కీర్తనలు 98:1యెహోవా ఆశ్చర్యకార్యములు చేసియున్నాడు ఆయనను గూర్చి క్రొత్తకీర్తన పాడుడి ఆయన దక్షిణహస్తము ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగజేసియున్నది.

Psalms 98:1 Explanation in Telugu కీర్తనలు 98:1యెహోవా ఆశ్చర్యకార్యములు చేసియున్నాడు ఆయనను గూర్చి క్రొత్తకీర్తన పాడుడి ఆయన దక్షిణహస్తము ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగజేసియున్నది.

Psalms 98:1  Explanation in Telugu/  Psalms 98:1 Meaning in Telugu
Psalms 98:1 Explanation in Telugu/ Psalms 98:1 Meaning in Telugu

 

యెహోవా ఆశ్చర్య కార్యములు చేసియున్నారు మన దేవుడు మన పక్షంగా ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు ఆయన మన జన్మే ఒక ఆశ్చర్యం కదా ఇంతవరకు మన జీవితాల్లో ప్రభువు ఎబినేజురుగా ఉండి ఎన్నో ఆశ్చర్య కార్యాలు ఎన్నో అద్భుత కార్యాలు ఆయన జరిగిస్తూనే ఉన్నారు కొన్నింటిని మనం అడిగితే చేశారు కొన్నింటిని మనం అడగకపోయినా ప్రభువు అద్భుతాలు చేస్తూనే ఉన్నారు నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను అని పౌలు భక్తుడు అన్నట్టుగా దేవుడు మమ్మల్ని బలపరుస్తున్నారు ఆయన ఆశ్చర్యకార్యాలు జరిగించువారు ఊహకు మించిన కార్యాలు

ఎఫెసీయులకు 3:20
మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగువాటన్నిటికంటెను, ఊహించువాటన్నిటికంటెను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి

మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా చేయగల శక్తి గల దేవుడు ఆయన సామర్థ్యం కలిగినవాడు శక్తి గలవాడు దేనికంటే అడిగేవి కొన్నే కానీ ఊహించేవి చాలా ఉండొచ్చేమో కానీ దేవుడు ఊహించే వాటికన్నా అత్యధికంగా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించగలరు దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేస్తున్నారు కాబట్టి అనుదినము తన కృపా మహదైశ్వర్యం మన మీద కృమరించి ఆశ్చర్య కార్యాలు జరిగిస్తున్నారు దేవుని స్తుతించండి ఆయన మన జీవితాల్లో చేస్తున్న నూతన అద్భుతాలను బట్టి ఆశ్చర్య కార్యాలు బట్టి అనుదినము కూడా ఆయన స్తుతించే భాగ్యంలోనికి మనం రావాలి స్తుతి నీ స్థితిని మారుస్తుంది ఏ పరిస్థితి నువ్వు కృంగపడానికి వీలు లేదు సవాళ్లు రావచ్చు నీ జీవితంలో పెన్ని తుఫాను లాంటి అనుభవాలు రావచ్చు శిష్యులు ఒకసారి సముద్రం మీద వెళ్తూ ఉంటే భయంకరమైన తుఫాను వచ్చింది ప్రభువే చెప్పాడు వారిని అద్దరికి వెళ్ళమని ఆయన చెప్పి పంపించినప్పటికీ కూడా తుఫాను ఎదుర్కున్నారు వాళ్ళు కానీ అక్కడ జరుగుతున్న అద్భుతం ఏంటంటే తన ప్రజలను రక్షించడానికి దేవుడు సముద్రం మీద నడిచి వెళ్లి తన శిష్యులని కాపాడారు వారిని లేవనెత్తాడు అద్దరికి చేర్చిన దేవుడు ఆయన నీ గమ్యం నువ్వు చేరుకునేటప్పుడు లేదా నీ గమ్యస్థాన నికి వెళ్ళే ఆ మార్గంలో ఉడిదుడుకులు రావచ్చు తుఫానులు రావచ్చు కానీ నువ్వు నేను గమనించాల్సిన విషయం ఏంటంటే మన దేవుడు మనతో ఉన్నాడు ఆయన మన యొక్క ప్రతికూలతల్లో నుంచి మనల్ని బయటకి తీసుకురావడానికి ఏ క్షణమైనా దేవుడు మన దగ్గరికి వస్తాడు చాలామంది నిన్ను చూసి ఈరోజున జాలిపడుతున్నారా వీరి పరిస్థితి అయిపోయిందని అనేకమంది పెదవి విరుస్తున్నారా ఇక వీరు ఈ మరణ పడక మీద నుండి బయటికి రాలేరేమో అని అందరూ మాట్లాడుకుంటున్నారా డాక్టర్ రిపోర్ట్ కానివ్వండి మనుషుల యొక్క ఆలోచనలు అన్నీ కూడా వ్యతిరేకంగా ఉన్నాయా నీ దేవుడు నీ పక్షాన కలిగిన ప్రణాళికను నమ్ము నువ్వు దేవుని బిడ్డవు నువ్వు రక్షణ పొందావు గనుక ఆయన రక్తంలో కడగబడ్డావు గనుక క్రీస్తు రక్తము ద్వారా శుద్ధీకరించబడ్డావు గనుక ఆయన నీ పట్ల బాధ్యత వహిస్తున్నాడు నూతన నిబంధనలో పేతురు మహాశయుడు అదే చెప్పాడు ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు అంటే దేవుడు నీ పట్ల బాధ్యత ఉంది ఆయనకి నిన్ను మర్చిపోలేదు నిన్ను విస్మరించలేదు అందరూ నిన్ను వదిలిపెట్టేమో నీ కష్టంలో దేవుడు నిన్ను ఆదుకున్నప్పుడు నీ ప్రతికూలతల్లో దేవుడు నిన్ను లేవనెత్తినప్పుడు నీ దుఃఖంలో దేవుడు తన మాటల ద్వారా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆదరణ ఇచ్చినప్పుడు నువ్వు క్రొత్త కీర్తన పాడే వ్యక్తిగా ఉండాలి ప్రభువుని ఘనపరిచే వ్యక్తిగా ఉండాలి అంత మాత్రం కాకుండా ఆయన బాహువు ఆయనకు విజయమును కలుగజేసెను అనే మాట విజయం కలుగజేసిందట అంటే దేవుడు విజయం పొందాడు అంటే తన ప్రజలు కూడా విజయం పొందినట్టే కదా ఏసుప్రభు జీవితాన్ని మనం చూస్తే ఆయన ఎక్కడ ఓడిపోయినట్టుగా మనకు కనబడదు ఏ విషయంలో ఆయన తలదించుకోలేదు సిలువలో ఒక్కసారి మాత్రం ఆయన తల వంచి తన ఆత్మను అప్పగించారు మన నిమిత్తం సిలువలో మరణించి ఆయన మన పాప భారాన్ని మోసాడు ఆయన ఎక్కడ ఓడిపోలేదు మూడో రోజున మరణాన్ని జయించి తిరిగి లేచిన ప్రభువు విజయవీరుడు ఆయన విజయం సాధించాడు కాబట్టే ఎల్లప్పుడూ ఆయనకు విజయం కలుగుతుంది కాబట్టి తన ప్రజలమైన మనకు కూడా దేవుడు విజయాన్ని ఇవ్వగలడు ఓటము నిన్ను బాధిస్తుందా వైఫల్యాలు నిన్ను వేధిస్తున్నాయా శ్రమలు నిన్ను వెంటాడుతున్నాయా ఈరోజు దేవుని వైపు చూడు ఆయన విజయవీరుడు కదా నీకు నాకు విజయాన్ని ఇచ్చే దేవుడు ఆయన పౌలు భక్తుడు అదే అంటాడు అన్నింటిలో మనకు అత్యధిక విజయము మనల్ని ప్రేమించిన వాని ద్వారా కలుగుతుంది దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు గనుక నీకు అన్నింటిలో అత్యధిక విజయం ఉంది ఓడిపోయినని బాధపడుతున్నావ్ రోజులు తరబడి నెలలు తరబడి లే ఈరోజులే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు లేవాలి విజయం దిశగా నువ్వు వెళ్ళాలి జీవితంలో ఎప్పుడు ఓడిపోవద్దు ప్రభువును వెంబడించు ఆయనను ఘనపరచు క్రీస్తు వాక్యంలో నువ్వు జీవించు గొప్ప కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి…

Instagram

YouTube

Facebook

X

Threads

Telegram

 

Psalms 98:1 Explanation in Telugu

Psalms 98:1 Explanation in Telugu

Psalms 98:1 Explanation in Telugu

 

Leave a Comment