Isaiah 66:12 Explanation in Telugu యెషయా 66:12 యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఆలకించుడి, నదివలె సమాధానమును ఆమెయొద్దకు పారజేయుదును మీరు జనముల ఐశ్వర్యము అనుభవించునట్లు ఒడ్డుమీద పొర్లిపారు జలప్రవాహమువలె మీయొద్దకు దానిని రాజేతును మీరు చంకను ఎత్తికొనబడెదరు మోకాళ్లమీద ఆడింపబడెదరు.

జీవితంలో అన్నిటికన్నా గొప్ప ఆశీర్వాదం అంటూ ఏదైనా ఉంది అంటే సమాధానంగా బ్రతకడమే శాంతిగా జీవించడమే దేవునితో సమాధానాన్ని కలిగి ఉండడం ఆ తర్వాత మన చుట్టూ ఉన్న వారితో సమాధానాన్ని కలిగి ఉండడం కన్నా అద్భుతమైన ఆశీర్వాదం ఇంకేమన్నా ఉందంటారా ప్రపంచంలో చాలామందికి అన్ని ఉన్నా సమాధానం లేదు అందును బట్టి జీవితాలు నిరాసక్తిగా కొనసాగుతుంటాయి నిరుత్సాహంతో ఉంటారు నిరాశలో నిస్పృహలో ఉంటారు అన్ని ఉంటాయి వాళ్ళకి డబ్బు ఉంటది హోదాలు ఉన్నాయి చదువులు ఉన్నాయి చక్కని భవంతులు ఉంటాయి అన్ని రకాలైన అవసరాలు వారికి తీర్చబడి ఉంటాయి కానీ ఎందుకో మనసులో నెమ్మది ఉండదు భార్యా భర్తలు ఉంటారు వారిద్దరు ఇళ్లల్లో యాంత్రికంగా బ్రతికేస్తూ ఉంటారు ఏదో పెళ్లి చేసుకున్నాం కదా బ్రతకాలన్నట్టుగా బ్రతుకుతూ ఉంటారు ఆప్యాయతులు అనుబంధాలు ప్రేమను వ్యక్తీకరించడం ఆ కుటుంబాల్లో కనబడదు సమాధానం లేదు ఎక్కడికి వెళ్ళని ఈ రోజుల్లో మనిషి గలిబిలతోనే ఉన్నాడు సమాధానంగా ఉండాలని సంతోషంగా ఉండాలని కొంతమంది సమాజాన్ని విడిచి ఎక్కడో దూరంగా కొండల్లోనికి పర్వతాల్లోనికి వెళ్ళిపోయి చెట్ల కింద కూర్చుని ప్రశాంతంగా ఆసనాలు వేసుకొని కూర్చుని ప్రశాంతంగా ఉందాం అనుకుంటారు గానీ అదేంటో వాళ్ళకి కూడా సమాధానం లేదు వారికి కూడా నిజమైన సంతోషం లేదు అయితే బైబిల్ సెలవిస్తా ఉంది నది వలే సమాధానాన్ని నేను ప్రవహింప చేస్తాను ఇక్కడ ఆమె అనే మాట ఉపయోగించడం జరిగింది ఆమె ఎవరు అంటే ఎరుషలేము గురించి దేవుడు మాట్లాడుతున్నాడు అయితే దేవుని దగ్గరికి మనం రావడం ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారిని మన హృదయంలో చేర్చుకోవడం ద్వారా పాప పశ్చాత్తాపాన్ని పొంది రక్షణ పొందడం ద్వారా మనక ఇవ్వబడే మొట్టమొదటి ఆశీర్వాదం సమాధానాన్ని దేవుడు మనకి ఇస్తాడు క్రీస్తు ప్రభువు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందు అని అపోస్తులుడైన పౌలు కూడా తన పత్రికల్లో ఆ మాట రాసుకుంటూ వచ్చాడు