Jude 1:1 Explanation in Telugu యూదా 1:1 యేసుక్రీస్తు(క్రీస్తు అను శబ్దమునకు అభిషిక్తుడని అర్ధము) దాసుడును, యాకోబు సహోదరుడునైన యూదా, తండ్రియైన దేవునియందు ప్రేమింపబడి, యేసుక్రీస్తు నందు భద్రము చేయబడి పిలువబడినవారికి శుభమని చెప్పి వ్రాయునది.

యూదా ఏసుక్రీస్తు ప్రభువు యొక్క సహోదరుడిగా కనబడుతున్నాడు వీరు మొదట యేసు ప్రభువును అంగీకరించలేదు కానీ ఆ తర్వాత ఏసుప్రభువు యొక్క మరణ పునరుత్థానాలు జరిగిన తరువాత వీరు ప్రభువుని గట్టిగా పట్టుకొని ఆయన వెంబడించి క్రైస్తవ సంఘంలో అద్భుతంగా వాడబడ్డారు యాకోబు గారు ఒక పత్రిక రాశారు యూదా కూడా ఒక పత్రిక రాశారు ఈ పత్రికలో యూదా చాలా అమూల్యమైన విషయాలు మాట్లాడుకుంటూ వస్తూ ప్రారంభంలో ఏమంటాడంటే నేను యేసుప్రభువు దాసుడిని అన్నాడు నేను ఏసుప్రభు దాసుడిని వాస్తవంగా ఏసుక్రీస్తు ప్రభువుకి సహోదరుడు కానీ దాసుడను అనే మాట అక్కడ వాడాడు నిజమే మనందరం కూడా క్రీస్తు ప్రభువు దాసులుగా ఉన్నాం ఆయన్ని సేవించువారంగా ఒకప్పుడు మనందరం పాపానికి దాసులం కానీ ఏసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన తన రక్తంతో మనల్ని కడిగి శుద్ధీకరించి పవిత్రపరిచి నీతికి దాసులుగా ప్రభువు మనల్ని చేశారు ఇప్పుడు యాకోబు ఏమంటున్నాడఅంటే దేవుని దగ్గర మనకు లభించిన మూడు ప్రాముఖ్యమైన ఆశీర్వాదాలు ఏంటంటే ఒకటి ప్రేమ రెండవది భద్రం చేయబడ్డాం మూడోది పిలవబడ్డాం అనే మాట అక్కడ వాడాడు అందును బట్టి మనకు కనికరము సమాధానము ప్రేమ విస్తరిస్తాయని ఆ తర్వాత వచనంలో కూడా మనం చూస్తే ఎందుకు దేవుడు మనకు కనికరాన్ని ప్రేమను సమాధానాన్ని విస్తరింప చేస్తారు అంటే ఆ పైన యూదా భక్తుడు మాట్లాడుతున్నాడు మనం దేవుని చేత ప్రేమించబడ్డాం అన్నాడు ఈ లోకంలో ఎవరు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా ఎవరి ప్రేమకు నువ్వు నోచుకున్నా నోచుకోకపోయినా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు ప్రేమిస్తూనే ఉంటాడు ఆయన ప్రేమ శాశ్వతమైందని ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం మూడవ వచనంలో వ్రాయబడింది
యిర్మియా 31:3
చాలకాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై యిట్ల నెను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీయెడల కృప చూపుచున్నాను.
దేవుని ప్రేమలో అరమరికలు లేదు ఆయన ప్రేమలో స్వార్థం లేదు సంకుచిత స్వభావం అసలే ఆయనకు ఉండదు దేవుడు మనల్ని తన మహా ప్రేమతో ప్రేమించి మనందరిని కూడా పాప బానిసత్వం నుండి అపరాధముల నుండి ప్రభువు మనల్ని విడిపించారు మనందరం వాస్తవానికి మన పాప స్వభావం బట్టి దేవుని ఉగ్రతకు పాత్రులయ్యాం గాని క్రీస్తు ప్రభువు ప్రేమ మనల్ని కమ్ముకొనుట ద్వారా ఆ ఉగ్రత నుండి దేవుడు మనల్ని తప్పించారని లేఖనాలు సెలవిస్తున్నాయి మనం దేవుని చేత ప్రేమించబడ్డాం అంత మాత్రమే కాకుండా క్రీస్తునందు భద్రం చేయబడ్డాం ఈ భద్రత ఎలాంటిది అంటే ఈ భూమి మీద మనం నివసించినంత కాలం ఆయనతో సహవాసం చేయడం ద్వారా క్రీస్తు ప్రభువు యొక్క మార్గంలో మనం నడవడం ద్వారా అనేక కీడుల నుంచి ఉపద్రవాల నుంచి దురాత్మ శక్తుల ప్రాబల్యం నుండి దయ్యపు శక్తుల ప్రాబల్యం నుండి మనం తప్పించబడుతూ క్రీస్తు ప్రభువుకి మహిమార్థంగా మనం జీవిస్తూ ఉంటాం ఆత్మీయ పోరాటంలో అనేకసార్లు మనం పడగొట్టబడాలని లేదా మనము ఇబ్బందుల్లోకి నెట్టివేయబడాలని ఎన్నో ప్రయత్నాలు అపవాది చేస్తున్నప్పుడు ఏసుక్రీస్తు ప్రభువు నామము