యెషయా 41:12 నీతో కలహించువారిని నీవు వెదకుదువు గాని వారిని కనుగొనలేకపోవుదువు నీతో యుద్ధము చేయువారు మాయమై పోవుదురు అభావులగుదురు.

Isaiah 41:12 Explanation in Telugu యెషయా 41:12 నీతో కలహించువారిని నీవు వెదకుదువు గాని వారిని కనుగొనలేకపోవుదువు నీతో యుద్ధము చేయువారు మాయమై పోవుదురు అభావులగుదురు.

Isaiah 41:12 Explanation in Telugu/ Isaiah 41:12 Meaning in Telugu
Isaiah 41:12 Explanation in Telugu/ Isaiah 41:12 Meaning in Telugu

 

కొన్నిసార్లు కొంతమంది కలహ ప్రియులు ఉంటారు కలహాన్ని ప్రేమించే వాళ్ళు ఉంటారు నీతో పోట్లాడడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు నువ్వు మాట మాట్లాడితే ఆ మాటను వక్రీకరించి రకరకాలుగా త్రిప్పి ఏదో విధంగా నిన్ను అబాసు పాలు చేయాలని లేదా నిన్ను ఇబ్బంది పరచాలని చాలామంది ప్రయత్నం చేస్తుండొచ్చు వారు ఎక్కడ ఉంటారు వేరే దేశంలో రావక్కర్లేదు కొన్నిసార్లు నీ కుటుంబ సభ్యులే మీ సొంత అన్నో తమ్ముడో అక్కో చెల్లో లేదా తల్లిదండ్రుల్లో మీరందరూ బాగుంటే మీ చుట్టుపక్కల ఉండేవారో లేదా దూర బంధువులో దగ్గర బంధువులో ఏదో విధంగా కలహాన్ని ప్రేమించే వాళ్ళు ఉంటారు కలహ ప్రియులు అని బైబిల్లో రాయబడింది

కీర్తనలు 120:6

కలహప్రియుని యొద్ద నేను చిరకాలము నివసించినవాడను.

కీర్తనలు 120:7

నేను కోరునది సమాధానమే అయినను మాట నా నోట వచ్చినతోడనే వారు యుద్ధమునకు సిద్ధమగుదురు.

 

