యెషయా 43:2 నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై యుందును నదులలో బడి వెళ్లునప్పుడు అవి నీమీద పొర్లిపారవు. నీవు అగ్నిమధ్యను నడచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు

Isaiah 43:2 Explanation in Telugu యెషయా 43:2 నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై యుందును నదులలో బడి వెళ్లునప్పుడు అవి నీమీద పొర్లిపారవు. నీవు అగ్నిమధ్యను నడచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు

Isaiah 43:2 Explanation in Telugu/ Isaiah 43:2 Meaning in Telugu
Isaiah 43:2 Explanation in Telugu/ Isaiah 43:2 Meaning in Telugu

 

Isaiah 43:2 Explanation in Telugu నాలుగు విషయాలు ఇక్కడ రాయబడ్డాయి ఇవన్నీ కూడా కొన్ని సందర్భాల్లో మన జీవితంలో మనం ఎదుర్కుంటున్న శ్రమలకు సాదృశ్యంగా కనబడుతున్నాయి జలములు నదులు ఆ తర్వాత అగ్ని మరియు జ్వాలలు విశ్వాస జీవితంలో భక్తి జీవితంలో మనం ఎదుర్కునే శ్రమలు ఇబ్బందులకు సూచనగా ఉన్నాయి కొన్నిసార్లు ప్రభువులో మనం ఎంత బలంగా ఉన్నప్పటికీ విశ్వాసంలో ఎంత దృఢంగా ఎదుగుతున్నప్పటికీ ఏదో ఒక శ్రమ ఏదో ఒక ఇబ్బంది మనల్ని కృంగదీయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది అటువంటి సమయాల్లో మనం ఏం చేయాలి అలాంటి సమయాల్లో మనం ఎటు పరిగెత్తాలి సాధారణంగా అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు వెంటనే మనుషులు ఎవరు మనకు సహాయం చేస్తారని పరిగెడతాం లోక సంబంధమైన వ్యక్తులు ఎవరైనా మనకోసం సహాయం చేస్తారేమో అని వారి వైపు చూస్తాం కానీ అటువంటి పరిస్థితిలో ప్రభువు మాట్లాడుతున్నాడు నువ్వు జలముల్లోనుంచి వెళ్ళినప్పుడు నేను నీకు తోడై ఉంటాను నదుల్లో నుంచి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు దేవుడు ఎన్నో అద్భుతాలు చేసి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎర్ర సముద్రాన్ని దాటగలిగే కృపను ఇచ్చాడు ఫరో అతనికి ఉన్న శ్రేష్ఠమైన ఆరువందల రథములను ఐగుప్తు రథముల నన్నిటిని వాటిలో ప్రతిదానిమీద అధిపతులను తీసుకొనిపోయి ఇశ్రాయేలీయులను తరిమాడు ఫరోను అతని సైన్యమును ఇశ్రాయేలీయులు చూసి మిక్కిలి భయపడి దేవుడికి మొర పెట్టినప్పుడు దేవుడు వారిని ఎర్రసముద్రంలో మునిగిపోయేలా చేసి తన ప్రజలకు ఎర్ర సముద్రాన్ని దాటగలిగే కృపను ఇచ్చాడు

తర్వాత యెహోషువ గ్రంధం 3 అధ్యాయం దగ్గరికి వస్తే దాదాపుగా ఇంక కనాను దేశంలోకి అడుగుపెట్టడానికి ముందు యోర్ధాను నది అడ్డు వచ్చినప్పుడు దేవుడు యోర్ధాను నది నీళ్లను ఏకరాశిగా నిలవబెట్టారు దేవుని వాగ్దానాలు మనం నమ్మినప్పుడు కచ్చితంగా మన జీవితాల్లో కూడా మేలు చేస్తాడు మన జీవితాల్లో కూడా దేవుని మాటకు విధేయత చూపించగలుగుతున్నామా దేవుడు తన వాక్యము ద్వారా బయలుపరిచిన లేదా ప్రత్యక్ష పరిచిన విషయాలు మన జీవితాలకు అన్వయించుకొని వాటికి లోబడగలిగితే దేవుడు మనకు మేలు చేస్తాడు నీవు అగ్నిమధ్యను నడచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు రాజగు నెబుకద్నెజరు చేయించిన బంగారు ప్రతిమకు సాగిలపడి నమస్కరించని వాళ్లను అగ్ని గుండంలో వేయిస్తా అని చెప్పడంతో రాజగు నెబుకద్నెజరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు అందరూ నమస్కారము చేశారు కానీ షద్రకు, మేషాకు, అబేద్నెగో అలా చేయలేదు నువు మమ్మల్ని అగ్నిగుండంలో పడవేసిన మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్ధుడు ఆయన రక్షించకపోయినా నువ్వు చేయించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమని చెప్పారు దానికి నెబుకద్నెజరు కోపంతో వారిని అగ్ని గుండంలో వేయించాడు షద్రకు, మేషాకు, అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుష్యులు అగ్నిజ్వాలలచేత కాల్చబడి చనిపోయారు కానీ షద్రకు, మేషాకు, అబేద్నెగోలకు మాత్రం ఏ హాని కలుగలేదు వారి తల వెంట్రుకలలో ఒక తల వెంట్రుక కూడా కాలిపోలేదు వారి వస్త్రములు కాలిపోలేదు ఇక్కడ దేవుడు తన ప్రజలను కాపాడడానికి నిర్ణయించుకున్నాడు ఆయన వారికి తోడుగా ఉన్నాడు షద్రకు, మేషాకు, అబేద్నెగోను, యోసేపును దేవుడు హెచ్చించాడు వారు సామాన్యమైన వ్యక్తులైనప్పటికీ అసామాన్యమైన కార్యాలు అసాధారణ కార్యాలు చేయడానికి దేవుడు వారికి శక్తిని ఇచ్చి వారిని హెచ్చించాడు దేవుడు ఎప్పుడూ మనల్ని అనాధులుగా విడిచిపెట్టలేదు తన శక్తిని తన ప్రభావాన్ని నిరంతరాయంగా మన మీద కృమ్మరించడానికి ప్రభువు ఇష్టపడుతున్నారు గనుక ఆయన సాక్షులుగా మనం జీవించగలిగితే అంతకన్నా ఆశీర్వాదం మరొకటి లేదు…

 

Instagram

YouTube

Facebook

X

Threads

Telegram

 

Isaiah 43:2 Explanation in Telugu

Isaiah 43:2 Explanation in Telugu

Isaiah 43:2 Explanation in Telugu

 

Leave a Comment