మీకా 4:13 సీయోను కుమారీ, నీ శృంగము ఇనుపదిగాను నీ డెక్కలు ఇత్తడివిగాను నేను చేయుచున్నాను, లేచి కళ్లము త్రొక్కుము, అనేక జనములను నీవు అణగ ద్రొక్కుదువు, వారికి దొరికిన లాభమును నేను యెహోవాకు ప్రతిష్టించుదును, వారి ఆస్తిని సర్వలోకనాధునికి ప్రతిష్టించుదును.

Micah 4:13 Explanation in Telugu | Micah 4:13 Meaning in Telugu  మీకా 4:13 సీయోను కుమారీ, నీ శృంగము ఇనుపదిగాను నీ డెక్కలు ఇత్తడివిగాను నేను చేయుచున్నాను, లేచి కళ్లము త్రొక్కుము, అనేక జనములను నీవు అణగ ద్రొక్కుదువు, వారికి దొరికిన లాభమును నేను యెహోవాకు ప్రతిష్టించుదును, వారి ఆస్తిని సర్వలోకనాధునికి ప్రతిష్టించుదును.

Micah 4:13 Explanation in Telugu | Micah 4:13 Meaning in Telugu 
Micah 4:13 Explanation in Telugu | Micah 4:13 Meaning in Telugu

 

మీకా అనే మాటకు దేవుని వంటివారు ఎవరు యెహోవా వంటివాడు ఎవడు అని అర్థం నిజమే కదా దేవుని లాంటి వాళ్ళు ఎవరున్నారు ప్రపంచంలో ఆయనలా ప్రేమించే వాళ్ళు ఎవరున్నారు ఆయనలా బోధించే వాళ్ళు ఎవరున్నారు ఆయనలా పోషించే వాళ్ళు ఎవరున్నారు ఆయనలా రక్షించే వాళ్ళు ఎవరున్నారు ఆయనలా నిత్యజీవాన్ని ఉచితంగా మనకు అనుగ్రహించే వాళ్ళు ఎవరున్నారు దేవుని వంటివాడు ఎవడు హన్నా కూడా దేవుని స్తుతిస్తూ ఇదే మాట అంటది పరిశుద్ధతలో నీవు మహనీయుడవు ప్రభువా నిన్ను మించిన వారు లేరు పరిశుద్ధతలో నీకు సాటి అయిన వారు లేరు దేవుడు పరమ పవిత్రుడైన దేవుడు అని పరిశుద్ధుడైన దేవుడు పౌలు మహాశయుడు కూడా తన పత్రిక రాస్తూ హెబ్రీయులకు రాస్తూ అంటాడు పవిత్రుడు నిర్దోషి నిష్కలమషుడు పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉండువాడని యేసుప్రభువును గురించి ఆయన అక్కడ మాట్లాడుతున్నాడు దేవుడు నిజంగా పరిశుద్ధుడే ఆయనకు సాటి అయిన వారు ఎవరు లేరు సమానులు ఎవరు ప్రభువు అనే ఒక పాటను కూడా మనం సంఘాల్లో పాడుతుంటాం దేవునికి సమానులు ఎవరు లేరు అయితే ఇక్కడ రాయబడిన ఈ మాటను జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే లేచి నీ కళ్ళము త్రొక్కుము నువ్వు లేవాలి దేవుడు నీతో మాట్లాడినప్పుడు నువ్వు మౌనంగా ఉండడానికి వీలులేదు ఆయన నిన్ను పిలుస్తున్నప్పుడు తన స్వరాన్ని వినిపింప చేసినప్పుడు నువ్వు ఎక్కడున్న పరిస్థితులు అక్కడ ఉండడం దేవునికి ఇష్టం కాదు దేవుని మార్గములో నువ్వు నడవడానికి నువ్వు లేవాలి అబ్రహాముతో దేవుడు అదే చెప్పాడు నీవు లేచి అనే మాట దేవుడు వాడాడు యోనాకు కూడా అదే దేవుడు చెప్పాడు నువ్వు లేచి నినువే పట్టణానికి వెళ్ళు అంటే యోనా లేచాడు కానీ నినువే పట్టణానికి వెళ్ళలేదు అబ్రహాముతో దేవుడు చెప్పాడు నువ్వు లేచి నేను చూపించి దేశానికి వెళ్ళు అన్నాడు అబ్రహాము లేచాడు దేవుడు చూపించి దేశానికి వచ్చాడు కనాను దేశంలో అడుగు పెట్టాడు అనేకమందికి ఆశీర్వాద కారణంగా మారాడు ఈరోజు దేవుడు నీతో నాతో కూడా మాట్లాడాడు ఇంక ఎంతకాలం సోమరితనంగా ఉంటావు ఇంకెంతకాలం దేవుని కోసం ఏమీ చేయలేని పరిస్థితిలో నువ్వు ఉంటావు ఎంతకాలం నీకున్న కలవరాన్ని బట్టి నీకున్న ఆందోళనను బట్టి నీకున్న సమస్యలను బట్టి అలా కూర్చునిపోతావ్ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు లే కళ్ళము త్రొక్కు అనేక జనములను అనగదొక్కే వ్యక్తిగా నిన్ను నియమించబోతున్నాను అని దేవుడు మాట్లాడాడు ఏ జనమైతే నిన్ను నిందించారో ఏ జనమైతే నిన్ను దూషించారో ఏ జనమైతే నిన్ను తక్కువగా చూశారో ఏ జనమైతే నువ్వు ఎందుకు పనికి రావన్నారో ఏ జనమైతే రకరకాల మాటలు నీ గురించి మాట్లాడారో వారి యొక్క అభిప్రాయాలు అన్నీ కూడా తప్పు అని ప్రూవ్ చేయి దేవుని సహాయంతో ఆయన నీకు సహాయం చేయబోతున్నాడు

