యెషయా 65:22 వారు కట్టుకొన్న యిండ్లలో వేరొకరు కాపురముండరు వారు నాటుకొన్నవాటిని వేరొకరు అనుభవింపరు నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యమంత యగును నేను ఏర్పరచుకొనినవారు తాము చేసికొనినదాని ఫలమును పూర్తిగా అనుభవింతురు.

Isaiah 65:22 Explanation in Telugu  యెషయా 65:22 వారు కట్టుకొన్న యిండ్లలో వేరొకరు కాపురముండరు వారు నాటుకొన్నవాటిని వేరొకరు అనుభవింపరు నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యమంత యగును నేను ఏర్పరచుకొనినవారు తాము చేసికొనినదాని ఫలమును పూర్తిగా అనుభవింతురు.

Isaiah 65:22 Meaning in Telugu | Isaiah 65:22 Explanation in Telugu
Isaiah 65:22 Meaning in Telugu | Isaiah 65:22 Explanation in Telugu

 

Isaiah 65:22 Explanation in Telugu ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో తమ ప్రాంతాన్ని లేదా తమ గృహాలను వేరే వారు వచ్చి అక్రమించుకున్న సందర్భాలు కొన్ని ఉన్నాయి వారు చెరకు కొనిపోబడినప్పుడు లేదా బందీలుగా తీసుకుపోబడినప్పుడు వారి గృహాలను వారి ప్రాంతాలను అన్యులు వచ్చి ఆక్రమించుకున్నారు అయితే దేవుడు మరలా వారిని జ్ఞాపకం చేసుకుని ఆ ప్రాంతాన్ని తీసుకొచ్చినప్పుడు వారు పోగొట్టుకునిన దాన్ని దేవుడు ఇవ్వడం మాత్రమే కాకుండా ఇక్కడ దేవుడు వారికి ఇంకెప్పుడు కూడా మీరు కట్టుకున్న వాటిల్లో వేరొకరు ఉండరు అనే నిత్య వాగ్దానాన్ని దేవుడు వారికి ఇచ్చారు ఆ తరువాత మీరు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవించారు అంటే దీని అర్థం నువ్వు ఏదైతే నీది అనుకుంటున్నావో లేదా దేవుడు నీకు ఏదైతే అనుగ్రహించాడో వాటి ఫలములను నువ్వు అనుభవిస్తావు వాటిని నీవు ఆస్వాదిస్తావు అని లేఖనాలు చాలా స్పష్టంగా సెలవిస్తున్నాయి మీలో చాలా మంది భోజనం చేస్తున్నారు కానీ మీకు తృప్తి కలగడం లేదు నీళ్లుు తాగుతున్నారు కానీ దాహం తిరడం లేదు బట్టలు కట్టుకుంటున్నారు కానీ చలి ఆగడం లేదు మీ డబ్బులు చిల్లు సంచిలో వేసినట్టుగా పోతున్నాయి ఎందుకోసం అంటే మీరు దేవుని పనిని నిర్లక్ష్య పెట్టేశారు కొన్నిసార్లు మన జీవితాల్లో అలాంటి పరిస్థితులు వస్తున్నప్పుడు మనల్ని మనం పరీక్షించుకోవాలి మన జీవితం ఏంటి నా బ్రతుకు ఏంటి దేవుడు నాకు ఇస్తున్న అవకాశాన్ని నేను ఎలా వాడుతున్నాను దేవుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదాలు ఎలా ఉపయోగిస్తున్నాను అనేది పరీక్ష చేసుకుంటే ఎంతో సహాయం దేవుని దగ్గర నుండి మనం పొందుతాం ఒకవేళ ఇంతవరకు నీ మూర్ఖత్వాన్ని బట్టి నీ అవిధేయతను బట్టి నీ పాప జీవితాన్ని బట్టి నీవు అనుభవించాల్సిన వాటిని కోల్పోయావేమో కానీ ఈరోజు దేవుడు మరల నిన్ను పునరుద్ధరించబోతున్నాడు ఆయన సమకూర్చే దేవుడు ఆయన నీవు నాటుకున్న వాటి నుండి నీవే ఆ ఫలాలు అనుభవిస్తావ్ నీ ఇండ్లల్లో వేరొకరు కాపురం ఉండరు అంటే అర్థం ఏమిటంటే ఏదైతే నీకు చెందిందో ఏదైతే దేవుడు నీకు ఇచ్చాడో ఏదైతే స్వాస్యంగా నీకు అనుగ్రహించారో వాటిని నువ్వు అనుభవించాలని దేవుని యొక్క ఆలోచన. నా జనుల ఆయుష్యు వృక్షాయుష్యంత అవుతుంది అని దేవుడు మాట్లాడాడు దేవుడు నిత్యత్వం గురించి ఆ తర్వాత స్థిరమైన జీవితం గురించి మాట్లాడుతున్నాడు ఒక భూమిలో నాటబడిన చెట్టు ఏ విధంగా స్థిరంగా ఉంటదో ఆ వృక్షము భూమిలో నాటబడినప్పుడు ఎలా స్థిరంగా ఉంటదో నీ జీవితం కూడా దేవుడు స్థిరపరిచే దేవుడు ఆయన ఒక వృక్షానికి ఏ విధంగా ఎక్కువ కాలం ఉంటదో అది ఎక్కువ కాలం ఎలా బ్రతుకుతాదో నా జనులు కూడా ఎక్కువ కాలం జీవించాలి దీర్ఘాయువు కలిగి ఉండాలని దేవుని యొక్క ఆలోచన అందును బట్టే పౌలు అంటాడు మీరు దీర్ఘాయుషమంతులు అవ్వాలి అంటే నీ తల్లిని తండ్రిని సన్మానించు అని బైబిల్ చెప్పింది ఒక మనిషి అర్థవంతమైన జీవితం జీవించాలంటే సౌభాగ్యవంతమైన జీవితం జీవించాలి అంటే ఏం చేయాలో బైబిల్ సెలవిస్తున్న రీతిని మనం గమనిస్తే చాలా చాలా ఆశ్చర్యం కలుగుతుంది తల్లిదండ్రులను సన్మానించు నువ్వు దీర్ఘాయుషమంతుడు అవుతావ్ నీవు దీర్ఘాయుషమంతుడు అవ్వాలంటే ఆజ్ఞలు గైకొనమని దేవుడు వాక్యంలో రాయబడింది మనందరం కూడా దీర్ఘాయువుని కలిగి ఉండాలని దేవుని యొక్క ఆలోచన మనం ఎంత కాలం బ్రతికామ అన్నది ప్రశ్న కాదు గానీ ఆ బ్రతికిన బ్రతుకు ఎంత అర్థవంతంగా బ్రతికామ అనేది ప్రశ్న దేవునికి ఎంత మహిమకరంగా బ్రతికమా అన్నది ప్రశ్న ఒక వృక్షం ఏ విధంగా ఎక్కువ కాలం ఉంటదో ఏ విధంగా స్థిరంగా ఉంటదో నా ప్రజలు కూడా అలాగే ఉండాలి లోక సంబంధమైన ఉద్దేశాలు నీ జీవితాన్ని పాడు చేయడానికి వీలు లేదు దేవుని ప్రజలుగా మనం బ్రతకాలి బ్రతికినంత కాలం దేవునికి మహిమకరంగా బ్రతకాలి నీ భక్తి జీవితానికి ప్రతిఫలం ఉంది ఎప్పుడూ అలసిపోవద్దు ఎప్పుడు నిరుత్సాహానికి గురి కావద్దు దేవుడు నీ చేతులో కష్టార్జిత నువ్వు అనుభవించినట్లుగా దేవుడు సహాయం చేస్తాడు మన బహుమానం ఆయన దగ్గర ఉంది నీ విశ్వాసానికి కొలత వేసి దేవుడు బహుమానం ఇస్తాడు…

Instagram

YouTube

Facebook

X

Threads

Telegram

 

Isaiah 65:22 Explanation in Telugu

Isaiah 65:22 Explanation in Telugu

Isaiah 65:22 Explanation in Telugu

 

 

Leave a Comment