Ephesians 3:20 Explanation in Telugu ఎఫెసీయులకు 3:20 మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగువాటన్నిటికంటెను, ఊహించువాటన్నిటికంటెను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి,

అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా చేయ శక్తి గల దేవుడు అనే మాట దేవుడు ఎలాంటివాడు అంటే శక్తి గలవాడు ఆయన శక్తి అపరిమితమైన శక్తి దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే కార్యసాధకమైన తన శక్తి ఒక కార్యాన్ని తలపెట్టారంటే పూర్తి చేసే శక్తి దాన్ని నెరవేర్చే శక్తి ప్రభువుకు ఉంది ఈ శక్తి ఎలాంటిది అంటే కొన్నిసార్లు మనం అడిగే వాటికన్నా ఊహించే వాటికన్నా ఎక్కువగా చేసే శక్తి మనం అడిగేవి కొన్ని ఉండొచ్చు కానీ ఊహించేవి మాత్రం చాలా ఎక్కువ ఉండి ఉండొచ్చు ఎందుకంటే ఊహలు ఉచితమే చాలా చాలా ఊహలు మనకు ఉంటాయి కానీ అడిగేవి కొన్ని అడుగుతూ ఉంటాయి లేఖనం మనల్ని బలపరుస్తున్న విషయం ఏంటంటే అడిగేవి మాత్రమే కాదు ఊహలకు మించిన కార్యాలు కూడా దేవుడు మన జీవితంలో జరిగిస్తారని ఈరోజు బహుశా దేవుని సన్నిధిలో నువ్వు కొన్ని అడుగుతున్నావు కొన్ని అడగడానికి సాహసించలేకపోతున్నావేమో విశ్వాసం సరిపోవట్లేదేమో దేవుడు చేయలేడేమో నండి ఆయన ఇవ్వలేడేమో నండి ఈ అద్భుతం ఆయన ద్వారా కాదేమోనండి ఇది ఆయనకు అసాధ్యమేమో నండి అడిగి ఇంకా ఉపయోగం లేదు అని అలా ఊరకుండి పోతున్నానండి అని అనుకుంటున్నావా నువ్వు అడుగు దేవుని నువ్వు అడిగే వాటికన్నా ఊహించే వాటి కన్నా అత్యధికంగా దేవుడు చేస్తాడని వాగ్దానం చేస్తున్నాడు యోసేపు తన జీవితంలో చెరసాలలో ఉన్నప్పుడు బహుశా బయట పడితే చాలు చెరసాల నుంచి అన్న కోరిక మాత్రమే యోసేపులో ఉండిఉంటదేమో ఒక భయంకరమైన శోధనను జయించడానికి చెరసాలకైనా వెళ్ళిపోయాడు కానీ శోధనకు లొంగిపోలేదు యోసేపు చెరసాలలో ఉన్నాడు రెండు సంవత్సరాలు ఆ చెరసాల అనుభవాన్ని కలిగి ఉన్నాడు ఒకాయనకి మేలు చేశడు నన్ను జ్ఞాపకం చేసుకోమని సహాయాన్ని అడిగాడు యోసేపు కానీ ఆ వ్యక్తి మర్చిపోయాడు అందును బట్టి యోసేపు తలంపుల్లో నేను ఈ చెరసాల నుంచి బయటిక వస్తే చాలేమో ఈ బందీకానా నుంచి బయటిక వస్తే చాలేమో అని అనుకని ఉండొచ్చు కానీ దేవుని ప్రణాళికలు ఎంత గొప్పవి అంటే యోసేపు నువ్వు కేవలం ఈ బందీకానాల నుంచి బయటకి రావడం మాత్రమే కాదు ఈ చెరసాల నుంచి బయటకి రావడం మాత్రమే కాదు నీవు అనేకమంది దీవనకరంగాను ఆశీర్వాదకరంగాను కరువులో సైతము దేశాన్ని చుట్టుపక్కల దేశాన్న కాపాడడానికి నువ్వు సామర్థ్యం కలిగి ఉండడానికి నిన్ను నియమించాను కాబట్టి ఈజిప్ట్ ఐగుప్తు సింహాసనం మీద కూర్చునే ఆ కృపను దేవుడు యోసేపుకి ఇచ్చాడు అడిగింది కొద్దిగా అయి ఉండొచ్చు కానీ దేవుడు యోసేపును ఊహించిన స్థానానికి