Isaiah 66:14 Explanation in Telugu యెషయా 66:14 మీరు చూడగా మీ హృదయము ఉల్లసించును మీ యెముకలు లేతగడ్డివలె బలియును యెహోవా హస్తబలము ఆయన సేవకులయెడల కనుపరచబడును ఆయన తన శత్రువులయెడల కోపము చూపును.

మీరు చూడగా అనే మాట ఎవరిని చూడాలి మనం ఎటువైపు చూడాలి ఉదయం లేచింది రాత్రి పడుకునే వరకు చాలా మనం చూస్తూ ఉంటాం చూడడం అనేది కేవలం భౌతికంగానే మాట్లాడడంలే మన దృష్టి ఎటువైపు ఉంది మన కనుదృష్టి ఎవరి మీద ఉంది అనేది పరిశీలన చేయాలి నువ్వు దేవుని తప్ప అన్ని చూశావేమో వారిని వీరిని ప్రక్కింటోళ్ళని ఎదురింటోళ్ళని బంధువుల్ని స్నేహితుల్ని చూసి అలసిపోయావేమో లేదా మోసగించబడ్డావేమో అయితే బైబిల్ సెలవిస్తా ఉంది దేవుని వైపు మనం చూడగలిగితే ఆయన వైపు మన కన్నులెత్తగలిగితే మన కనుదృష్టి ఆయన మీద నిలపగలిగితే కచ్చితంగా మన జీవితంలో ఒక ఉజ్జీవాన్ని చూస్తాం ఆధ్యాత్మికమైన ఒక మంట మన జీవితంలో బయలుదేరాలంటే దేవుని వైపు మనం చూడాలి ప్రకాశించు దేవుడు తేజో సంపన్నుడైన ప్రభువు వైపు మనం చూడగలిగితే ఆశ్చర్యకారాలు మనం చూస్తాం మన కన్నులు ఎవరిని చూస్తున్నాయి ఒకవేళ ఇంతవరకు లోకాన్ని చూసి మోసపోయావా నష్టపోయావా బాధపడ్డావా భయంకరమైన పరిస్థితులు నీ జీవితంలో ఉన్నాయా ఈ రోజు దేవుని వైపు చూడగలవా లేఖనాలు సెలవిస్తున్నాయి
(యెషయా 45:22) భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు.
దేవుడు దేవుని వైపు చూస్తే మనకు విడుదల ఆయన వైపు చూస్తే మన జీవితంలో బలమైన కార్యాలు ఆయన వైపు చూస్తే మన జీవితాల్లో నూతనమైన అనుభవాల చేత మనం నింపబడతాం ఎందుకోసం అంటే ఆయన వైపు చూసిన ఏ ఒక్కరు కూడా జీవితంలో ఏనాడు ఓడిపోలేదు ఎవరైతే దేవుని వైపు చూస్తారో వారికి వెలుగు కలుగుతుందని కూడా లేఖనాలు సెలవిస్తున్నాయి మీరు చూడగా ఇంతవరకు ఎటో చూసి లోకం వైపు చూసి ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే లోక సంబంధమైన ఆశలను నీ హృదయంలో పెట్టుకొని లేదా లోక సంబంధమైన వ్యక్తుల వైపు చూసి నష్టపోయావేమో ఒక మంచి నిర్ణయంలోకి వద్దాం ప్రభువా నేను నిన్ను చూస్తాను నాయన నీ మహిమను చూస్తాను నీ ప్రభావాన్ని చూస్తాను నీ తేజస్సును చూస్తానని మనం దేవుని వైపు చూడగలిగితే మన జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు మనం చూస్తాం భర్తిమై గుడ్డివాడిగా ఉన్నాడు కానీ యేసుప్రభు ఎరికో ప్రాంతానికి వెళ్ళినప్పుడు దేవుడు భర్తిమై కన్నులు తెరవేసినప్పుడు భర్తిమై తన కన్నులు తెరవబడగానే ప్రభువును చూశడు దేవుని మహిమ పరిచాడు మన జీవితాల్లో కూడా ఆధ్యాత్మిక నేత్రాలు మనం తెరిచి దేవుని వైపు చూడగలిగితే బలమైన కార్యాలు మనం చూస్తాం దేవుని వైపు చూడడం ద్వారా మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి ఎలాంటి ఆధ్యాత్మికమైన అనుభవాల గుండా మనం వెళ్తాము అని పరిశీలన చేస్తే దేవుడు మిమ్మల్ని ఆనందింపజేస్తారు మిమ్మల్ని సంతోషపరుస్తారు అనే మాట అక్కడ రాయబడింది నిజమే మన దేవుడు ఆనంద ప్రదాత ఆనందకరమైన దేశంలో మీరు నివసిస్తారని వాగ్దానం చేసిన దేవుడు