కొలస్సీయులకు 2:3 బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయనయందే గుప్తములైయున్నవి.

Colossians 2:3 Explanation in Telugu కొలస్సీయులకు 2:3 బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయనయందే గుప్తములైయున్నవి.

Colossians 2:3 Explanation in Telugu | Colossians 2:3 Meaning in Telugu
Colossians 2:3 Explanation in Telugu | Colossians 2:3 Meaning in Telugu

 

పౌలు భక్తుడు ఏసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన తర్వాత సంఘాలను బలపరచడానికి అద్భుతమైన ఉత్తరాలు రాశారు 14 ఉత్తరాలు బైబిల్ లో మనం చూస్తాం నూతన నిబంధనలో అనేకమైన ఆధ్యాత్మిక సత్యాలను వివరించడానికి ఏసుక్రీస్తు ప్రభువు వారు పౌలు మహాశయుని ఎన్నుకున్నారు అన్యజనుల ఎదుట నా నామమును భరించడానికి నేను ఏర్పరుచుకున్న సాధనము అని పౌలు గురించి చెప్పబడింది అలాంటి గొప్ప దైవజనుడు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సంఘానికి ఉత్తరాలు రాశారు కొంతమంది వ్యక్తులకు కూడా ఆయన ఉత్తరాలు రాసినట్టుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం కొలసై అనే ప్రాంతంలో ఉన్న సంఘానికి ఆయన క్రీస్తు ప్రభువు యొక్క దైవత్వాన్ని గురించిన వివరాలు రాస్తూ అద్భుతమైన విషయాలు పొందుపరుచుకుంటూ వచ్చారు ఏసుక్రీస్తు ప్రభువుని ఒక వ్యక్తి తన హృదయంలో చేర్చుకోవడం ద్వారా అతనికి కలిగే ప్రయోజనం ఏంటి అంటే బుద్ధి మరియు జ్ఞానము సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నవి ఆయన యందే అనే మాట అక్కడ ఏసుక్రీస్తు ప్రభువులో మాత్రమే అనే మాట అక్కడ స్పష్టంగా పౌలు గారు రాశారు ఆయన యందే అనే మాట వాడడంలో ఆ ఉద్దేశం దాని అర్థం ఏంటంటే ఆస్తి స్వాస్యము గుప్తమై ఉన్నది ప్రతి దేశానికి ఎంతో కొంత బంగారం నిల్వలు ఉంటాయి బంగారు నిలవల్ని ఆయా దేశంలో కొన్ని కొన్ని ప్రాంతాల్లో పొందుపరుస్తారు ఏసుక్రీస్తు ప్రభువులో ఏ సంపదలు ఉన్నాయి సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నాయి అంటే పౌలు భక్తుడు అంటున్నాడు మనిషికి కావలసిన బుద్ధి మరియు జ్ఞానము ప్రభువులో లభ్యమవుతున్నాయి బుద్ధి లేక చెడిపోయాడండి అంటారు కదా బుద్ధి లేక దారి తప్పిపోయాడు అని అంటారు కదా జ్ఞానం లేక చెడిపోయారని బైబిల్ గ్రంధంలో మనం చూస్తే హోషియా గ్రంధంలో నా జనులు జ్ఞానం లేని వారే నశించిపోతున్నారు అన్నాడు ఏ జ్ఞానం లేదు మనిషికి ఈ రోజుల్లో అన్ని రకాల జ్ఞానాలు మనిషికి వస్తున్నాయి చిన్న పిల్లలని స్కూల్కి పంపించే దగ్గర నుంచి కాలేజీలు యూనివర్సిటీలు విస్తారమైన జ్ఞానం మనిషి యొక్క మస్తిష్కంలో నాటుతూ ఉన్నారు మనిషి మెదడులో నాడుతున్నారు మరి ఏ జ్ఞానం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు అంటే దైవికమైన జ్ఞానం మనిషికి లేనందువలన దేవునికి సంబంధించిన జ్ఞానం లేనందువలనే మానవుడు నశించిపోతున్నాడు దేవుని బిడ్డలుగా మనం దేనికోసం ప్రయాసపడాలి దేనికోసం ప్రార్థించాలిఅంటే ప్రభువా ఆత్మ సంబంధమైన జ్ఞానం నాకు దయచేయండి దైవికమైన జ్ఞానంలో నేను ఎదగాలి నా బిడ్డలు కూడా అలా ఎదగాలని బలంగా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన జ్ఞానముతో తన బుద్ధితో మనల్ని నింపుతాడు

