యెహోషువ 1:5 నీవు బ్రదుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ యెదుట నిలువలేక యుండును; నేను మోషేకు తోడై యుండినట్లు నీకును తోడైయుందును.

Joshua 1:5 Explanation in Telugu యెహోషువ 1:5 నీవు బ్రదుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ యెదుట నిలువలేక యుండును; నేను మోషేకు తోడై యుండినట్లు నీకును తోడైయుందును.

Joshua 1:5 Explanation in Telugu | Joshua 1:5 Meaning in Telugu 
Joshua 1:5 Explanation in Telugu | Joshua 1:5 Meaning in Telugu

 

నేను మోషేకు తోడై ఉండినట్లు నీకు కూడా తోడై ఉంటాను మోషేకు దేవుడు ఎలా తోడై ఉన్నాడో యెహోషువాకు తెలుసు కదా ఇశ్రాయేలు ప్రజలందరిలో కూడా మోషేకు చాలా సన్నిహితంగా ఉన్నవాడు యెహోషువా ఆయా సందర్భాల్లో మోషే దేవునితో ఎలా సంభాషించాడో లేదా ఎలా దేవునిలో కొనసాగాడో దేవుని మార్గములు ఎలా తెలుసుకున్నాడో చాలా సునిషితంగా పరిశీలన చేసిన వ్యక్తి యెహోషువా యెహోషువ ఎప్పుడైతే ఇశ్రయేలు ప్రజలకి నియమించబడ్డాడో దేవుడు తన వాగ్దానాల ద్వారా అతన్ని బలపరిచారు కారణం ఏంటి అంటే అప్పటివరకు ఇశ్రాయేలు ప్రజలను కనాను దేశం వైపుగా నడిపించిన మోషే యోర్ధాను ప్రాంతంలోని పిస్గా అనే ఆ కొండ దగ్గర అక్కడ తన ప్రాణాన్ని వదిలేశాడు అక్కడే మోషే చనిపోయాడు మృతునొందాడు అయితే మోషే చనిపోయిన తర్వాత దేవుని ప్రణాళికలు ఆగిపోలేదు దేవుని ప్రణాళికలను దేవుడు తను ఏర్పరచుకున్న వ్యక్తుల ద్వారా కొనసాగింప చేస్తూ ఉంటాడు మనుషులు గతించిపోవచ్చు అధికారాలు గతించిపోవచ్చు ఆస్తులు గతించిపోవచ్చు కానీ దేవుని ప్రణాళికలు మాత్రం కొనసాగుతుంటే దేవుడు ఏ సమయంలో ఎవరిని లేపుకొని ఎవరిని ప్రేరేపించి తన ప్రణాళికలు నెరవేర్చుకుంటాడు అనేది ఆయన సంకల్పం యెహోషువా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు యెహోషువా ద్వారా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు ఆశ్చర్య కార్యాలు మోషే ఇశ్రయేలు ప్రజలని కనాను దేశం వరకు నడిపించాడు యెహోషువ కనానులోనికి దేవుని ప్రజలు నడిపించి ఆ ప్రాంతాలన్నీ కూడా స్వాధీన పరుచుకోవడానికి అనేకమందికి సహాయపడ్డాడు దేవుని బిడ్డలారా ఆ ప్రక్రియలో దేవుడు యెహోషువతో మాట్లాడుతూ నీవు బ్రతికే దినములన్నిటిలో ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేడు అన్నాడు దేవుడు యెహోషువాను అభిషేకించాడు తన శక్తిని ఇచ్చాడు శత్రువులు ఎప్పుడు కూడా నీ ముందు నిలవలేరు అలాంటి శక్తిని నీకు ఇస్తున్నాను అలాంటి ఆదిక్యత నీకు ఇస్తున్నాను కారణం యెహోషువాలో యుద్ధ నేర్పరితనం ఉందనో చాలా గొప్పవాడనో కాదు గానీ యెహోషువా పక్షంగా దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుడు తన సన్నిధిని తన మీద కృమరిస్తున్నాడు కాబట్టే యెహోషువా శక్తిమంతుడిగా మారాడు ఈరోజు బహుశా నీ ఎదుట చాలామంది నిలబడ్డారా నీ అభివృద్ధిని ఆటంక పరుస్తున్న వారు నీ ఆసక్తిని చిదిమేస్తున్నవారు