దుఃఖంతో వేదనతో కన్నీటితో భయంకరమైన విషాదమైన పరిస్థితుల గుండా నీ జీవితం వెళ్ళిందేమో నీవు తీసుకున్న నిర్ణయాలు కావచ్చు లేదా ఇతరులు నీ మీద చేసిన దౌర్జన్యాలు కావచ్చు బలాత్కారాలు కావచ్చు లేదా లోక సంబంధన అనుభవాల చేత నువ్వు అణచివేయబడినప్పుడు దుఃఖం వేదన నీ జీవితానికి కమ్మేసిందేమో అయితే బైబిల్ సెలవిస్తా ఉంది నీ దుఃఖ దినాలని దేవుడు సమాప్తం చేసి నీవు ఉల్లసించే విధంగా ప్రభువులో ఆనందించే విధంగా దేవుడు నిన్ను తీర్చిదిద్దుతున్నాడు రక్షణ పొందని ఏ వ్యక్తి కూడా ప్రభువులో ఆనందించలేడు నువ్వు నిజంగా రక్షణలో కొనసాగుతుంటే దేవుని రక్షణ అనే కవచాన్ని నువ్వు ధరించుకోగలిగితే నువ్వు నిజంగా పరిశుద్ధాత్మలో ఆనందిస్తావ్ దేవునిలో ఉన్న ఆనందం ప్రపంచంలో ఇంక ఎక్కడా లేదు ఎక్కడా నీకు దొరకదు ఆనందం కోసం సంతోషం కోసం నువ్వు వెతికావేమో అయితే బైబిల్ సెలవిస్తాఉంది ఈరోజు ప్రభువుకి నువ్వు చోటు ఇవ్వడం ద్వారా ఆయనను చూడడం ద్వారా తేజో సంపన్నుడైన దేవుని వైపు నీ దృష్టి కేంద్రీకరించగలిగితే ప్రభువు చాలా చాలా గొప్ప కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాడు నీవు ఉల్లసిస్తావ్ నువ్వు ఆనందిస్తావ్
(మలాకీ 4:2) అయితే నా నామమందు భయభక్తులుగలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును; అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు.
అనగా ఆనందం సంతోషం దేవుడు మనక ఇస్తాడు పౌలు భక్తుడు అన్నాడు మీరు ప్రభువునందు ఆనందించండి మరల మరలా చెబుతాను ఆనందించండి ఎన్నిసార్లు చెబుతాను మీరు దేవునిలో ఆనందించండి ఎందుకోసం అంటే దేవునిలో ఆనందించువాడు ఇంకెక్కడ లోకంలో ఆనందం కోసం పరిగెత్తాల్సిన అవసరత లేదు దేవుడు అలాంటి పరిపూర్ణమైన ఆనందం పరిశుద్ధాత్మలో నువ్వు ఆనందించినట్లుగా దేవుడు నిన్ను స్థిరపరచును గాక మీరంతా కూడా దేవునిలో ఆనందించువారిగా ఆయనలో సంతోషించువారిగా ఉందురు గాక హల్లెలూయ ఉల్లాసము ఉత్సాహము సంతోషం సమాధానం దేవుడు మీకు ఎల్లప్పుడూ దయచేయడం ద్వారా మీరు ఆనందిస్తూ అనేకమందిని రక్షణ ఆనందంలోనికి దైవికమైన ఆనందం లోనికి మీరు నడిపించు వారిగా ఉండాలనేదే దేవుని యొక్క ఆలోచన మీ ఎముకలు లేత గడ్డి వలె బలియును అంటే దేవుడు కేవలం మనకు ఉల్లాసాన్ని మాత్రమే కాకుండా తన ఆత్మ బలాన్ని దేవుడు మనకు దయచేస్తున్నాడు హలెలూయ నువ్వు బలహీనుడిగా ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు నువ్వు బలహీనురాలుగా ఉండాలని దేవుడు ఆశించట్లేదు పరిశుద్ధాత్మ దేవుని యొక్క బలం నిన్ను కమ్ముకొనుట ద్వారా నువ్వు దేవుని కోసం నిలబడాలని పాపాన్ని జయించు వారిగా లోకాన్ని జయించువారిగా శోధనలు జయించువారిగా ఉండాలనే దేవుని యొక్క ఆలోచన ప్రస్తుత ప్రపంచంలో అనేక శోధనలు మనకు రావచ్చు పాప సంబంధమైన ఆలోచనలు పాప సంబంధమైన ఉద్దేశాలు మనిషిని కమ్మే పరిస్థితులు రావచ్చు గానీ దేవుని బలం నీకు ఉంటే ఆయన బలంలో నువ్వు అభివృద్ధి పొందుతూ ఉంటే దేవుని కార్యాలు నువ్వు కచ్చితంగా చూస్తా నువ్వు ఆయన కోసం బలమైన సాక్షిగా నువ్వు