన్నా ఆశీర్వాదం మరొకటి లేదు నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి మరియు సౌఖ్యంగా ఉండాలి దేవుడు అన్ని విషయాల్లో మనల్ని ఆశీర్వదిస్తారు అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే ముందు నీవు ఆధ్యాత్మికంగా వర్ధిల్లాలి నీ లోపల ఉన్న ఆత్మ లేదా ఆంతర్య పురుషుడు అభివృద్ధి పొందినప్పుడు లేదా వర్ధిల్లినప్పుడు నీవు అన్ని విషయాల్లో కూడా అభివృద్ధి పొందుతావు ఇది లేఖన సత్యం చాలామంది ఈ రోజుల్లో కేవలం భౌతిక సంబంధ ఈవుల కోసం యేసు ప్రభువు దగ్గరికి రావడం జరిగినా జరగకపోయినా కొంత కాలం ఉండి మరల వెళ్ళిపోవడం చూస్తూ ఉన్నాం కానీ నీ భక్తిలో స్థిరత్వం ఉంటే నువ్వు దేవుని గట్టిగా పట్టుకున్నప్పుడు ఆత్మలో వర్ధిల్లుతావు ఆధ్యాత్మికంగా నువ్వు వర్ధిలువాడిగా ఉండాలనే దేవుని యొక్క ఆలోచన ఎప్పుడైతే నువ్వు స్పిరిచువల్ గా డెవలప్ అవుతూ ఉంటావో లేదా స్పిరిచువల్ ప్రాస్పరిటీ అనేది నీలో ఉంటదో దేవుడు అన్ని విషయాల్లోనూ నిన్ను ఆయన ఆశీర్వదిస్తాడు అందులో సందేహం ఏమీ లేదు మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతకండి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయని ఏసుప్రభు వారు చాలా స్పష్టంగా కొండ మీద ప్రసంగంలో ఆయన మాట్లాడారు ముందు నువ్వు ఆత్మలో వర్ధిల్లితే అన్ని విషయాల్లో అనగా కుటుంబ పరంగా కావచ్చు సామాజిక పరంగా కావచ్చు ఆర్ధిక పరంగా కావచ్చు శారీరకంగా కావచ్చు అన్ని విషయాల్లో దేవుడు నిన్ను వర్ధిల్లింప చేస్తాడు అనేది లేఖన సత్యం మనం యెహోషువా గ్రంథం ఒకటవ అధ్యాయం ఎనిమిదవ వచనం చదివితే అక్కడ యెహోషువాకి దేవుడు ఇచ్చిన సందేశం ఏంటంటే నీవు ధర్మశాస్త్రాన్ని దివారాత్రం ధ్యానం చేస్తే నీ మార్గమును వర్ధిల్లింప చేసుకుంటావని దేవుని మాట అక్కడ యెహోషువాకు అందించబడింది మన మార్గమును వర్ధిల్లింప చేసుకోవడం మన పయనము మన భవిష్యత్తు మనం ప్రయాణం చేసే విధానం వర్ధిల్ల గలిగితే అంతకన్నా ఆశీర్వాదం ఏముంది యెహోషువ దేవుని వాగ్దానాలను ధ్యానం చేశాడు దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేశాడు కాబట్టే యెహోషువా దీవెన పొందడం మాత్రమే కాకుండా తన తర్వాత తరాలు కూడా దీవెనకరంగా ఆయన మారాడు కుటుంబం అంతా కూడా అనేకమందికి ఆశీర్వాదకరంగా మారారు అంత మాత్రమే కాదు మనం

కీర్తనలు 92:13
యెహోవా మందిరములో నాటబడినవారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు.

ఎక్కడ నిజంగా ఆధ్యాత్మిక అభివృద్ధి అంటే దేవుని మందిరం దేవుని సంఘం దేవుని ప్రజలతో సహవాసం చేయడం సమాజంగా మనం చేరుకోవడం అలా ఉన్నప్పుడు దేవుని కార్యాలు స్పష్టంగా మన జీవితంలో చూస్తాం చాలా కుటుంబాలు దేవునికి దగ్గరగా రావడం ద్వారా దేవుడు అన్ని విషయాల్లో వారిని ఆశీర్వదించి ఉన్నతమైన స్థితిలో నిలబెట్టారు ఒకవేళ చాలా మంది నిన్ను చూసి నీ జీవితం ఇలాగే దారిద్రత లోనో లేమిలోనో ఉండిపోతుంది నువ్వు ఎవరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండవని నిన్ను చూసిన వాళ్ళందరూ జాలి పడుతున్నారేమో లేదా అలా మాట్లాడుకుంటూ ఉంటే ముందు నువ్వు స్పిరిచ్యువల్ గా డెవలప్ అవ్వడం నేర్చుకోగలిగితే దేవుడు అన్ని విషయాల్లో నిన్ను ఆశీర్వదిస్తాడు ఆయన ఆశీర్వాదం ఇచ్చే దేవుడు ఆదాము హవ్వలను ఆశీర్వదించిన దేవుడు అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు బైబిల్ లో మీరు ఎవరినైనా తీసుకోండి వారు ఆధ్యాత్మికంగా పటిష్టంగా ఉన్నప్పుడు దేవుడు వారిని అనేకమంది దీవనకరంగా మార్చాడు….

Instagram

Youtube

Facebook

X

Threads

Telegram

 

3 John 1:2 Explanation in Telugu

3 John 1:2 Explanation in Telugu

3 John 1:2 Explanation in Telugu

Leave a Comment