ఆదికాండము 17:8 నీకును నీతరు వాత నీ సంతతికిని నీవు పరదేశివైయున్న దేశమును, అనగా కనానను దేశమంతటిని నిత్యస్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడనై యుందునని అతనితో చెప్పెను.

Genesis 21:1 Explanation in Telugu ఆదికాండము 21:1 యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాటచొప్పున శారానుగూర్చి చేసెను.

Genesis 21:1 Explanation in Telugu | Genesis 21:1 Meaning in Telugu 
Genesis 21:1 Explanation in Telugu | Genesis 21:1 Meaning in Telugu

 

దేవుడు దర్శించువాడు మనల్ని దర్శించే దేవుడు ఆయన వదిలిపెట్టేలేదు మనల్ని మర్చిపోయేవాడు కాదు ఆయన మీ బాధలవి మీరు పడండి మీ కష్టాలవి మీరు పడండి మీకు నాకు సంబంధం లేదన్నట్టుగా దేవుడు ఉండేవాడు కాదు తన ప్రజలను దర్శించడం అంటే దేవునికి చాలా ఇష్టం తాను చెప్పిన ప్రకారం అబ్రహాము శారాల జీవితం అనేకమందికి స్ఫూర్తిదాయకమే పాత నిబంధనలో ప్రస్తావించదగిన గొప్ప వ్యక్తుల్లో అబ్రహాము చాలా చాలా ప్రాముఖ్యమైన స్థానాన్ని సంపాదించూకున్నాడు అబ్రహాము యొక్క విశ్వాస యాత్రలో శారా కూడా పాలిభాగస్తురాలై ఉంది వారిద్దరూ కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వారు ప్రయాణం చేశారు అనేక సందర్భాల్లో వారిద్దరిలో ఉన్న ఐక్యత ఏకమనసు ఈరోజున ప్రస్తుత తరంలో ఉన్న చాలామందికి మార్గదర్శకంగా ఉంది అనడంలో సందేహం లేదు దేవుడు అబ్రహామును దర్శించి నిర్ణయ కాలమందు శార కుమారుని కంటుంది అని దేవుడు వాగ్దానం చేశాడు ఆ వాగ్దానాన్ని ఖచ్చితంగా దేవుడు నెరవేర్చాడు దేవుడు తన నిర్ణయ కాలంలో శారాను దర్శించి ఆమె గర్భాన్ని తెరిచి వాగ్దాన పుత్రుడైన ఇస్సాకును దేవుడు వారికి అనుగ్రహించారు దేవుడు షారాను దర్శించాడు ఈరోజు దేవుని దర్శనం కోసం ఆయన తాకిడి కోసం ఆయన మహిమా ప్రభావం కోసం నీవు కూడా ఎదురు చూస్తున్నావా ప్రార్థన చేస్తున్నావా దేవా మునుపెన్నడు లేని ఉజ్జీవం నాలోన తీసుకురండి ప్రభువా మునుపెన్నడు లేని ఆనందం నాకు ఇవ్వండి నాయన మునుపెన్నడు లేని ఆసక్తి నాకు దయచేయండి నీకు మరింత దగ్గరగా రావాలని నిన్ను గట్టిగా పట్టుకోవాలని నీ విశ్వాసంలో నేను ఎదగాలని కోరుతున్నానని ఎవరైతే దేవుని వైపు చూస్తున్నారో దేవుడు వారిని దర్శించడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధమనసు కలిగినవాడే ఈరోజు నిన్ను దర్శించడానికి దేవుడు సిద్ధమనసు కలిగినవాడు నిరాశలో ఉన్నావా నిస్పృహలో ఉన్నావా కలవరంలో బహుశా ఇబ్బంది పడుతున్నావా ఆందోళన నిన్ను బాగా బాధిస్తుందా ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏం చేయాలన్న మనసు రావట్లేదండి మనసులో ఏదో సంఘర్షణ ఉంది నా జీవితంలో ఎందుకు ఇలా అవుతుందో నాకు తెలియదు దేవుడు నన్ను దర్శించాలని ఆశపడుతున్నాను అని గనుక నువ్వు కోరుకుంటే నీ దేవుడు నిన్ను దర్శించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఒక అవసరతతోనో లేదా ఒక లోటులో ఉన్న అబ్రహాము శారాలను దేవుడు దర్శించి తన సంకల్పాన్ని వారి జీవితంలో దేవుడు నెరవేర్చాడు.

న్యాయాధిపతులు 13:2

ఆ కాలమున దానువంశస్థుడును జొర్యాపట్టణస్థుడు నైన మానోహ అను నొకడుండెను. అతని భార్య గొడ్రాలై కానుపులేకయుండెను.