నిలబడతావ్ శారీరకమైన బలం గురించి నేను మాట్లాడడం లేదు కానీ ఆత్మ సంబంధన బలాన్ని మనం కలిగి ఉండాలి అందును బట్టి పౌలు అంటాడు ఎఫిసి సంఘానికి రాస్తూ ప్రభువునందు మీరు శక్తివంతులై ఉండండి మీరు బలం కలిగిన వారై ఉండండి దేవుని నుండి బలాన్ని తెచ్చుకోండి దేవుని యొక్క బలం నీకు విజయాన్ని ఇస్తది అన్ని విషయాల్లో నువ్వు ముందుకు కొనసాగుతావు పౌలు భక్తుడు అంటాడు నన్ను బలపరుచు వాని యందు నేను సమస్తం చేయగలనని దేవుని మీద ఆధారపడు ఆయన బలం మీద ఆధారపడు దేవుడు నిన్ను బలంగా వాడుకొనబోతున్నాడు ఆయన అద్భుతాలు నీ జీవితంలో చేయబోతున్నాడు అసాధారణమైన కార్యాలను దేవుడు నీ జీవితంలో సాధ్యపరుస్తాడు దేవుని బలాన్ని నువ్వు ఆశ్రయిస్తే కచ్చితంగా దేవుడు నీ జీవితంలో మేలు చేస్తాడు ఒక శోధన జయించడం కావచ్చు లేదా ఒక విజయాన్ని చేరుకోవడం కావచ్చు ఒక విజయం సాధించడం కావచ్చు ఒక ఉద్యోగం విషయంలో కావచ్చు వ్యాపార విషయంలో కావచ్చు దేవుని బలం మీద నువ్వు అనుకోగలిగితే ప్రభువు కార్యాలు స్పష్టంగా నువ్వు చూస్తావ్ నీ ఎముకలు లేతగడ్డి వలె బలుస్తాయి మూడో మాట ఇక్కడ ఏం రాశాడు అంటే దేవుని హస్త బలము తన సేవకుల పట్ల కనుపరచబడుతుంది దేవుని సన్నిధి ఆయన ప్రభావము ఆయన మహిమ స్పష్టంగా నీ జీవితంలో కనపరచబడును గాక నిన్ను చూసిన వారందరూ వీరిలో ఏదో శక్తి ఉందండి దేవుని సన్నిధి వీరిలో ఉందండి దేవుని మహిమ వీరి మీద ఉందండి దేవుని అభిషేకం వీరి మీద ఉందండి పరిశుద్ధాత్మ దేవుడు వీరిని నడిపిస్తున్నాడండని చూసిన ప్రతి ఒక్కరు కూడా నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చినట్లుగా దేవుడు ఒకవేళ ఇంతవరకు నిన్ను చూసిన వారందరూ అపహాస్యం చేసారేమో నిన్ను చూసి జాలిపడ్డారేమో ఒకవేళ ఇంతవరకు నిన్ను చూసిన వాళ్ళందరూ నిందలు అవమానాలు వేసి నిన్ను అతి తీవ్రంగా బాధ పెట్టారేమో కానీ నీ జీవితం ద్వారా దేవుని బలము ఆయన సన్నిధి అనేకమందికి ప్రత్యక్షంగా కనపరచబడినట్లుగా దేవుడు నువ్వు ఎక్కడ అడుగుపడితే అక్కడ దీవెన నువ్వు మాట్లాడే మాటల్లో పరిశుద్ధాత్మ దేవుని యొక్క బలం ఆయన శక్తి నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరగాల నువ్వు దేవుని కోసం నిలబడితే సాక్షిగా నిలబడినప్పుడు దేవుని సువార్త ఆయన మహిమ ప్రజల్లోనికి వెళ్ళునట్లుగా ప్రభావంతో వెళ్ళనట్లుగా దేవుడు తన అభిషేకంతో నింపును గాక హలెలూయ నీ బంధువుల విషయంలో నీ స్నేహితుల విషయంలో నీవు చేస్తున్న ప్రార్థనలు దేవుడు అంగీకరించును గాక ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని హస్త బలము నీలో ప్రస్పుటంగా కనపరచబడుతుంది గనుక నిలబడు ప్రభువు కోసం నువ్వు ఏదైతే చేయాలనుకున్నావో ధైర్యంతో చెయ్ ప్రభువు కార్యాలు స్పష్టంగా నువ్వు చూస్తావ్ తన ఉద్దేశాలు దేవుడు నెరవేర్చబోతున్నాడు మన జీవితాల్లో దేవునికి సంపూర్ణంగా చోటు ఇవ్వగలిగితే ప్రభువు కార్యాలు స్పష్టంగా మనం చూస్తాం…
Isaiah 66:14 Explanation in Telugu
Isaiah 66:14 Explanation in Telugu
Isaiah 66:14 Explanation in Telugu