ఆదికాండము 16:13 అదిచూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాటలాడిన యెహోవాకు పెట్టెను ఏలయనగా నన్ను చూచినవాని నేనిక్కడ చూచితిని గదా అని అనుకొనెను.

Genesis 16:13 Explanation in Telugu ఆదికాండము 16:13 అదిచూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాటలాడిన యెహోవాకు పెట్టెను ఏలయనగా నన్ను చూచినవాని నేనిక్కడ చూచితిని గదా అని అనుకొనెను.

Genesis 16:13 Explanation in Telugu/  Genesis 16:13 Meaning in Telugu
Genesis 16:13 Explanation in Telugu/ Genesis 16:13 Meaning in Telugu

 

గమనించండి ఇక్కడ హాగరు అనబడే ఒక ఐగుప్తీయురాలు దేవునికి ఒ పేరు పెట్టింది చూచుచున్న దేవుడు నీవేని ఎల్రోయి అనే మాట మనం చూస్తాం ఇప్పుడు ప్రశ్న ఏంటంటే హాగరు పెట్టిందని దేవుడు చూడడం మొదలు పెట్టాడా లేదా దేవుడు చూసేవాడు కాబట్టి ఆమె గుర్తించిందా అనేది ప్రశ్న ఆమె గుర్తించింది అక్కడ దేవుడు ఎప్పుడూ చూచువాడే ఆమె పేరు పెట్టింది అనే కాదు కదా ఆయన ఎప్పుడూ చూచువాడు ఆయన యొక్క లక్షణం అది బైబిల్లో ఆయన యొక్క లక్షణాలు గుణ లక్షణాలు దేవుని ఆరాధించేటప్పుడు ఒక దేవుని మనం ప్రశంసించేటప్పుడు ఆయన స్తుతించేటప్పుడు ఆయన ఎటువంటివాడు ఆయన ఎలాంటి ఉన్నతమైన అనుభవాల చేత నింపబడినవాడు అని పరిశీలన చేయడం చాలా మంచి విషయం బైబిల్ గ్రంధం దరికి వస్తే దేవునికి ఉన్న కొన్ని అద్భుతమైన లక్షణాలు బైబిల్లో వర్ణించబడ్డాయి వివరించబడ్డాయి అందులో ఒకటి దేవుడు చూచే దేవుడు ఆయన చూచే దేవుడు అందరిని చూస్తున్న దేవుడు ఆయన ఆయన కన్నులకు మరుగైంది ఏది లేదు.

కీర్తనలు 94:9
చెవులను కలుగచేసినవాడు వినకుండునా? కంటిని నిర్మించినవాడు కానకుండునా?