దేవుడు తీసుకెళ్ళాడు యోసేపు అన్నలు కూడా యోసేపును గుర్తుపట్టలేకపోయారు ఎందుకంటే వాళ్ళ స్థాయి ఎప్పుడు ఎలా ఉందంటే మావాడు ఒక స్థాయిలోనే ఉంటాడు ఇక్కడి వరకే ఉంటాడు అంతకుమించి ఎదగలేడు అంతకుమించి పైకి రాలేడు అని అనుకుని ఉంటారు అందును బట్టి యోసేపు ఆ స్థానంలో వారు ఊహించలేకపోయారు దేవుడు మన జీవితంలో చేసే కార్యాలు ఎంత గొప్పగా ఉంటాయి అంటే ఈరోజు ఎవరైతే నిన్ను నిందిస్తున్నారో ఎవరైతే నీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారో చీటికి మాటికి గొడవలు పెట్టుకొని కలవరంతో నింపుతున్నారో నిన్ను అసహ్యంగా హీనంగా చూస్తున్నారో ఒకనాడు దేవుడు వారి ముందే నీ తల ఎత్తాలని నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకురావాలని దేవుడు ఆశిస్తున్నాడు దానికి నీకు కావలసింది ఏంటో తెలుసా సహనం కావాలి ఆ వ్యాధ్యాన్ని దేవుని చేతికి సమర్పించే విశ్వాసం కావాలి నీకు యుద్ధం యెహోవాదే పగ తీర్చుట నా పని అని ప్రభువు అన్నాడు కాబట్టి ఆయన చేతులకు సమస్యను పెట్టేస్తే ఆయన చేతిలోకి వ్యాధ్యాన్ని అప్పగిస్తే నీకు సరైన విధానంలో మేలు చేసే దేవుడు ఆయన అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే ఇవ్వగల దేవుడు హన్నా దేవుని సన్నిధికి వచ్చి తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కృమ్మరించేసింది తనక ఒక అవసరత ఉంది ఆ అవసరతను బట్టి అనేకమంది ఆమె నిందిస్తున్నారు ప్రభువు సన్నిధికి వచ్చింది హృదయాన్ని కృమరించేసుకుంది హన్నా ప్రభువా ఒక కుమారుని దయచేసి నా మీద నిందను తొలగించి ప్రభువా అని ప్రార్థన చేసింది అయితే దేవుడు కుమారుని ఇచ్చాడు అయితే ఆ కుమారుడు ఎటువంటి వాడు అంటే ఇశ్రాయేలు రాజ్యాన్ని శాసించగలిగే ప్రవక్తను దేవుడు ఇచ్చాడు ఆయన చేతుల మీదగా రాజులు అభిషేకించబడ్డారు అనేకమంది ప్రవక్తలను సిద్ధపరిచిన సమూయేలు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేశారు వీరోచితమైన జీవితాన్ని జీవించాడు సాహసోపేతమైన కార్యాలు ఎన్నో సమూయేలు ద్వారా దేవుడు జరిగించాడు ఈరోజు నువ్వు అడుగుతుంది కొంచెం అయి ఉండొచ్చు కానీ ప్రభువు నీ ప్రార్థన వింటున్నాడు దేవుడు నీ ప్రార్థన వింటున్నాడని నమ్మకంతో ప్రార్థన చేస్తే ఆయన నీకు ఊహించలేని మేళ్లు నీ ఊహలకు మించి అద్భుతాలు చేయడానికి శక్తి గల దేవుడు ఆయన అందును బట్టి నీ జీవితంలో మేలు చేయడం ద్వారా తన నామమునకు యుగముల పర్యంత మహిమను ఆపాదించుకుంటారు నువ్వు కృంగిపోవద్దు దేనికి అధైర్య పడొద్దు దేనికి తగ్గొద్దు నిలబడు దేవుని కోసం ప్రభువు నీ జీవితంలో నీ ఊహలకు మించిన మేళ్లు జరిగించ అద్భుతాలు జరిగిస్తారు…
Ephesians 3:20 Explanation in Telugu
Ephesians 3:20 Explanation in Telugu
Ephesians 3:20 Explanation in Telugu