Luke14:4 Explanation in Telugu| లూకా 14:4 అని ధర్మశాస్త్రోపదేశకులను పరిసయ్యులను అడుగగా వారూరకుండిరి. అప్పుడాయన వానిని చేరదీసి స్వస్థపరచి పంపివేసి

దేవుడు మాట్లాడుతున్న మాట నేను వానిని చేరదీసెదను ఆయన మనల్ని త్రోసేసే దేవుడు కాదు లేదా చెదరగొట్టేసే దేవుడు కాదు ఆయన మన అవిధేయతను బట్టి మన గర్వాన్ని బట్టి మన అహంభావను బట్టి చెదిరిపోయే వ్యక్తులుగా మనం ఉంటాం కానీ దేవుడు ఎప్పుడూ కూడా మనల్ని పోగు చేయాలని సమకూర్చాలని దేవుడు ఆశిస్తున్నాడు ఆయన మనల్ని బలపరచాలని కోరుతున్నాడు నేను వానిని చేరదీస్తాను ఈ రోజుల్లో చాలామంది ప్రజల చేత ద్వేషించబడుతున్నప్పుడు లేదా మనుషులు వారిని దూరంగా పెట్టేసినప్పుడు విలవిలాడిపోతూ ఉంటారు బాధపడుతూ ఉంటారు వారు నన్ను పట్టించుకోవట్లేదండి వారు నన్ను దగ్గరికి రానివ్వట్లేదండి వారి ఆనందంలో వాళ్లే గాని నన్ను వారి ఆనందంలో లేదా వారి సహవాసంలో నన్ను ఉండనివ్వట్లేదండి అని చాలామంది వెలివేతకు గురి వేయబడిన వారు బాధపడడం మనం చూస్తున్నాం అయితే దేవుని మంచితనం బైబిల్ లో ఎంత స్పష్టంగా కనబడుతుంది అంటే గొప్ప దేవుడు ఆది దేవుడు సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవుడు మనలను చేరదీసే దేవుడట చెదిరిపోయిన మనందరినీ కూడా చేరదీసి మనల్ని బలపరిచి తన మహిమ కొరకు ఆయన మనల్ని నిలబెడతారు.
కీర్తనలు 27:10
నా తలిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును.
తల్లిదండ్రులు బిడ్డలను ప్రేమిస్తారు అయితే కొన్ని పరిస్థితుల్లో వారు బిడ్డల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు బహుశా కొంతమంది మానసికంగా బిడ్డల్ని వదిలిపెట్టేస్తారు వారి బాగోగులు పట్టించుకోరు తల్లిదండ్రులు ఉన్న లేనట్టుగానే చాలా మంది పిల్లలు బ్రతికేస్తున్నారు లోకంలో కొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రులని కోల్పోయిన వారు ఉంటారు యాక్సిడెంట్ల ద్వారానో లేదా వ్యాధి రావడం ద్వారానో తల్లిలో తండ్రో దూరమైపోయిన పరిస్థితుల్లో కొంతమంది చిన్న బిడ్డలు ఎదుగుతూ ఉంటారు లేదా చిన్న బిడ్డలు బ్రతుకుతూ ఉంటారు బైబిల్ సెలవిస్తా ఉంది భౌతికమైన తల్లిదండ్రులు కొన్ని సందర్భాల్లో మనల్ని వదిలిపెట్టి వెళ్లిపోవచ్చు కానీ పరమందున్న దేవుడు మన తండ్రి అయిన దేవుడు మనల్ని విడిచి పెట్టు వాడు కాదు ఆయన మనల్ని చేరదీస్తాడని చక్కని మాట రాయబడింది దావీదు భక్తుని జీవితంలో కూడా బహుశా తల్లిదండ్రుల నుంచే కొంత అవమానాన్ని కూడా ఎదుర్కొని ఉండొచ్చు ఎందుకోసం అంటే సమూయేలు యెష్షయి బిడ్డల్ని అభిషేకించడానికి వచ్చినప్పుడు యెష్షయి అందరిని పిలిచాడు కానీ దావీదుని పిలవలేదు ఇంకెవరైనా ఉన్నారని అడిగేంతవరకు కూడా దావీదు గుర్తుకు రాలేదు యెష్షయికి కానీ దేవుడు దావీదును కోరుకొని దావీదును ఎన్నుకొని దావీదును చేరదీసి ఇశ్రయేలు రాజ్యానికి రాజుగా నిలబెట్టాడు ఈరోజు బహుశా నీవు కూడా ఒంటరితనంతో ములుగుతున్నావా ప్రజలందరూ నిన్ను వెలివేసారా అందరూ నిన్ను దూరం పెట్టేసారా అందరూ నిన్ను చెదరగొట్టేస్తున్నారా నీ దేవుడు నిన్ను చేరదీయువాడు ఆయన నిన్ను బలపరిచే దేవుడు ఆయన.
