Isaiah 52:12 Explanation in Telugu యెషయా 52:12 మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోవురీతిగా వెళ్లరు. యెహోవా మీ ముందర నడచును ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయును.

సీయోను లెమ్ము లెమ్ము నీ బలమును ధరించుకొనుము అనే మాటతో అధ్యాయం ప్రారంభించబడతది దేవుని మాటకు లోబడి ఆయన చెప్పిన విధానంగా మనం నడిస్తే ఆయన కృపలో వర్ధిలడానికి మనం నిర్ణయించుకుంటే మన జీవితాల్లో ఎలాంటి దీవెనలు ఉంటాయో ఎలాంటి ఆశీర్వాదాలు ఉంటాయో స్పష్టంగా ఈ అధ్యాయంలో మనం చూస్తున్నాం ఇక్కడ ప్రభువు మాట్లాడుతూ అంటున్నాడు మీరు పారిపోవు రీతిగా బయలు వెళ్ళరు అంటే కంగారు కంగారుగా గాని భయపడుతూ గాని మీ ప్రయాణం సాగదు
నిర్గమకాండము 13:21
వారు పగలు రాత్రియుప్రయాణము చేయునట్లుగా యెహోవాత్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభములోను, వారికి వెలుగిచ్చుటకు రాత్రివేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడచుచు వచ్చెను.
“దేవుడు మీ ముందర ఉంటాడు ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు ఆయన మిమ్మల్ని బలపరిచేవాడు”
నిర్గమకాండము 14:19
అప్పుడు ఇశ్రాయేలీయుల యెదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవ దూత వారి వెనుకకుపోయి వారిని వెంబడించెను; ఆ మేఘస్తంభము వారి యెదుటనుండి పోయి వారి వెనుక నిలిచెను.
నిర్గమకాండము 14:20
అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలీయుల సేనకు నడుమ ప్రవేశించెను; అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను గాని, రాత్రి అది వీరికి వెలుగిచ్చెను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయులసేన ఇశ్రాయేలీయులను సమీపించలేదు.
మీ సైన్యపు వెనుకటి భాగమును కూడా దేవుడు కావలి ఉంచుతాడు అంటే దేవుని ద్వారా మీరు ఆవరించబడతారు అనే మాట అక్కడ మనం చూస్తున్నాం అవును దేవుడు మన ముందర నడిచేవాడు కొన్నిసార్లు మన జీవితాల్లో భయము మనల్ని ఆవహిస్తూ ఉంటుంది ఆందోళన మన జీవితాల్లో పెరిగిపోతూ ఉంటుంది కలవరం మన జీవితానికి వచ్చేస్తా ఉంటది ఏం చేయాలో తెలియని పరిస్థితి ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితి అసలు నా జీవితం ఏమైపోతుంది నా బ్రతుకు ఏంటా నేను ఎవరి కోసం బ్రతుకుతున్నాను దేనికోసం బ్రతుకుతున్నానా అని అనిపించే ఆలోచనలు బహుశా కొన్నిసార్లు మీ జీవితంలోకి రావచ్చు ఆ సమయంలో మీరు గమనించాల్సింది ఏంటి అంటే మీరు తలంచవలసింది ఏంటంటే దేవుని వాగ్దానాన్ని దేవుడు నీ ముందర నడుస్తున్నాడు నువ్వు భయపడాల్సిన అవసరత లేదు నువ్వు కృంగిపోవాల్సిన అవసరత లేదు దావీదు భక్తుడు అందుకనే అంటాడు దేవుడు నాకు కాపరిగా ఉన్నాడు నాకు లేమి కలగదు ఆయన నడిపించే దేవుడు ఆయన ఒకవేళ నేను గాఢాంధకారపు లోయ లాంటి అనుభవం గుండా నేను ప్రయాణం చేయాల్సి వచ్చిన నేను భయపడను ఎందుకంటే దేవుడు నాకు తోడై ఉంటాడు ఆయన దుడ్డుకర్ర మరియు ఆయన దండము నన్ను ఎల్లప్పుడూ ఆదరిస్తుంది నన్ను ప్రోత్సహిస్తుంది అని దావీదు భక్తుడు తన జీవితంలో నుంచి మాట్లాడాడు గాఢాంధకారపులోయ అనుభవాలు కొన్నిసార్లు మన జీవితంలోకి రావచ్చు ఆ పరిస్థితుల్లో దేవుని వాగ్దానాలు జ్ఞాపకం చేసుకుని ప్రభువు మనకు తోడుగా ఉన్నాడని ఆయన మనకు ముందుగా నడుస్తున్నాడని మనం గుర్తించగలిగితే చాలా చాలా చాలా ధైర్యాన్ని మనం