ద్వితియోపదేశకాండము 2:7 నీ చేతుల పనులన్నిటిలోను నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వ దించెను. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ నలువది సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన యెరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై యున్నాడు, నీకేమియు తక్కువకాదు.

Deuteronomy 2:7 Explanation in Telugu ద్వితియోపదేశకాండము 2:7 నీ చేతుల పనులన్నిటిలోను నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వ దించెను. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ నలువది సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన యెరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై యున్నాడు, నీకేమియు తక్కువకాదు.

Deuteronomy 2:7 Explanation in Telugu | Deuteronomy 2:7 Meaning in Telugu
Deuteronomy 2:7 Explanation in Telugu | Deuteronomy 2:7 Meaning in Telugu

 

మోషే అక్కడున్న నవతరంతో మాట్లాడుతున్నాడు అరణ్య యాత్రలో చాలామంది తమ ప్రాణాలు కోల్పోయారు దేవుని మీద తిరుగుబాటు చేయడం వలన అయితే అక్కడన్న నవతరానికి మోషే ఇస్తున్న మాటలు ఇవన్నీ కూడా ఈ 40 సంవత్సరాలు దేవుడు మిమ్మల్ని అరణ్యంలో నడిపించాడు ఆయనకి తెలుసు పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా దేవుడు ఉండి ఏది కావాలంటే అది అది వారికి అనుగ్రహించి దేవుడు వారిని నడిపించాడు ఎందుకంటే అబ్రహాము ఇస్సాకు యాకోబులకు దేవుడు వాగ్దానం చేశాడు నేను మీకు కనాను దేశాన్ని ఇస్తానని అక్కడ మీరు సుస్థిరంగా స్థిరపడతారు అని దేవుడు వాగ్దానం చేశాడు ఆ వాగ్దానం నిలబెట్టుకోవడం కోసం దేవుడు వారందరినీ నడిపిస్తూ నడిపిస్తూ నడిపిస్తూ దాదాపుగా ఇక వారు కనాను దేశం చేరే ఆ పరిస్థితిలో మోషే వారందరితో మాట్లాడుతున్నాడు మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి దేవుడు మిమ్మల్ని ఎలా నడిపించాడో ఆయన మీ చేతు పనులన్నిటిలోనూ మిమ్మల్ని ఆశీర్వదించాడు ఈ మాటలు చెబుతూ అన్నాడు నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు గనుక నీకేమియు తక్కువ కాదు అని ఒక అభయాన్ని ఒక వాగ్దానాన్ని అక్కడ ఇచ్చాడు దేవుడు మనకు తోడై ఉన్న దేవుడు ఆమెన్ ఇమ్మానియేల్ అనే మాటకు దేవుడు మనకు తోడు అని ఒంటరితనంతో భయంకరమైన అనుభవాల చేత నింపబడిన మనందరినీ తన యొక్క సాన్నిధ్యం ద్వారా తన కృప ద్వారా తనకు దగ్గరగా తీసుకున్న దేవుడు ఎల్ల వేళల మనకు తోడై ఉన్నాడు దావీదు భక్తుడు కూడా అంటాడు గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయనికి భయపడను ఎందుకు భయపడను అంటే గాఢాంధకారంలో భయం ఉంటది గాఢాంధకారపు లోయలో నడుస్తున్నప్పుడు కలవరం ఉంది ఆందోళన ఉంది కానీ నేను ఎందుకు భయపడటం లేదు అంటే నీ సన్నిధి నీవు నాకు తోడై ఉన్నావు గనుక నేను భయపడను అంటాడు ఈరోజు బహుశ్య నీ జీవితంలో అందరూ వదిలిపెట్టి నిన్ను వెళ్ళిపోయారా అందరూ విడిచిపెట్టి నిన్ను ఇబ్బందులు పాలు చేస్తున్నారా నీతో ఉంటాము లేదా నీకు తోడుగా ఉంటాము నీకు సహకరిస్తాము నీకు ఏదైనా కష్టం వస్తే మమ్మల్ని జ్ఞాపకం చేసుకో అని వాగ్దానం చేసినవారు చాలామంది ఇప్పుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారేమో ఒక పక్కన బాధలు ఒక ప్రక్కన కష్టాలు ఒక ప్రక్కన అప్పులు వేధిస్తూ ఉంటే మరొక ప్రక్కన ఆ ఎడబాటు ఒంటరతం నేను బాగా కృంగదీస్తూ ఉంటే దేవుని నీతోనే మాట్లాడుతున్నాడు ఎవ్వరు నీతో ఉన్నా ఉండకపోయినా దేవుడు నీతో ఉన్నాడు ఆయన ఉంటాడు కూడా యుగా సమాప్తి వరకు నేను నీతో కూడా ఉంటానని వాగ్దానం చేసిన యేసుప్రభువుని నువ్వు ఎప్పుడూ విస్మరించొద్దు ఆయన వాగ్దానాలు ఎప్పుడు మర్చిపోవద్దు ఒక క్రైస్తవునికి దేవుని వాగ్దానాల బలం ఈ జీవన యాత్రలో జీవన సంఘర్షణలో దేవుని వాగ్దానాలు మనక ఇచ్చే బలం ఇంకా ఏమి మనకి ఇవ్వలేవు అందును బట్టి ప్రతి ఒక్కరు దేవుని వాగ్దానం మీద ఆధారపడాలి నీకేమి తక్కువ కాదు నీకు ఏది అవసరమో దాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు నీకు అవసరం కానివి దేవుడు నీకు ఇవ్వడు అనే నమ్మకం నీలో ఉండాలి అవసరమైనవి దేవుడు నీకు ఇస్తాడు అందును బట్టి ఇచ్చిన వాటిని బట్టి నువ్వు సంతృప్తి కలిగి ఉండి దేవుని స్తుతించినప్పుడు దేవుడు మరిన్ని విశాలమైన ద్వారాలు నీ కోసం ఆయన తెరుస్తాడు ఏలియా అనే దైవజనుని గురించి మనందరికీ తెలుసు ఒకసారి దేవుడు ఏలియాతో మాట్లాడుతున్నాడు ఏలియా నీవు సారిపతి అనే ఊరికి నువ్వు వెళ్ళు అక్కడ ఒక విధవరాలకి నేను ఆజ్ఞాపించి నన్ను పోషించాలని ఆ మాట నమ్మడానికి ఏలియాకు చాలా విశ్వాసం కావాలి కొన్నిసార్లు దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు ఆయన మాటకు లోబడతామా లేదా అనే పరీక్ష గుండా మనల్ని తీసుకువెళ్తాడు ఒక విధవరాల ద్వారా నేను పోషించబడడం ఏంటి బయటంతా కరువు ఉంది భయంకరమైన పరిస్థితి ఉంది అలాంటి సందర్భంలో భర్త లేని విధవరాలు నన్ను ఎలా పోషించగలుగుతుంది నన్ను ఎలా ఆదరించగలుగుతుంది అనే అనుమానం ఏలియాకు వచ్చిఉండొచ్చు కానీ చెప్పినవాడు దేవుడు కదా ఆజ్ఞ ఇచ్చినవాడు ప్రభువు కదా అందును బట్టి కచ్చితంగా దేవుని మాటకు లోబడి సారపతి అనే ఊరికి ఏలియా వెళ్ళాడు అయితే తను ఏ విధవరాల ద్వారా అయితే పోషించబడబోతున్నాడో ఆ విధవరాలికి కూడా అవసరాలు ఉన్నాయి పుల్లలు లేవట అందరూ బట్టి ఇంటి నుండి బయటికి వచ్చింది కొంచెం పిండి కొంచెం నూనె ఉంటే ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు లేదా ఎన్ని పూటలు భోజనం వస్తే అన్ని పూటలు వాటిని వండుకొని తిందాం అనుకున్న ఆ పరిస్థితిలో దైవజనుని మాటకు లోబడిన సారేపతి విధవరాలు దైవజనులకు మాత్రమే కాకుండా తన ఇంటివారందరికీ ఆశీర్వాదకరంగా మారింది దేవుని బిడ్డలారా ఒక మాట ఆలోచన చేయండి కరువు ఉన్నప్పుడు దేవుడు సమృద్ధి నా ఇంట్లో ఉంచాడు నీ చుట్టూ పరిస్థితులు మారిపోతున్నాయని నువ్వు భయపడాల్సిన అవసరత లేదు అనేకమంది ఉద్యోగాలు పోతున్నాయండి లేకపోతే షేర్ మార్కెట్లు కుదలు అయిపోతున్నాయట పరిస్థితులన్నీ విచిత్రంగా ఉన్నాయట మళ్ళ రెసెషన్ రాబోతుందట ఇలాంటి మాటలు వింటున్నప్పుడు కొన్నిసార్లు భయము ఆందోళన అవిశ్వాసం మనలోకి రావచ్చు గానీ మనల్ని పోషించువాడు దేవుడు మనల్ని బలపరచువాడు దేవుడు మనల్ని నడిపించువాడు దేవుడు గనుక ఆయన మీద నువ్వు ఆనుకున్నప్పుడు ఆయన మీద ఆధారపడినప్పుడు నీ చుట్టూ ఎలాంటి ప్రతికూల వాతావరణం ఉన్న ఏమియు తక్కువ కాకుండా దేవుడు మనల్ని పోషించే దేవుడు….

 

Instagram

YouTube

Facebook

X

Threads

Telegram

 

Deuteronomy 2:7 Explanation in Telugu

Deuteronomy 2:7 Explanation in Telugu

Deuteronomy 2:7 Explanation in Telugu

 

 

Leave a Comment