దేవుని బిడ్డలారా ఈరోజు నువ్వు గలిబిలిగా ఉన్నావా కలవరంతో ఉన్నావా ఆందోళనంతో ఉన్నావా నీకు సమాధానం దొరికే చోటు అంటూ ఏదైనా ఉంది అంటే అది ఏసుప్రభువు సన్నిధి మాత్రమే ఆయన్ని మినహాయిస్తే ఆయన పక్కన పెడితే నువ్వు ఎప్పుడూ లోకంలో సమాధానం పొందలేవు లోకం ఎప్పుడూ కూడా తాత్కాలికంగా ఉప్పొంగ చేసే ఆనందాన్ని ఇస్తుంది అంతే లోకం ఇచ్చే అనుభవాల అలాగే ఉంటాయి కానీ దేవుడి ఇచ్చే సమాధానం సంతోషం తాత్కాలికం కాదు గానీ గా శాశ్వతంగా ఉంటాయి గనుక ఆయన గట్టిగా పట్టుకుంటే మన జీవితాల్లో ఆశీర్వాదం పొందుతాం దేవుడు తన మహిమతో మనల్ని నింపే దేవుడు ఆయన ఆ తర్వాత ఐశ్వర్యాన్ని కూడా మనక ఇస్తాడు ఇక్కడ ఐశ్వర్యము అంటే క్రీస్తు జ్ఞానములో అభివృద్ధి పొందే ఐశ్వర్యం ఆయన కృపలో అభివృద్ధి పొందే ఐశ్వర్యం ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు ఇతరులను సన్మానించడం కావచ్చు ఆధ్యాత్మిక విలువలతో బ్రతకడం కావచ్చు అన్ని విషయాల్లో ఎగ్జిబిట్ చేయడం కావచ్చు ఇవన్నీ కూడా ఐశ్వర్యమే కేవలం భౌతికంగా ధనరాశులు వెండి బంగారాలు కూడబెట్టడం మాత్రమే ఐశ్వర్యం అని బైబిల్ చెప్పట్లేదు కానీ ప్రభువు దరికి రావడం ద్వారా దేవుడు ఆధ్యాత్మికంగా మమ్మల్ని ఐశ్వర్యవంతులుగా చేస్తాడు దేవుడు అన్ని విషయాల్లో మిమ్మల్ని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు అంత మాత్రమే కాకుండా దేవుడు తన ప్రజల ద్వారా లేదా ఎవరి ద్వారానైనా ఆయన పంపించే సహాయం ఎలా ఉంటది అంటే మీరు చంకను ఎత్తుకొనబడెదరు అనే మాట అక్కడ రాయబడిండి దేవుడు గౌరవాన్ని ఇస్తాడు ఆయన తన ప్రభావంతో మిమ్మల్ని నింపుతాడు ఎవరైతే మిమ్మల్ని నిందించారో ఎవరైతే అవమానించారో ఎవరైతే మిమ్మల్ని తక్కువగా చూశారో నువ్వు ఎందుకు పనికి రావని ఎంతమంది అయితే నీ మీద ముద్ర వేశరో వాళ్ళందరినీ దేవుడు నీ చుట్టూ తీసుకురావడం ద్వారా వారే ఆ తర్వాత కాలంలో నిన్ను ఘనపరచు వారిగా నీ మంచితనాన్ని గుర్తించువారిగా దేవుడు చేస్తాడు నీ శత్రువుల నోళ్ళను దేవుడు మూసి ఆయన నామాన్ని మహిమ పరుచుకునే దేవుడు ఆయన యోసేపు జీవితంలో అది జరగలేదా ఏ అన్నలైతే తీసుకెళ్లి యోసేపును గోతిలో పడేశరో వారే యోసేపు ముందు సాగిలపడి నమస్కారం చేశారు దేవుడు చేస్తున్నాడు…
Isaiah 66:12 Explanation in Telugu
Isaiah 66:12 Explanation in Telugu
Isaiah 66:12 Explanation in Telugu