దేవుని కార్యాల పట్ల నీకున్న శ్రేష్టమైన మనసును పాడు చేయాలని ప్రయత్నం చేసేవాళ్ళు బహుశా చాలామంది ఉన్నారా నీ అభివృద్ధిని అడ్డుకుంటున్న శక్తులు నీ ముందు ఉన్నాయా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నీ ఎదుట ఏ వ్యక్తి నిలవలేడు నీ శత్రువుల మీద నీకు జయం ఇచ్చే దేవుడు ఆయన శత్రువుల ఎదుట కూడా భోజనాన్ని సిద్ధపరచగలిగిన సామర్థ్యం కలిగినవాడు నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అని వాగ్దానం చేసిన దేవుడు నీ అభివృద్ధిని నీ విశ్వాసంలో నీ యాత్రను దేవుని పక్షాన నీకున్న ఆసక్తిని తృంచివేయాలని ఆశించే ప్రతి శత్రువు పన్నాగాన్ని దేవుడు రద్దుపరిచి నీకు గొప్ప విజయాన్ని దేవుడు దయచేయాలని కోరుతున్నాడు అంత గొప్ప దేవుడు మన దేవుడు ఎందుకు యెహోషువాకు దేవుడు తోడై ఉంటున్నాడు దేవుడు నాకు తోడై ఉంటాడు అని యెహోషువా ఎలా నమ్మగలడు అతనికుఉన్న గ్యారెంటీ ఏంటి అతనికి ఉన్న భరోసా ఏంటి అంటే నేను మోషేకు తోడై ఉండునట్లుగా నీకు కూడా తోడై ఉంటాను దేవుడు ఒక ఎగ్జాంపుల్ ని యహోషువ ముందు ఉంచాడు నేను మోషేకు తోడై ఉన్నట్టుగా నీకు తోడై ఉంటాను దేవుని బిడ్డలారా దేవుడు తన కార్యములను ఎంత గొప్పగా జరిగిస్తారో చూడండి మోషేకి దేవుడు ఎలా తోడై ఉన్నాడో యెహోషువాకు తెలుసు కాబట్టే అతని కళ్ళ ముందు జరిగిన సంఘటనలు దేవుడు మరలా తీసుకొచ్చి మోషే నేను ఎలా తోడై ఉన్నానో నీకు కూడా అలా తోడై ఉంటాను నువ్వు భయపడొద్దు నేను నీతో ఉన్నాను కాబట్టే నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు జడిసిపోవద్దు శత్రువుల మీద జయం ఇస్తానని దేవుడు వాగ్దానం చేసి యెహోషువాను అత్యంత బలంగా వాడుకున్నాడు ఈరోజు అనేక సమస్యలు నిన్ను సవాలు చేస్తున్నాయా అనారోగ్య సమస్యలు నిన్ను సవాలు చేస్తున్నాయా అప్పుల బాధలు రుణభారం నిన్ను సవాలు చేస్తుందా అవిశ్వాసులైన వారు లోక సంబంధమైన వ్యక్తులు నిన్ను సవాలు చేస్తున్నారా నీ భక్తిని తుంచివేయడానికి చాలామంది ప్రయత్నం చేస్తున్నారా బహుశా నీ భర్తే కావచ్చు నీ భార్యే కావచ్చు అల్లారి ముద్దుగా పెంచుకుని నీ పిల్లలే కావచ్చు నిన్ను దేవునికి దూరం చేసేయాలనే ఆలోచన వారు కలిగి ఉంటే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నువ్వు ధైర్యంగా ఆయన్ని ఆరాధించు ధైర్యంగా ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకో ధైర్యంగా ప్రభువు మార్గంలో కొనసాగు మోషేకు తోడై ఉన్న దేవుడు దావీదుకు తోడై ఉన్న దేవుడు దానియేలుకు తోడై ఉన్న దేవుడు అనేకమందికి తోడై ఉన్న దేవుడు నీకు నాకు కూడా తోడై ఉండి ఆయన తన మహిమ కొరకు తన రాజ్య విస్తరణ కోసం మనం మనల్ని వాడుకుంటారు ఎంత గొప్ప దేవుడిని మనం ఆరాధన చేస్తున్నాం…

 

Instagram

YouTube

Facebook

X

Threads

Telegram

 

Joshua 1:5 Explanation in Telugu

Joshua 1:5 Explanation in Telugu

Joshua 1:5 Explanation in Telugu

Leave a Comment