రోమీయులకు 16:20 సమాధాన కర్తయగు దేవుడు సాతానును మీ కాళ్లక్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై యుండును గాక. 

దేవుడు ఎంత గొప్పవాడు అంటే సాతానును అనగదొక్కే వ్యక్తిగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు కానీ అనేకసార్లు మనం మన దౌర్భాగ్యతను బట్టి మన యొక్క అవిధేయతను బట్టి మన అవిశ్వాసాన్ని బట్టి మన తిరుగుబాటుతనాన్ని బట్టి దుష్టత్వాన్ని బట్టి భక్తిహీనతను బట్టి అపవాది చేత అణచివేయబడిన పరిస్థితిలో మనం ఉన్నాం మన కుటుంబాలు అనిచివేయబడుతున్నాయి మన జీవితాలు అనిచివేయబడుతున్నాయి శాంతి లేదు సమాధానం లేదు స్వేచ్ఛ లేదు స్వాతంత్రం లేదు ఆధ్యాత్మిక అనుభవాల్లో పురోగృద్ధి కనబడడం లేదు కారణం అపవాది మనల్ని త్రొక్కుతున్నాడు కానీ దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు నువ్వు లేవాలి అపవాది శక్తులు అనగతొక్కే వ్యక్తిగా ఉండాలి దేవుడు నీకు అధికారం ఇస్తున్నాడు ఏసుక్రీస్తు ప్రభువు వారు సర్వాధికారం కలిగిన దేవుడు కాబట్టి ఆయన అంగీకరించిన వారికి దేవుడు అధికారం ఇస్తున్నాడు ఈ అధికారాన్ని ఉపయోగించుకొని మనం చేయాల్సింది ఏంటో తెలుసా అపవాది శక్తులు అనిచివేయువారంగా మనం ఉండాలి దురాత్మ శక్తుల ప్రాబల్యాన్ని అనగద్రొక్కేవారంగా మనం ఉండాలి ఇది అసలైన విజయం దేవుడు అదే కోరుతున్నాడు నీ జీవితంలో చెలరేగుతున్న శరీర వాంచలు పాపపు కోరికలను అనిచివేసే వ్యక్తిగానే ఉండాలి కానీ వాటికి లోబడే వ్యక్తిగా నువ్వు ఉండడానికి వీలు లేదు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఉదయకాల సమయంలో నీవు లేచి కళ్ళము త్రొక్కో దేవుడు అనేక జనములను అనగదొక్కే శక్తి నీకు ఇస్తున్నాడు సర్వలోకనాధునికి ప్రతిష్టించగలిగే కృపలో మనం స్థిరపడబోతున్నాం అలాంటి గొప్ప కృప దేవుడు మీ అందరికీ దయచేయాలని కోరుతున్నాను ఏ ఆయుధాలైతే అపవాది నీ మీద వినియోగిస్తున్నాడో ఏ అస్త్రాలైతే నీ మీద సంధిస్తున్నాడో వాటిని జయించి దేవుని ఆత్మ శక్తి ద్వారా నువ్వు లేచి ప్రభువు కార్యాల్లో ముందుకు సాగిపో దేవుని కొరకు నువ్వు చేయాల్సింది చెయ్ ప్రభువు నీ పక్షాన గొప్ప కార్యాలు జరిగిస్తాడు..

Instagram

YouTube

Facebook

X

Threads

Telegram

 

 

Micah 4:13 Explanation in Telugu

Micah 4:13 Explanation in Telugu

Micah 4:13 Explanation in Telugu

Leave a Comment