 

కీర్తనలు 32:9

బుద్ధి జ్ఞానములులేని గుఱ్ఱమువలెనైనను కంచరగాడిద వలెనైనను మీరు ఉండకుడి అవి నీ దగ్గరకు తేబడునట్లు వాటి నోరు వారుతోను కళ్లెముతోను బిగింపవలెను.

 

ఎందుకు ఆ మాట అక్కడ వాడాడు జంతువుల్లో ప్రవర్తించకండి అని చాలామంది ఈ రోజుల్లో మనిషిగా ప్రవర్తించాల్సిన మానవుడు జంతువులా ప్రవర్తిస్తున్నాడు కొన్ని కొన్ని సందర్భాల్లో జంతువులే మనిషి కన్నా ఇంకొంచెం బెటర్ గా ఉన్నాయేమో అనిపిస్తా ఉంటది బైబిల్ సెలవిస్తుంది దేవుడు ఒక ఉద్దేశంతో నిన్ను కలుగజేశారు సమస్త సృష్టిలో నిన్ను ఒక ఔన్నత్యమైన ప్రాంతంలో ప్రభువు ఉంచారు నీ మీద దేవునికి కొన్ని ప్రణాళికలు ఉన్నాయి నీ ద్వారా దేవుడు కొన్ని ఉద్దేశాలు నెరవేర్చాలని కోరుతున్నప్పుడు వాటిని నెరవేర్చడానికి నువ్వు సంపూర్ణంగా దేవుని సమర్పించుకోగలిగితే ఆయన తన జ్ఞానమును నీకు ఇచ్చి తన బుద్ధిని నీకు ఇచ్చి ఉన్నతమైన స్థితిలో నిలబడతాడు దానియేలు బబులోను దేశంలో అత్యధికంగా హెచ్చించబడడానికి కారణం దానియేలు చూడడానికి చాలా బాగున్నాడని కాదు లేకపోతే దానియేలుకి చాలా డబ్బు ఉందనో బంధు బలగం ఉందనో ఆ ప్రాంతంలో చాలా పేరు ప్రఖ్యాతలు ఉన్నాయనో కాదు దానియేలు అభివృద్ధి పొందింది లేదా ఉన్నత స్థానంలో ఉంది దానియేలు అభివృద్ధి పొందడానికి ఉన్నత స్థానంలోకి రావడానికి కారణం దైవికమైన జ్ఞానాన్ని కలిగినవాడు ఆ జ్ఞానాన్ని ఎలా సంపాదించుకున్నాడు అంటే ప్రార్థన ద్వారా సంతరించుకున్నాడు ఒక సమస్య వచ్చినప్పుడు ఒక సవాలు వచ్చినప్పుడు తను మరియు తన స్నేహితులు ప్రార్థన చేయడం ద్వారా దేవుని నడిపింపును పొందుకొని తద్వారా ఉన్నతమైన స్థానానికి రాగలిగాడు దేవుని బిడ్డలారా ఏసుక్రీస్తు ప్రభువు జ్ఞానమును మరియు బుద్ధిని ఉచితంగా మనకు అనుగ్రహించే దేవుడు ఆయన బుద్ధి జ్ఞానాలు మార్కెట్లో దొరికేవి కాదు క్రీస్తు ప్రభువు పాదాల దగ్గర జీవితాన్ని కట్టుకునే బుద్ధి జీవితాన్ని కట్టుకునే జ్ఞానం ఎవరితో ఎలా మెలగాలో కావలసిన సంయోచితమైన జ్ఞానాన్ని ప్రభువు ద్వారా మనం పొందుకుంటాం …

 

Instagram

YouTube

Facebook

X

Threads

Telegram

 

 

Colossians 2:3 Explanation in Telugu

Colossians 2:3 Explanation in Telugu

Colossians 2:3 Explanation in Telugu

Leave a Comment