కీర్తనలు 89:28 నా కృప నిత్యము అతనికి తోడుగా నుండజేసెదను నా నిబంధన అతనితో స్థిరముగానుండును.

Psalms 89:28 Explanation in Telugu కీర్తనలు 89:28 నా కృప నిత్యము అతనికి తోడుగా నుండజేసెదను నా నిబంధన అతనితో స్థిరముగానుండును.

Psalms 89:28 Explanation in Telugu | Psalms 89:28 Meaning in Telugu
Psalms 89:28 Explanation in Telugu | Psalms 89:28 Meaning in Telugu

 

ఏతాను దావీదుకు అనుగ్రహించబడిన కృపను గూర్చి దేవుని స్తుతిస్తున్నాడు దేవుని ఘనపరుస్తున్నాడు ఎందుకంటే ఒకనొక రోజున దేవుడు నాతానుకు ఆయన ప్రత్యక్షమై అతనితో మాట్లాడుతూ దావీదు గురించిన వివరాలు చాలా తెలియజేశారు అందులో దేవుడు మాట్లాడుతూ ఏమన్నాడంటే నేను దావీదుకు నా కృపను తోడుగా ఉంచాను నా నిబంధన స్థిరంగా ఉంటది అని దేవుడు వాగ్దానం చేశాడు దావీదు దేవుని చిత్తానుసారుడిగా బ్రతికాడు ఆయన హృదయానుసారుడిగా దావీదు జీవించాడు యవ్వన కాలము నుండి కూడా దావీదు దేవుని స్తుతించడంలో ఆయన్ని ఆరాధించడంలో ఆయన్ని ఘనపరచడంలో దావీదు ఎప్పుడు ముందు ఉన్నాడు తనకు కొన్ని అద్భుతమైన అవకాశాలు అతనికి లేకపోయినప్పటికీ కూడా ఉన్న వాటిని బట్టి ప్రభువును స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తూ దావీదు గడిపాడు సమూయేలు యషయ కుమారుల్లో ఒకడిని అభిషేకించడానికి ఇంటికి వచ్చినప్పుడు యషయ తన కుమారులందరినీ పిలిచాడు కానీ దావీదుని పిలవలేదు అంటే మనం అర్థం చేసుకోవచ్చు దావీదు యొక్క పరిస్థితి ఆ కుటుంబంలో ఎలా ఉందో అంత మాత్రం కాకుండా దావీదుని ఒక్కరు పట్టించుకోలేదు దేవుడు ఒక వ్యక్తిని అభిషేకిస్తాడు అంటే దావీదు అనర్హుడు అని అనుకున్నారు అందరు కానీ అలాంటి దావీదుని దేవుడు ఎన్నుకున్నాడు దేవుని ఎంపిక ఎప్పుడు కూడా చాలా గొప్పదే లోకంలో ఘనులైన వారిని సిగ్గుపరచడానికి దేవుడు ఘనత లేని వారిని ఎన్నుకుంటాడు బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి దేవుడు బలహీనులని ఎన్నుకుంటాడు జ్ఞానం కలిగిన వారిని సిగ్గుపరచడానికి దేవుడు జ్ఞానహీనులను ఎన్నుకుంటాడని బైబిల్ గ్రంధంలో మనం చూస్తున్న అపోస్తులు పౌలు ఆ మాటలు రాసుకుంటూ వచ్చారు దేవుని ఎంపిక చాలా గొప్పది ఇతను ఎందుకు పనికి రాడు వీరెందుకు పనికిరారు అన్నవాళ్ళనే దేవుడు ఎన్నుకొని వారి ద్వారా విశేషమైన అద్భుతాలు ఎన్నో జరిగించారు ఆశ్చర్యకారులు జరిగించారు నా కృప అతనికి తోడుగా ఉండజేసెదను మనక ఏమున్నా లేకపోయినా దేవుని కృప మనతో ఉంటే అంతకన్నా ఆశీర్వాదం మరొకటి లేదు పౌలు మహాశయుడు