మరియు ఆయన వాక్యము పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ద్వారా మనం కాపాడబడుతూ తప్పించబడుతూ ఆయనకు మహిమకరంగా ఉన్నాం అంత మాత్రమే కాకుండా క్రీస్తు ప్రభువును అంగీకరించడం ద్వారా మనం రాబోతున్న నిత్య ఉగ్రత నుండి కూడా తప్పించబడతాము ఆ ఉగ్రత నుండి తప్పించబడడానికే క్రీస్తు ప్రభువు మనకోసం సిలువలో మరణించారు తన అమూల్యమైన రక్తాన్ని మనకోసం కార్చారు రక్షణను ఏ ఒక్కరు కూడా తక్కువగా చూడడానికి లేదు అమూల్యమైన రక్షణ మనకు ఇవ్వడానికి క్రీస్తు ప్రభువు తన విలువైన రక్తాన్ని కార్చారు తన ప్రాణాన్ని మనకోసం అర్పించారు ఆయన కేవలం మనల్ని రక్షించాలనే మనల్ని భద్రం చేయాలనే అనేకమైన ఉపద్రవాల నుంచి మనల్ని రక్షించాలని ప్రభువు ఎల్లప్పుడూ ఆశపడుతున్నారు క్రీస్తు ప్రభువుతో సహవాసం చేయడం ద్వారా అట్టి భద్రత నువ్వు పొందుకుంటావ్ క్రీస్తు ప్రభువు ఒక సందర్భంలో అన్నారు నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి నేను వాటిని నా చేతుల్లో తీసుకున్నాను నా చేతుల్లో నుంచి ఏ ఒక్కరు వారిని అపహరింపనేరరు అనే మాట ప్రభువు వాడారు ఎందుకోసం అంటే నేను వాటికి నిత్యజీవాన్ని ఇస్తున్నాను గనుక అనే మాటను ప్రభువు ఉపయోగించారు నిజమే నిత్యజీవం క్రీస్తు ప్రభువు ద్వారా మనకు అనుగ్రహించబడుతుంది గనుక ఆయన చేతుల్లో నుంచి మనల్ని ఏ ఒక్కరు అపహరింపనేరారు చూడుము నరచేతులలో నేను చెక్కుకున్నానని వాగ్దానం చేసిన దేవుడు మనల్ని భద్రం చేస్తున్నాడు ఒకవేళ ఏదైనా భయం ఈరోజు నిన్ను వెంటాడుతుందా కీడు జరుగుద్దేమో ఎవరో ఏదో అన్నారు ఎవరో ఏదో చేస్తున్నారని మరొకరి ద్వారా విన్నాను ఏమన్నా అయిపోద్దేమో నాకు ఏమన్నా జరిగిపోద్దేమో మా పిల్లలకి ఏమన్నా అయిపోద్దేమో వారి భవిష్యత్తులు నాశనం అయిపోతాయేమో అన్న భయంతో ఒకవేళ ఈరోజు నువ్వు ఉంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు క్రీస్తు ప్రభువులో నువ్వు భద్రం చేయబడ్డావు గనుక నువ్వు ఆయన స్తుతించాలి ఆయన ఘనపరచాలి అంత మాత్రం కాకుండా దేవుడు మనల్ని పిలిచాడట క్రైస్తవ జీవితం ఒక ఉన్నతమైన పిలుపులో కొనసాగే జీవితం మనలో ఏ ఒక్కరం కూడా మన ఇష్టానుసారం జీవించడానికి గాని లేదా ఇష్టానుసారం ప్రక్క త్రోవలకు వెళ్ళడానికి దేవుడు మనల్ని పిలవలేదు ఆయన ఒక ఉన్నతమైన పిలుపు మనక ఇచ్చారు ఒక దర్శనాన్ని మనక ఇచ్చారు ఆ దర్శనం ఏంటంటే మనము దేవుని రాజ్యాన్ని వ్యాప్తి చేయాలి క్రీస్తు ప్రభువు ప్రేమను అనేకమందికి తెలియజేయాలి అగ్నిలో నుండి లాగినట్టు కొంతమందిని సేవ్ చేయాలని దేవుడు మనక ఒక బాధ్యతను ఇచ్చాడు సర్వలోకానికి వెళ్ళండి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని మనకు విజన్ ఇచ్చాడు అందును బట్టి మన పిలుపుని ఎప్పుడూ మనం మర్చిపోకూడదు ఆ పిలుపులో మనం కొనసాగుతూ ఉండాలి మన దర్శనంలో మనం కొనసాగినప్పుడు దేవుని ఆశ్చర్య కార్యాలు స్పష్టంగా మనం చూస్తాం కొన్నిసార్లు నీ దర్శనం నువ్వు పక్కకు తొలగిపోయినప్పుడే కొన్ని రకాలైన ఇబ్బందులు శ్రమలు నిందలు ఎదుర్కుంటున్నావేమో కానీ ఎప్పుడైతే మరల దేవునితో సహవాసం చేస్తావో ఆయన దర్శనంలో ముందు కొనసాగుతుంటావో ఉన్నతమైన పిలుపు కలుగు బహుమానం కొరకు నువ్వు ఎదురు చూస్తావో కచ్చితంగా నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి నువ్వు ప్రేమించబడ్డావు భద్రం చేయబడ్డావు…
Jude 1:1 Explanation in Telugu
Jude 1:1 Explanation in Telugu
Jude 1:1 Explanation in Telugu