కీర్తనలు 8:6 నీ చేతిపనుల మీద వానికి అధికారమిచ్చి యున్నావు.

కీర్తనలు 8:6 నీ చేతిపనుల మీద వానికి అధికారమిచ్చి యున్నావు.

Psalms 8:6 Explanation in Telugu | Meaning & Bible StudyPsalms 8:6 Meaning in Telugu | Meaning & Bible Study
Psalms 8:6 Explanation in Telugu | Meaning & Bible Study Psalms 8:6 Meaning in Telugu | Meaning & Bible Study

 

క్రైస్తవుడు ఎక్కడ ఆనందించగలడు అంటే దేవుని వాక్యములోనే ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించువాడు ఏ శ్రమ కూడా మనల్ని వెనకకు లాగలేదు ప్రభువులో ముందుకు సాగిపో దేవుడు మనిషిని సృష్టించడంలో దేవునికి ఉన్న ఉద్దేశం మనం అధికారం కలిగిన వారంగా బ్రతకాలని, సృష్టి మీద అధికారం కలిగిన వారుగా ఉండాలని దేవుని ఆలోచన ఆదాము హవ్వలను దేవుడు కలుగజేసి వారిని విశేషంగా ఆశీర్వదించారు మీరు ఫలించండి అభివృద్ది పొందండి భూమిని లోబరుచుకోండి అని ప్రభువు చక్కని మాటను తెలియజేశారు అధికారం ఇచ్చిన దేవుడు అయితే మానవుడు దేవుని మాటను దిక్కరించుట వలన ఆయన ఆజ్ఞకు లోబడక ఇష్టానుసారంగా జీవించడం వలన తనకున్న అధికారాన్ని కోల్పోయాడు బానిసగా మారిపోయాడు పాపం చేసే ప్రతి ఒక్కడు పాపమునకు దాసుడు అని బైబిల్ సెలవిస్తున్న రీతిగా మానవుడు దాస్య గృహంలోనికి వెళ్ళిపోయాడు అయితే సువార్త సత్యం ఏంటి అంటే యేసయ్య 2000 సంవత్సరాలు క్రితం లోకానికి వచ్చి మన అందరి కోసం సిలువ మీద మరణించి మరలా అన్ని విషయాల్లో మనకు అధికారం ఇవ్వాలని దేవుని ఆలోచన ఆయన సంకల్పం క్రీస్తు ప్రభువును ఎవరైతే తమ హృదయాలను అంగీకరిస్తున్నారో వారిని బానిసత్వం నుండి విడిపించి దాస్య గృహం నుండి బయటకు తీసుకొని వచ్చి అధికారం కలిగిన వారిగా నిలబెట్టాలని ప్రభువైన యేసు సిలువలో మన కోసం మరణించారు. నీ చేతి పనుల మీద నువ్వు వానికి అధికారం ఇచ్చి ఉన్నావని బైబిల్ సెలవిస్తుంది దేవుడు మనకు ఎందుకు అధికారం ఇవ్వగలడు అంటే ఆయన సర్వాధికారి కాబట్టి చాలామందిఆయన దేవుడు అని బైబిల్ లో ఎక్కడ ఉంది అని ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు బైబిల్ సెలవిస్తున్న మాట ఆయన సర్వాధికారము కలిగిన దేవుడు. యేసుప్రభువారి లోకంలో ఉన్నప్పుడు దయ్యముల శక్తి మీద వారికి అధికారం ఇచ్చిన దేవుడు రోగములను నయం చేయడానికి అధికారం ఇచ్చి వారిని పంపించినప్పుడు వారు వెళ్ళి మొదట సువార్తను ప్రకటించి ఆ తరువాత రోగులను నయం చేశారు. దయ్యముల శక్తి మీద అధికారం ఇచ్చిన దేవుడు చాలాసార్లు దూరత్మలు దయ్యపు శక్తులు నిన్న వెనుకకు లాగాలని విశ్వసం నుండి నిన్ను బలహీన పరచాలని అపవాది ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు యేసయ్య నీకు అధికారం ఇస్తాడు యేసయ్య నామంలో శక్తి ఉంది ఆయన నామములో అధికారము ఉంది ప్రభువును ఆశ్రయించినప్పుడు మరల నీకు అధికారం అనుగ్రహించబడుతుంది. రక్షించబడిన వారు ఇకపై బానిసలు కాదు రక్షించబడిన వారు ఇకపై దాస్య గృహంలో ఉన్న వారు కాదు వారు విడుదల పొంది దేవుని అధికారంతో దేవుని ఏర్పాటులో పని చేస్తారు దేవుని ఏర్పాటులో పని చేయడానికి నీకు అధికారం ఇవ్వబడింది కృంగిపోకు యేసయ్య రక్తం ద్వారా కడగబడిన తర్వాత ఆయన సిలువ రక్తం ద్వారా మనం శుద్ధి చేసుకున్నపుడు దేవుడు మనల్ని అధికారముతో నింపుతాడు. నిరాశ నిస్పృహ వీటిని వదిలేసి దేవుని కొరకు నువ్వు పని చేయగలిగితే ఆశీర్వాదం ఉంది ఆమెన్.

Psalms 8:6 Explanation in Telugu | Meaning & Bible Study

Psalms 8:6 Explanation in Telugu | Meaning & Bible Study

Psalms 8:6 Meaning in Telugu | Meaning & Bible Study

Psalms 8:6 Meaning in Telugu | Meaning & Bible Study

1 thought on “కీర్తనలు 8:6 నీ చేతిపనుల మీద వానికి అధికారమిచ్చి యున్నావు.”

Leave a Comment