ఒకసారి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశడు ప్రభువా నాకున్న ముల్లు తొలగించు ప్రభువా అని ప్రార్థన చేశాడు ముమ్మారు అడిగాడు దేవుడు నా కృప నీకు చాలు అన్నాడు నీకు ఏమున్నా లేకపోయినా నా కృప నీతో ఉందో లేదో చూసుకో అన్నాడు ఎంత ఈరోజు బహుశా నీ జీవితంలో కూడా చింతలు కలవరాలు ఆందోళనలు నిన్ను కృంగదీస్తున్నాయా ఏ ఒక్కరు నాకు తోడుగా లేరని బాధపడుతున్నావా దేవుని కృప నీకు తోడుగా ఉంది ఆ కృప నిన్ను రక్షించే కృప ఆ కృప నిన్ను దేవునికి దగ్గరగా తీసుకొచ్చే కృప దేవుని కృప నిన్ను బలపరిచే కృప పౌలు మహాశయుడు అంటాడు అందుని బట్టి తిమోతికి రాస్తూ నా కుమారుడా క్రీస్తు యేసు నందు ఉన్న కృప ద్వారా నువ్వు బలవంతుడవు కమ్మని బలహీనమైన క్షణాలు కొన్నిసార్లు మన జీవితంలో రావచ్చు ఎంత ధైర్యంగా ఉంటున్న కొన్ని పరిస్థితులు మన మీదకి వచ్చినప్పుడు ధైర్యాన్ని కోల్పోవచ్చు అలాంటి పరిస్థితుల్లో ఆత్మ బలం ఎక్కడ నుండి తీసుకోవాలి ఎక్కడి నుంచి మనకు బలం వస్తది అంటే దేవుని కృప ద్వారా దేవుని కృప నుండి మనకు కావలసిన ఆధ్యాత్మిక సిరులు సంపదలు మనం తీసుకోవచ్చు మన దేవుడు కృపా సంపన్నుడు ఆయన ఆయన కృపా సమృద్ధి కలిగినవాడని బైబిల్ లో రాయబడింది పాత నిబంధనలో ఉన్న చాలామంది దేవుని ప్రజలు దేవుని కృపను అనుభవించారు అయితే నూతన నిబంధన సంఘ వారసులమైన మనము ఆయన కృపను మరింత ఎక్కువగా అనుభవిస్తున్నాం మనకు దేవుడు ఇచ్చిన ధైర్యం ఎంత గొప్పది అంటే నాకోసం ప్రాణం పెట్టి తిరిగిలేచిన దేవుడు నాకు ఉన్నాడు ఆయన కృప ప్రతి సందర్భంలో మనకు బహిర్గతం అయింది లేఖనాలను పరిశీలన చేస్తుంటే ఎన్నో చోట్ల దేవుని తన కృపను ఏ విధంగా మనమే చూపించాడో మనం అర్థం చేసుకోవచ్చు ప్రియులారా కృప ద్వారా మాత్రమే సమస్తం సాధ్యం కృపను అర్థం చేసుకుని ఆయన కృపలో వర్ధిలినప్పుడు ఇంకా ఇంకా శ్రేష్టమైన దీవనలు మనం పొందుకుంటాం అంత మాత్రం కాకుండా దేవుడు నిబంధన ఆయన స్థిరపరిచే దేవుడు యేసుప్రభు వారు సిలువలో మనందరి కోసం క్రొత్త నిబంధన చేశారు తన రక్తంతో క్రొత్త నిబంధన చేశాడు ఈ నిబంధన ఎలాంటిది అంటే శాశ్వత నిబంధన ఎన్నడూ కొట్టివేయబడిన నిబంధన కలువరి సిలువలో యేసుప్రభువు చేసిన నిబంధన చాలా గొప్పది అది ఎన్నడూ తీసివేయబడదు కొట్టివేయబడదు అలాంటి నిబంధనకు వారసులుగా మనల్ని చేసినందుకు మనం ప్రభువుని స్తుతింపబద్దులమై ఉన్నాం…

 

Instagram

YouTube

Facebook

X

Threads

Telegram

 

Psalms 89:28 Explanation in Telugu

Psalms 89:28 Explanation in Telugu

Psalms 89:28 Explanation in Telugu

 

 

 

Leave a Comment