నేను కోరుకునేది ఎప్పుడు సమాధానమే కలహ ప్రియులు ఎప్పుడు నాతో ఉంటారు కానీ నేను కోరుకునేది మాత్రం సమాధానమే అయితే నా మాట మాట్లాడిన తోడనే వారు యుద్ధానికి సిద్ధపడుతున్నారు ఇది మామూలు పోట్లాడట కాదట యుద్ధానికే కొన్ని కుటుంబాల్లో అలాగే ఉంటది నీవు భక్తిలో కొనసాగుతున్నప్పుడు విశ్వాసంలో కొనసాగుతున్నప్పుడు నీ భావనను ఎవరు అర్థం చేసుకోరు నీ ఎవరికి అర్థం అవ్వదు నువ్వు ప్రభువు మీద ఆధారపడి నడుస్తున్నప్పుడు విశ్వాసంలో బలపడుతున్నప్పుడు నీ మాటలు వారికి చాలా కొత్తగా ఉండొచ్చు ఆ సందర్భంలో వారు నీతో యుద్ధం చేయాలని కలహించాలని చాలామంది ప్రయత్నం చేస్తుండొచ్చు దావీదు జీవితంలో కలహ ప్రియుడు సౌలు తాను చేయలేని పనిని మరొకరు చేసినప్పుడు సంతోషించాల్సింది పోయి అతడు నాకన్నా పేరు పొందుతున్నాడు నాకన్నా ఉన్నతమైన స్థానానికి వస్తాడేమో నన్ను దాటేస్తాడేమో అన్న అసూయ ఎప్పుడైతే అతనిలో బయలుదేరిందో ఆ అసూయ సౌలును కలహ ప్రియుడిగా మార్చేసింది ఈ రోజుల్లో కూడా చాలా మంది అసూయతో బాధపడుతున్నారు ఒక మాట నేను చెప్తాను అసూయ క్యాన్సర్ కన్నా భయంకర వ్యాధి ఒకవేళ నీలో అసూయ పెరుగుతుందా ఎవరైనా నీకన్నా చూడడానికి బాగున్నా బాగా చదువుకుంటున్న ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న లేదా దేవుని చేతిలో వాడబడుతున్న వారికి దేవుడు ఇచ్చిన అవకాశాలని చక్కగా సద్వినియోగం చేసుకుని ఎక్కడ సోమరిపొతుగ ఉండకుండా లేజీనెస్ తో ఉండకుండా దేవుని చేతిలో వాడబడుతుంటే అలాంటి వాళ్ళని చూసి ప్రార్థించాల్సింది పోయి లేదా వారిని బట్టి దేవుని స్తుతించాల్సింది పోయి కొంతమంది ఎప్పుడూ కూడా విమర్శనాత్మకంగా మాట్లాడుతూ వారిని ఏదో విధంగా క్రిందకి లాగాలని ప్రయత్నం చేస్తుంటారు నువ్వు అసూయకు గురైతే తప్పులేదు కానీ నువ్వే అసూయ పడుతుంటే మాత్రం చాలా డేంజర్ లో ఉన్నావ్ చాలా అపాయంలో ఉన్నావ్ అసూయ చేత చచ్చేదరు అని బైబిల్ లో రాయబడింది ఆ అసూయ ఆఖరికి నిన్ను ఇబ్బందులకు నెట్టేస్తది శరీరంలో ఆరోగ్యం పాడైపోద్ది మానసికంగా కృంగిపోతావ్ ఆధ్యాత్మికంగా నీ జీవితంలో పడిపోతావ్ ఏమీ సాధించలేని పరిస్థితిలో ఉండిపోతావ్ కానీ దేవుని చిత్తానుసారంగా నువ్వు ముందు కొనసాగాలంటే అసూయను జయించాలి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో ఆయనతో నువ్వు సహవాసం చేస్తున్నప్పుడు ప్రార్థనలు ఎదుగుతున్నప్పుడు నీ మోకాళ్ళు దేవుని సన్నిధిలో ఉంచినప్పుడు లేఖనుసారంగా నువ్వు జీవించడం మొదలు పెట్టినప్పుడు అసూయను చాలా ఈజీగా నువ్వు జయించొచ్చు దేవుడు నీకు అలాంటి సహాయం చేస్తాడు నువ్వు నిజంగా దేవునితో చెప్పగలిగితే ప్రభువా ఫలానా వ్యక్తి మీద నాకు అసూయ పెరుగుతుంది ఫలానా వారిని చూసినప్పుడు మత్సరం కలుగుతుంది నన్ను క్షమించు ప్రభువా నాకు సహాయం చెయ్యి అని ప్రార్థన చేయగలిగితే దేవుడు కచ్చితంగా నీకు సహాయం చేస్తాడు నీకు విడుదల ఇస్తారు ఆయన దేవుడు విడుదల చేయడానికి ఈ లోకానికి వచ్చాడు కలహప్రియుడు సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపి ఏదో విధంగా దావీదుని ఇబ్బంది పరచాలని ప్రయత్నం చేశాడు కానీ దేవుడు దావీదు పక్షంగా ఉన్నాడు ఆ కారణాన్ని బట్టే దేవుని హత్తుకున్న దావీదు నానాటికి వర్ధిల్లాడు కానీ సౌలు అతని కుటుంబం నిరసిల్లిపోయిందని లేఖనాలు స్పష్టీకరిస్తున్నాయి నీ చుట్టూ కూడా కలహ ప్రియులు ఉన్నారని కలవరపడొద్దు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయ్ ఇక్కడ దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు నీతో కలహించు వారిని నువ్వు వెతుకుతావు గానీ ఒకనా సమయంలో నువ్వు వారిని కనుగొనవు ఎందుకంటే దేవుడు వారిని నీకు దూరం చేస్తాడు నీ ప్రార్థన దేవుడు వింటాడు నీకు ప్రశాంతతను ఇచ్చే దేవుడు నెమ్మదిని ఇచ్చే దేవుడు ఆ కలహ బుద్ధితో ఉన్న వారి నుండి విడిపించి నీకు శ్రేష్టమైన ఆశీర్వాదాలు దేవుడు సిద్ధపరుస్తాడు అంత మాత్రమే కాదు ఆ కింద భాగంలో రాయబడింది నీతో యుద్ధము చేయువారు మాయమైపోవుదురు వారు అభావులగుదురు అన్నాడు అభావులు అంటే అర్థం ఏంటంటే శూన్యము అని అర్థం వారు ఇంకా కనబడరట నీతో యుద్ధం చేసేవారు ఉదృతంగా పోరాడేవారు కనబడరు దేవుడు వారిని మరుగు చేస్తాడు వారిని దూరం చేసే సమయం రాబోతుంది అభావులు అనే మాట చూడండి అభావం అనే మాట ఎప్పుడు వాడతారు అంటే ఈ గదిలో ఏమీ లేవు అంతా అభావమే అంటే శూన్యమే గది అంత అభావంతో నిండి ఉంది అనే పదాలు తెలుగులో వాడతారు దాని అర్థం ఆ గదిలో ఏమి లేవు అంతా శూన్యంగా ఉంది లేదంటే ఖళీగా ఉంది అని చెప్పడానికి అభావము అనే పదాన్ని తెలుగులో వాడతాం ఇక్కడ దేవుడు అంటున్నాడు ఎవరైతే నీతో యుద్ధం చేయడానికి వచ్చారో వారు అభావులు అవుతారంటే దేవుడు వారిని కనుమరుగు చేస్తాడు గొలియాతు ఇశ్రాయేలు ప్రజలను శాశించాడు కానీ దేవుడు గొలియాతును కనుమరుగు చేశాడు ఒకవేళ ఈరోజు నువ్వు తీవ్రమైన యుద్ధంలో ఉన్నావా కుటుంబ సభ్యులు కావచ్చు లేకపోతే మరొకళ్ళు కావచ్చు వారు ఏదో అయిపోతారని నేను చెప్పట్లేదు కానీ దేవుడు ఆ కలహాన్ని మానిపి ప్రశాంతతను మీ మధ్య ఇస్తాడు ఎందుకంటే మన దేవుడు శాంతి ప్రదాత సమాధానకర్త నా యొద్దకు రండి మీకు విశ్రాంతిని ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు యేసయ్య పాదాలు పట్టుకుందాం నీతో కలహించు వారిని చూసి కృంగిపోవద్దు యుద్ధం చేసే వారిని చూసి బెదిరిపోవద్దు ప్రభువును పట్టుకో ప్రభువు నిన్ను విడుదల చేస్తాడు…

 

Instagram

YouTube

Facebook

X

Threads

Telegram

 

Isaiah 41:12 Explanation in Telugu

Isaiah 41:12 Explanation in Telugu

Isaiah 41:12  Explanation in Telugu

Leave a Comment