మానవునికి చూడడానికి కన్నుచ్చినవాడే దేవుడు కళ్ళు లేని వ్యక్తుల్ని లేదా కళ్ళు లేని ప్రపంచాన్ని ఒకసారి మీరు ఊహించండి ప్రపంచంలో 800 కోట్ల మంది ఎవరికీ కళ్ళు లేవు అనుకోండి ఎలా ఉంటుంది ప్రపంచం దేవుడు కళ్ళు ఇచ్చాడు కాబట్టి ఒకరినొకరు చూడగలుగుతున్నాము ఈ ప్రపంచం ఇలా కొనసాగుతుంది మానవునికి కళ్ళు ఇచ్చిన దేవుడు చూడకుండా ఉంటాడా ఆయన చూస్తున్న దేవుడు ఆయన, హాగరు దేవుని పేరు పెట్టింది నన్ను చూచుచున్న దేవుడని చూచుచున్న దేవుడు నీవే ఎల్రోయి అబ్రహాము ఐగుప్తు వెళ్లి హాగర్ని తీసుకొచ్చాడు షారమ్మకు దాసిగా ఉంది అయితే షారాకు పిల్లలు లేకపోవడం చూసి ఆ షారా తన దాసి అయిన హాగర్ను అబ్రహాంకి ఇచ్చింది హాగరు గర్భవతి అయింది ఎప్పుడైతే హాగరు గర్భవతి అయిందో తన యజమానురాలు తన దృష్టిలో నీచురాలు అయిపోయింది తనకున్న ఆశీర్వాదం మరొకళకి లేనప్పుడు వాళ్ళని చూసి కించపరచడం నీచపరచడం అనేది సర్వసాధారణంగా ప్రపంచంలో మనం చూస్తూనే ఉన్నారు ఆ కారణాన్ని బట్టి హాగరు బయటకి వెళ్ళగొట్టబడింది అయితే తన యజమానురాల దగ్గరికి తిరిగి వెళ్లి ఉండాలని దేవుని దూత ద్వారా ఆజ్ఞాపించమంది ఆ హాగరు ఆ సందర్భంలో దేవుడు హాగరుతో మాట్లాడుతున్న మాట నీకు కుమారుని ఇవ్వబోతున్నా అతనికి ఇస్మాయిల్ అని పేరు పెడతావ్ అయితే ఆ ఇస్మాయిల్ని కూడా నేను దీవిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు ఈ సందర్భాన్నంతా జాగ్రత్తగా పరిశీలన చేస్తే హాగర్ వీటన్నిటిని పరిశీలన చేసి దేవునికి పేరు పెట్టింది నన్ను చూశడు ఆయన నన్ను చూస్తున్న దేవుడు నన్ను విడిచిపెట్టలేదు అని చెప్పి దేవుని ఘనపరిచింది ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు నీ జీవితంలో నిన్ను చూస్తున్న దేవుడు ఆయన చాలాసార్లు అనిపిస్తా ఉంటది నేను ఇన్ని కష్టాలు పడుతుంటే దేవుడు నన్ను చూస్తున్నాడండి అందరూ నన్ను ఇంతగా నిందించి అవమానించి ఒక మాటలో చెప్పాలంటే నన్ను కృంగదీస్తూ ఉంటే నేను దేవుని కనబడుతున్నానా దేవుని లేఖనాలు చదువుతుంటే నేను దేవుని బిడ్డనని క్రీస్తు ప్రభువు రక్తం ద్వారా కడగబడ్డానని కొనబడ్డాను అని చెబుతున్నప్పుడు నాకెందుకు ఈ కష్టాలు నాకెందుకు ఈ అవమానం దేవుడు నన్ను చూస్తున్నాడా లేదా అన్న అనుమానం కొన్ని సందర్భాల్లో లో కొంతమందిలోకి రావచ్చు అలాంటి సిచువేషన్ నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిన వాగ్దానం ఇదే

సామెతలు 15:3
యెహోవా కన్నులు ప్రతి స్థలముమీద నుండును చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును.