లూకా 14:1
విశ్రాంతిదినమున ఆయన భోజనము చేయుటకు పరిసయ్యుల అధికారులలో ఒకని యింటిలోనికి వెళ్లినప్పుడు, ఆయన ఏమి చేయునో అని వారాయనను కనిపెట్టు చుండిరి.
లూకా 14:2
అప్పుడు జలోదర రోగముగల యొకడు ఆయన యెదుట ఉండెను.
లూకా 14:3
యేసు విశ్రాంతిదినమున స్వస్థపరచుట న్యాయమా కాదా?
లూకా 14:4
అని ధర్మశాస్త్రోపదేశ కులను పరిసయ్యులను అడుగగా వారూరకుండిరి. అప్పు డాయన వానిని చేరదీసి స్వస్థపరచి పంపివేసి
యేసుప్రభు వారు ఈ లోకంలో ఉన్న కాలంలో ఆయన ఒక ఇంటికి భోజనానికి ఆహ్వానించబడ్డారు ఆయన భోజనాన్ని కూర్చున్నప్పుడు ఆయనక ఎదురుగా వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి కనబడ్డాడు జలోదర వ్యాధి వచ్చిన వాళ్ళకి శరీరం అంతా కూడా వాచిపోయి ఉంటది అన్నమాట అంటే బొబ్బలు కట్టేసి శరీరం అంతా నీరు పట్టినప్పుడు ఎలా ఉబ్బిపోయి ఉంటదో అలాంటి వ్యాధి అది విశ్రాంతి దినం యేసుప్రభువు అక్కడ ఉన్న ధర్మశాస్త్రోపదేశకులును పరిసయ్యులను అందరినీ అడిగాడు విశ్రాంతి దినమున ఇతన్ని స్వస్థపరచడం న్యాయమా కాదా అని అడిగినప్పుడు వారూరకుండిరి అప్పుడు యేసుప్రభువు అతన్ని చేరదీసి స్వస్థపరిచి పంపించాడు అలాంటి వ్యక్తిని దూరం నుండి చూడడానికే చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటారు చాలామంది కానీ ఏసుప్రభు అతన్ని చేరదీసి ఆ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిని భయంకరంగా శరీరం ఉబ్బిపోయిన వ్యక్తిని చూడడానికే కష్టమవుతున్న పరిస్థితిలో యేసుప్రభువు అతన్ని హత్తుకొని చేరదీసి నేను ఉన్నాను నేను నిన్ను బలపరుస్తాను నిన్ను స్వస్థపరుస్తాను నా మహిమ కొరకు నేను వాడుకుంటాను ఆ వ్యక్తికి స్వస్థత వచ్చిన తర్వాత బహుశా చాలా మంది చేరదీయడానికి ప్రయత్నం చేశారేమో కానీ ఆ పరిస్థితిలో ఉన్నప్పుడే ఆ రోగముతో అతను బాధపడుతున్నప్పుడే ప్రభువు అతన్ని చేరదీశడు ఏసుప్రభువు మంచితనం అదే అందరూ నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారా నీ కష్టాలను చూసి అందరూ నిన్ను హేలం చేస్తున్నారా నీ దేవుడు నిన్ను చేరదీసి నిన్ను స్వస్థపరిచి తన మహిమ కొరకు నిన్ను వినియోగించుకునే దేవుడు ఆయన వైపు చూస్తావా అక్కడున్న వారందరి మధ్యలో యేసుప్రభు ఆ వ్యక్తిని చూసి స్వస్థపరిచి పంపించారు ఎక్కడైతే దుఃఖం ఉందో వేదన ఉందో కృంగుదల ఉందో నిరుత్సాహం ఉందో వైఫల్యం ఉందో అక్కడ దేవునికి దృష్టి ఉంది ఎందుకోసం అంటే నిన్ను బలపరచడానికి నిన్ను లేవనెత్తడానికి తన మహిమ రాజ్య విస్తరణలో నిన్ను వాడుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు ఆయన నిన్ను చేరదీసే దేవుడు…
Luke14:4 Explanation in Telugu
Luke14:4 Explanation in Telugu
Luke14:4 Explanation in Telugu