పొందుకుంటాం ఆశీర్వాదాన్ని పొందుకుంటాం దేవుడు మీకు ముందర నడుస్తున్నాడు నువ్వు ఎదుర్కొనబోతున్న ప్రతి కీడును ప్రభువు తప్పించడానికి ఆయన నీ ముందు నడుస్తున్నాడు పూర్వ దినాల్లో ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణాన్ని చేస్తున్నప్పుడు ఐగుప్తు దేశం నుంచి బయటిక వచ్చిన తర్వాత సీనాయి పర్వతం దగ్గర దేవుడు చెప్పాడు ప్రత్యక్ష గుడారంలో ఉండాల్సిన ఉపకరణాలు ఇవన్నిటిని కూడా దేవుడు మోషేకు ఒక చక్కని ప్లాన్ ఇచ్చాడు ఆ తర్వాత మోషే దేవుడు చెప్పినట్టుగా బెసలేలు మరియు అహోలియాబు లాంటి యవ్వనస్తుల సహాయంతో ఉపకరణాలు అన్నీ కూడా తయారు చేసిన తర్వాత మందసం వారికి ముందుగా నడిచేది కొంతమంది చరిత్రకారుల యొక్క అభిప్రాయం ప్రకారం దేవుని మందసాన్ని వారి ముందుకు తీసుకువెళ్తున్నప్పుడు వారి మార్గము సరళం చేయబడేదట వారి మార్గము దేవుడు సరాళం చేశాడు ఎందుకంటే మందసం ఉండాల్సిన పరిస్థితిలో ఉండేది కాబట్టి నేను నా జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మన ముందు నడిచినప్పుడు మన మార్గములన్నీ ఆయన సరాళం చేస్తాడు ఆయన నీవు చింతపడాల్సిన అవసరత లేదు అతి తీవ్రంగా కృంగిపోవాల్సిన అవసరత లేదు రేపు ఏంటి ఎల్లుండి నా పరిస్థితి ఏంటి వచ్చే నెల నా పరిస్థితి ఏంటి వచ్చే అవసరం నా పరిస్థితి ఏంటని నువ్వు కృంగిపోవాల్సిన అవసరత లేదు దేవుడు నీకు ముందుగా నడుస్తున్నాడు నీ సైన్యపు వెనుకటి భాగమును కావలించుతున్నాడు ఆయన నీ ముందు వెనకల ఆవరించి ఉన్న దేవుడు ఆయన క్షేమాన్ని భద్రతను ఆరోగ్యాన్ని ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడు ఆయన ఆయన వైపు చూడు ఏసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకంలో ఉన్న కాలంలో అనేకమంది జీవితాల్లో గొప్ప కార్యాలు ఆయన జరిగించారు ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత ఆయన వెతుక్కుంటూ వచ్చిన స్త్రీలకు ఇవ్వబడిన వర్తమానం ఆయన మీకంటే ముందుగా వెళ్తున్నాడు తన శిష్యులుకు కూడా చెప్పండి వారు అక్కడ ఆయన చూస్తారని ప్రభువు మనకు ముందుగా అనేక పరిస్థితుల గుండా నడిచాడు ఆయన మృతులలో నుండి ప్రథమ ఫలముగా యేసుప్రభువు లేపబడ్డారు ఈరోజున మనందరికీ కూడా పునరుత్థానాన్ని గురించిన నిరీక్షణ యేసుప్రభువు పునరుత్థానం ఇచ్చింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు ఒకనాడు మనం ప్రభువుతో ఉండబోతున్నాముఅని నిత్య రాజ్యంలో మనందరం ఉంటున్నాము అనే నిరీక్షణ ప్రభువు మనక ఇచ్చాడు అందును బట్టే నేను మీకు ముందుగా వెళ్లి మీ కొరకు స్థలము సిద్ధపరుస్తాను పరలోక రాజ్యంలో స్థలము సిద్ధపరుస్తుని దేవుడు వాగ్దానం చేశాడు ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దానం శ్రేష్టమైనదే ప్రతి వాగ్దానం నమ్మదగినదే కాబట్టి ప్రభువును స్తుతిద్దాం ఆయన వైపు మనం చూద్దాం ప్రభువు చెప్పినట్టుగా లెమ్మో నీ బలమును ధరించుకొనుమని ప్రభువు చెప్పినట్టుగా ఆధ్యాత్మిక బలాన్ని పొందుకుందాం పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడదాం తద్వారా ప్రభువు మనతో ఉన్నాడని మనకు ముందుగా నడుస్తున్నాడని విశ్వసిద్దాం ఆయన ప్రతి పరిస్థితిలో మనల్ని కాపాడువాడని నమ్ముదాం జీవితంలో ఆశీర్వాదాలు పొందుకుందాం….
Isaiah 52:12 Explanation in Telugu
Isaiah 52:12 Explanation in Telugu
Isaiah 52:12 Explanation in Telugu