Psalms 97:8 Explanation in Telugu కీర్తనలు 97:8 యెహోవా, సీయోను నివాసులు ఆ సంగతి విని నీ న్యాయవిధులను బట్టి సంతోషించుచున్నారు యూదా కుమార్తెలు ఆనందించుచున్నారు.

సీయోను నివాసులట ఒక సంగతి విని బహుగా ఆనందిస్తున్నారు ఏం విన్నారు వాళ్ళు వారికి ఏం వినబడింది అంటే రెండు విషయాలు జాగ్రత్తగా గమనించండి ఒకటి యెహోవా రాజ్యము చేయుచున్నాడు ఆమెన్ దేవుడు రాజ్య పరిపాలన ఆయన రాజ్యము చేయుచున్నాడు ఈ విషయాన్ని విన్నారట రెండవది ఆయన మహిమ కనబడుతుంది ప్రజలందరికీ ఆయన ప్రత్యక్ష పరుస్తూన్నారు ఈ రెండు విషయాలు వినడం ద్వారా సీయోను నివాసులు సంతోషిస్తున్నారు ప్రియ దేవుని బిడ్డ ఈరోజు నీకు ఆనందం ఇచ్చే అంశాలు ఏంటి ఏ వార్తలు లేదా ఏ అంశాలు నీకు సంతోషాన్ని ఇస్తున్నాయి లోక సంబంధన వార్తలు మనిషికి కొంతకాలం సంతోషం ఇచ్చినట్టు కనబడిన ఆ తర్వాత మరల వారికి సంతోషం ఇవ్వకపోవచ్చు అందును బట్టి ప్రసంగి గ్రంథంలో మాట ఉంటది దుర్దినములు రాకమునుపే వీటి యందు నాకు సంతోషం లేదు అని చెప్పు సంవత్సరాలు రాకముందే కదా ఆ రోజులు రాకముందే అంటే ఏదైతే ఈరోజు నీకు ఆనందంగా ఉందో రేపు పొద్దున్న అది ఆనందం ఇవ్వకపోవచ్చు ఈరోజు నీకు సంతోషం అనిపించేవి ఒక వారం తర్వాతో ఒక నెల తర్వాతో నీకు ఆనందాన్ని ఇవ్వకపోవచ్చు కానీ దేవుడు ఎలాంటివాడు అంటే ఆయన రాజ్య పరిపాలనకు ఎవరైతే చోటిస్తారో లేదా ఎవరైతే ఆయన పరిపాలన క్రింద ఉండాలని ఆశిస్తారో వారు దేవుని మహిమకు సంబంధించిన విషయాలు వినడం ద్వారా వారు ఎల్లప్పుడూ ఆనందిస్తారు సంతోషిస్తారు అనే మాట అక్కడ మనం చూస్తున్నాం దేవుడు న్యాయవంతుడు ఆయన మన పట్ల తన ప్రేమను వ్యక్తీకరించడంతో పాటుగా ఎవరైతే మనకు విరోధంగా ఉన్నారో శత్రువులుగా ఉన్నారో ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారో తగిన సమయంలో దేవుడు వారికి బుద్ధి చెబుతాడు ఆయన న్యాయం తీర్చేవాడే అయితే దేవుని ప్రేమను అనుభవిస్తున్న మనందరం కూడా దేవుని స్తుతిస్తూ మనం ముందుకు కొనసాగినప్పుడు గొప్ప ఆనందాన్ని సంతోషాన్ని మనం అనుభవిస్తాం ప్రియ దేవుని బిడ్డ ఒకసారి విను ఈరోజు బహుశా నువ్వు దుఃఖంలో ఉన్నావేమో కన్నీరు ఎరులై పారుతుందేమో నీ సమస్యను ఎవరికీ చెప్పుకున్నా బహుశా వాళ్ళకి అర్థం కావట్లేదేమో ఇంతవరకు నీ చేతుల్లో పెరిగిన నీ పిల్లలే ఈరోజు నీకు వ్యతిరేకంగా మాట్లాడుతూ నిన్ను ద్వేషిస్తూ నిన్ను దూషిస్తూ ఇక నువ్వు నాకు అక్కర్లేద్దు అని సొంత మార్గాల్లో వారు ప్రయాణం చేయడానికి ఇష్టపడుతున్నారేమో లేదా ఇంతవరకు నువ్వు తల్లిదండ్రుల్ని చాలా చక్కగా వారిని బాగా చూసుకున్నావ్ వారు ఏదో ఒక విషయంలో నిన్ను ప్రతిసారి గాయపరుస్తూ ఉండొచ్చేమో భార్యా భర్తలు మధ్యలో విభేదాలు తల్లిదండ్రులకి పిల్లలకు మధ్య విభేదాలు ఎక్కడ చూసిన ఈరోజున అశాంతి అసమాధానం దుఃఖము ఏలుబడి చేస్తున్న ఈ ప్రపంచంలో నిజంగా నువ్వు ఆనందించాలంటే నువ్వు మొట్టమొదటిగా సీయోను నివాసిగా ఉండాలి ఐగుప్తు నివాసము వేరు సీయోను నివాసం వేరు ఇశ్రయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నంత కాలం మట్టి పనిలోనూ పొలముల పనిలోనూ జిగటమంటి పనిలోనూ వారు కఠినమైన సేవ చేస్తున్నప్పుడు ఆనందించలేకపోయారు సంతోషించలేకపోయారు పాప బానిసత్వం ఎప్పుడూ మనిషికి ఆనందాన్ని ఇవ్వదు ప్రారంభంలో కొంచెం ఆనందంగా అనిపించొచ్చు కానీ రాను రాను ఒక భయంకరమైన బంధకముగా భయంకరమైన ఆ అనిచివేత గురయ్యే పరిస్థితిలోకి మనిషి వెళ్ళిపోతున్నాడు కానీ ప్రభువు విషయం ఆనందం ఎంత గొప్పది అంటే సదాకాలము నువ్వు దేవునిలో ఆనందించాలి పరిశుద్ధాత్మలో నువ్వు ఆనందించాలి దేవుని మార్గములో నువ్వు ఆనందించాలి దేవుని వాక్యం చదవడంలో ప్రార్థించడంలో సహవాసాన్ని ప్రేమించడంలో దేవుని మందిరానికి రావడంలో దేవుని సేవను ప్రోత్సహించడంలో నువ్వు ఆనందించే వ్యక్తిగా ఉండాలి అది నిజమైన స్థిరమైన నిశ్చలమైన ఆనందం యూదా కుమార్తెలు ఆనందిస్తున్నారని అనే ఆ మాటకు అర్థం ఏంటంటే స్పిన్నింగ్ అరౌండ్ అని చూడండి కొన్నిసార్లు క్రింద పడి దొర్లి నవ్వుతారు చూసారా అలాంటి అనుభవం అన్నమాట ఉన్నతమైన ఆనందం అలాంటి ఆనందంలో నువ్వు కొనసాగాలనే పరిశుద్ధాత్మ దేవుడు ఆశిస్తున్నాడు ఈరోజు నీ జీవితం ఎలా ఉన్నప్పటికీ కూడా ప్రభువుకి నీ జీవితాన్ని అప్పగించు సీయోను నివాసిగా దేవుని స్వరాన్ని వినే వ్యక్తిగా నువ్వు ఉంటే అద్భుతాలు నీ జీవితంలో జరుగుతాయి…
Psalms 97:8 Explanation in Telugu
Psalms 97:8 Explanation in Telugu
Psalms 97:8 Explanation in Telugu