Isaiah 118:15 Explanation in Telugu కీర్తనలు 118:15 నీతిమంతుల గుడారములలోరక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును యెహోవా దక్షిణహస్తము సాహస కార్యములను చేయును.

Isaiah 118:15 Explanation in Telugu నీతిమంతుల గుడారములో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదాలు వినబడుతున్నాయి కొంతమంది గృహాల్లో వ్యర్థమైన సినిమా పాటలు కొంతమంది ఉదయం నుండి సాయంకాలం దాక ఇంటిలో వింటూనే ఉంటారు అటువంటి వాళ్ళ ఇళ్లల్లో దేవుని సన్నిధి ఎందుకు ఉంటుంది ఆ ఇళ్లల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఎలా నివసించగలడు ఆ ప్రాంతాల్లో పరిశుద్ధమైన వాతావరణం నీ ఇంటిలో ఉన్నప్పుడే దేవుని నామం నీ ద్వారా మహిమ పరచబడుతూ ఉంటుంది నీతిమంతుల గుడారములో రక్షణ యొక్క అనుభవాన్ని వారు ఎరిగి ఉంటారు దేవుని రక్షణను గురించిన అనుభవాన్ని నువ్వు తెలుసుకున్నప్పుడు అనుభవ జ్ఞానంలోనికి వచ్చినప్పుడే నీ ఇంటిలో ఉత్సాహ సునాదాలు వినబడతాయి అంతవరకు కూడా ఏదో నువ్వు లోక సంబంధంగా ఆనందంగా ఉన్నట్టు కనబడిన అందరికన్నా ఏదో గొప్పగా సంతోషిస్తున్నట్టు నువ్వు కనబడిన నీ హృదయంలో మాత్రం ఒక వెలితి ఏది కూడా నీకు సంతోషాన్ని ఇవ్వదు అందరూ కలిసి దేవుని స్తుతిస్తుంటే పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి అక్కడ బలంగా పని చేస్తూఉంటుంది దేవుని నీతితో నువ్వు నింపబడినప్పుడు రక్షణ అనుభావంలోకి వచ్చినప్పుడు దేవునిలో నువ్వు ఆనందిస్తావు అంతమాత్రం కాకుండా దేవుని యొక్క దక్షిణ హస్తము సాహస కార్యములు చేస్తుంది అని నీ దేవుడు సాహసాలు చేసే దేవుడు ఆయన బలహీనుడు కాదు శక్తిహీనుడు కాదు తన ప్రజల కోసం ఎన్నో సాహసాలు దేవుడు చేశాడు దేవుడు బలమైన కార్యాలు చేస్తున్నాడు పరాక్రమం గలవాడు దేవుని హస్తము బలమైన కార్యాలు జరిగిస్తుంది
1. ఇశ్రయేలు ప్రజలు ప్రయాణంలో ఎర్ర సముద్రం వస్తే దేవుడు దాన్ని చీల్చి ఎర్ర సముద్రంలో మార్గం ఏర్పరిచి తన ప్రజలు నడిపించిన గొప్ప దేవుడు ఆయన ఫరో సైన్యాన్ని సముద్రంలో ముంచి ఫరో సైన్యం నుండి ఇశ్రాయేలు ప్రజలును దేవుడు రక్షించాడు.
2. షద్రకు, మేషాకు, అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుష్యులు అగ్నిజ్వాలలచేత కాల్చబడి చనిపోయారు కానీ షద్రకు, మేషాకు, అబేద్నెగోలకు మాత్రం ఏ హాని కలుగలేదు వారి తల వెంట్రుకలలో ఒక తల వెంట్రుక కూడా కాలిపోలేదు వారి వస్త్రములు కాలిపోలేదు.
3. దానియేలుకు సింహములు ఏ హాని చేయకుండా దేవుడు వాటి నోళ్లను మూసివేశాడు.
4. సముద్రంలో వచ్చిన భయంకరమైన తుఫానును ఒక్క మాటతో శాంతింపజేశాడు.
5. సమాధిలో ఉన్న లాజరును యేసు తిరిగి జీవింపజేశాడు.
6. పౌలు, సీలలు ఫిలిప్పీలో సువార్త ప్రకటించినందుకు కొట్టబడి చెరసాలలో వేయబడ్డారు మనుషులు పౌలు, సీలలను బంధించారు కానీ దేవుడు వారి బంధాలను విప్పాడు అంతేకాదు, ఆ సంఘటన ద్వారా చెరసాల అధికారి మరియు అతని ఇంటివారు రక్షణ పొందారు.
ఎవరైతే నిన్ను బాధిస్తున్నారో ఎవరైతే నిన్ను వేధిస్తున్నారో వారి మీద నీకు జయం ఇచ్చే దేవుడు ఆయన ఎందుకంటే ఆయన హస్తము సహస కార్యములు చేస్తుంది యేసయ్య ఈ లోకంలో అనేకమంది జీవితాల్లో సాహసకార్యాలు ఎన్నో చేశాడు ఎంతో మందిని స్వస్థపరిచాడు కుష్ట రోగులను ముట్టినప్పుడు కుష్ట రోగం విడిచి వెళ్ళిపోయింది రోగులు మూర్చ వ్యాధి కలిగినవారు అనేకమైన వ్యాధులతో ప్రభువు దగ్గరికి వచ్చిన వారు స్వస్థత పొందుకున్నారు యేసుప్రభు వారిని ముట్టి స్వస్థపరిచాడు ఆయన చేతిలో శక్తి ఉంది ఆయన చేతి నీడలో ప్రభావం ఉంది ఆయన ముట్టిన వారందరూ స్వస్థత పొందారు…
Instagram
YouTube
Facebook
X
Threads
Telegram
Isaiah 118:15 Explanation in Telugu
Isaiah 118:15 Explanation in Telugu