ఆయన చూస్తున్న దేవుడు ఆయన యెహోవా కనులు ప్రతి స్థలం మీద ఉండును మంచివారిని చెడ్డవారిని అవి చూచుచుండును అనే లేఖన సత్యం మనం ఎప్పుడు మర్చిపోకూడదు ఆయన చూసే దేవుడు ఆయన ఎందరినో చూసాడు ఆయన తమ బాధల్లో తమ కష్టములో తన ఇబ్బందుల్లో ఇనుప కొలిమి లాంటి ఐగుప్తులో నలిగిపోతున్న ఇశ్రయేలు ప్రజల బాధను చూశడు దేవుడు అందుకనే నీ బాధను మనుషులుఎవరు చూడలేకపోవచ్చు నీ కష్టాలను మనుషులు ఎవరు గుర్తించలేకపోవచ్చు కానీ దేవుడు చూస్తున్నాడు నీ మనసులో చెలరేగుతున్న సంఘర్షణ ఏదైతే ఉందో దాన్ని చూస్తున్న దేవుడు నీ దేవుడు నిన్ను గమనించే దేవుడు ఆయన నిన్ను లేవనెత్తే దేవుడు ఆయన నిన్ను చూచుచున్న దేవుడు నీవే ప్రియ దేవుని బిడ్డలారా అనేకమంది ఏసుప్రభు వారి లోకంలో ఉన్న కాలంలో ఇబ్బందుల్లో కష్టాల్లో ప్రతికూలతల్లో ఉన్నప్పుడు వెలువేయబడినప్పుడు దేవుడు వారిని కనుగొని వారిని చూచి గొప్ప కార్యాలు వారి ద్వారా జరిగించాడు ఈరోజు నీ నిస్సహాయ స్థితిలో నిన్ను లేవనెత్తగలిగిన వాడు ఆయన నిన్ను చూచే దేవుడు ఆయన ఆయన కన్నులకు మరుగైంది ఏదీ లేదు గనుక నిన్ను చూస్తున్న దేవుడు నిన్ను బలపరుస్తాడని నువ్వు నమ్మాలి విశ్వసించాలి దేవుని కార్యాలు నీ జీవితంలో జరుగునట్లుగా ఆయనకు అవకాశం ఇవ్వాలి ఏ విషయానికి నువ్వు కృంగిపోవద్దు దేని గురించి నువ్వు చింతపడొద్దు ప్రతి విషయంలో కృతజ్ఞత పూర్వకంగా నువ్వు నీ సమస్యను దేవునికి తెలియజేయ్ నిన్ను చూసే దేవుడు ఆయన ఒకనాడు నిన్ను హెచ్చిస్తాడు బలపరుస్తాడు సంకళ్ళ చేత బంధించబడిన యోసేపును ఎవరు చూడట్లేదేమో కానీ దేవుడు చూశడు యోసేపులో ఉన్న ఆలోచనలు ప్రభువు చూశాడు యోసేపు వేటినైనా వదులుకోవడానికి సిద్ధపడ్డాడు కానీ దేవునితో సహవాసాన్ని మాత్రం వదులుకోలేదు ఆయన కృపలో వర్ధిలడానికి ఇష్టపడ్డాడు కాబట్టే ఆ భయంకరమైన బంధకాల్లో నుంచి దేవుడు యోసేపును బయటకి తీసుకొచ్చి ఐగుప్తు దేశానికి గవర్నర్ గా నియమించాడు ఐగుప్తు దేశం యోసేపు ద్వారా ఆశీర్వదించబడింది కష్ట పరిస్థితుల్లో కరువు సమయాల్లో కూడా యోసేపు అనేకమందికి ప్రయోజనకరంగా ఉన్నాడు దేవుడు తనక ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి దేవుని బిడ్డ ఈరోజు నువ్వు దీవించబడడం మాత్రమే కాదు నువ్వు ఆశీర్వదించబడడం మాత్రమే కాదు నువ్వు ప్రయోజనం పొందుకోవడం మాత్రమే కాదు నిన్ను అనేకమందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చాలని దేవుడు ఆశిస్తున్నాడు ఏ బంధువులైతే ఈ రోజు నిన్ను తిరస్కరిస్తున్నారో ఒకరోజున అదే బంధువులకు నువ్వు ఆ ఆదరణకరంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు ఏ స్నేహితులైతే నిన్ను పక్కన పెట్టేసారో నిన్ను తిరస్కరించారో నిన్ను తక్కువ చేసి చుస్తున్నారో ప్రభువును బట్టి ఆ స్నేహితులందరికీ నువ్వు దీవనకరంగా ఉండబోతున్నావ్ నమ్ము ప్రియ దేవుని బిడ్డ నీ కుటుంబానికి దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా చేయబోతున్నాడు అలాంటి దీవెన ప్రభువు నీకు ఇవ్వాలని కోరుతున్నాను నిన్ను చూస్తున్న దేవుడు ఆయన నిన్ను బలపరిచే దేవుడు నిన్ను హెచ్చించే దేవుడు …

 

Instagram

YouTube

Facebook

X

Threads

Telegram

 

Genesis 16:13 Explanation in Telugu

Genesis 16:13 Explanation in Telugu

Genesis 16:13 Explanation in Telugu

 

Leave a Comment