న్యాయాధిపతులు 13:3

యెహోవా దూత ఆస్త్రీకి ప్రత్యక్షమైఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపులేకపోయెను; అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు.

మనోహ అనబడే వ్యక్తి దాను వంశస్తుడు మనోహ అతని భార్య వారిద్దరు జీవిస్తున్నప్పుడు ఆమె గొడ్రాలు అయ ఉంది ఆమెకు కానుపు లేదు ఆ సందర్భంలో బహుశా వారు ప్రార్థన చేస్తున్నారు దేవుడు వారిని దర్శించాలని దేవుడు మనోహ భార్యను దర్శించాడు దేవుడు తన దర్శనాన్ని ఆమెక ఇచ్చి ఆ నీవు ఒక కుమారుడికి జన్మనిస్తావని ఆ కుమారుడు ఎలా ఉండాలి ఏం చేయాలి ఇలాంటివన్నీ కూడా తెలియజేశాడు అయితే ఆ సందర్భంలో తన భర్త అక్కడ లేడు కాబట్టే ఆమె తన భర్తకు చెప్పింది ఇలా ఎలా జరిగింది అంటే వెంటనే మనోహ దేవుని సన్నిధిలో ఒక ప్రార్థన చేసి ఒక మనవి చేశారు ప్రభువా ఆ వ్యక్తి మరల మాకు కనబడి మాకు పుట్టబోయే బిడ్డను మేము ఎలా పెంచాలో మాకు తెలియచెప్పునట్లుగా జ్ఞానాన్ని నేర్పించు అని ప్రార్థన చేయగానే దేవుడు మనోహ ప్రార్థన ఆలకించి మరలా వారిని దర్శించాడని న్యాయపతుల గ్రంధంలో మనం చూస్తాం అనగా ఎవరైతే ఇష్టపడతారో ప్రభువా నీ దర్శన భాగ్యం మాకు కలగాలి నీ సన్నిధి అనే ది మాకు కావాలి నీ తాకిడి మాకు అవసరం అని ప్రార్థిస్తారో దేవుడు వారి ప్రార్థన అంగీకరిస్తున్నాడు దేవుడు మనల్ని దర్శించువాడు నయోమి అనబడే ఆమె బెత్లెహేములో కరువు వచ్చింది అని చెప్పి మోయాబు వెళ్ళిపోయింది మోయాబు వెళ్లి 10 సంవత్సరాలు అక్కడ ఉంది ఎన్ని విధాలుగా ఒక వ్యక్తి నష్టపోవాలో అన్ని విధాలుగా నష్టపోయింది భర్త చనిపోయాడు కొడుకులు చనిపోయారు కోడళ్ళు మాత్రం మిగిలారు అయితే ఆమె ఒక రోజున బెత్లెహేమకి వచ్చేయాలని నిర్ణయించుకుంది ఎందుకోసం తెలుసా ఆమెక శుభవార్త వినబడింది తన ప్రజలను దేవుడు దర్శించాడు అని ఆమె విని మరలా బెత్లెహేముకి వచ్చేయాలనుకుంది అంతవరకు కరువులోనూ ఇబ్బందిలోన నిస్పరలోన తన ప్రజలను దేవుడు దర్శించాడని అయ్యో మేము విన్నప్పుడు తిరిగి రావాలనుకుంది నిజమే ఈరోజు బహుశా నీవు ఒక లోటులో ఉన్నావా ఒక కొరతలో ఉన్నావా లేదా ఒక కరువులో ఉన్నావా అది శాశ్వత కాలం ఉండేది కాదు ఆయన నిన్ను దర్శించబోతున్నాడు ఆయన నిన్ను దర్శించినప్పుడు కరువును సమృద్ధిగా మార్చగలిగిన దేవుడు ఆయన విస్తారమైన సమృద్ధిని దేవుడు అక్కడ ఇవ్వడం మాత్రమే కాకుండా నయోమితో పాటుగా తన కోడలైన రూతు బెత్లెహేము రావడం ఆ తర్వాత బోయజును కలవడం బోయజు రూతును పెండ్లి చేసుకోవడం ఇవన్నీ అన్ని మనం చూస్తున్నప్పుడు దైవ ప్రణాళిక చాలా గొప్పది…

 

Instagram

YouTube

Facebook

X

Threads

Telegram

 

Genesis 21:1 Explanation in Telugu

Genesis 21:1 Explanation in Telugu

Genesis 21:1 Explanation in Telugu

Leave a Comment